Sunday, May 18, 2008

సొగసు చూడ తరమా

సొగసు చూడ తరమా.. నీ సొగసు చుడ తరమా
మరునినారి నారి గా మారి మదిని నాటు విరిశరమా

కులుకే సుప్రభాతాలైకునుకే
స్వప్నగీతాలై
ఉషాకిరణము నిషాతరుణము
కలిసె కలికి మేనిగా
రతి కాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో

సొగసు చూడ తరమా నీ సొగసు చుడ తరమా
మరునినారి నారి గా మారి మదిని నాటు విరిశరమా

పలుకా చైత్రరాగలే
అలకా గ్రీష్మ తాపలే
మదే కరిగితే అదే మధుజరి
చురుకు వరధ గౌతమి
చెలిమి శరత్ పౌర్నమి
అతివె అన్ని రుతువులయ్యే

సొగసు చూడ తరమా.. నీ సొగసు చుడ తరమా
మరునినారి నారి గా మారి మదిని నాటు విరిశరమా