Monday, June 23, 2008

చేతన

మేడ మీద సన్నజాజి చెట్టు పక్కన చాప వేసుకోని కూర్చున్నాను......

రోజు ఆ సమయానికి అలా మేడ మీద కూర్చోని కాసేపు ఫ్లూట్ వాయించటం నా అలవాటు....

ఎదైనా పని పడి ఏ రోజు అయినా అలా వాయించుకోలేకపొతే ఆ రొజు నిద్ర ఏ పట్టెది కాదు

యధాప్రకారం ఆ రోజు కుడా అలానే కూర్చోని ఫ్లూట్ వాయించుకుంటున్నా......ఒక పాటకి మరో పాటకి మధ్యలో కాసేపు ఆగి ఆ చల్ల గాలి ని ఆస్వాదించటం నా అలవాటు.... ఆ అలవాటు ప్రకారమే.... ఆగి సన్నజాజి చెట్టు వైపు చూస్తూ ఉండగా వినిపించాయి....చెప్పట్లు....

తల వెనక్కు తిప్పి చూస్తే...పక్క ఇంటి వారి మేడ మీద కనపడింది ఆ అమ్మాయి.... నేను చూడగానే..... చప్పట్ల వేగం కాస్త పెంచి...అద్భుతం గా వాయించారు అండి.....ఇంకొక్క పాట వాయించారు...సిరివెన్నెల సినిమాలో ....విరించినై విరచించితిని ఈ కవనం ...విపంచినై వినిపించింతిని ఈ గీతం... ఆ పాట వాయించండి... ప్లీజ్ ప్లీజ్ అంటూ అడిగింది.....కళ్ళు మూసుకొని వాయించేసాను.........పాట మధ్యలో ఆ అమ్మాయి తన గొంతు కలిపింది.... ఎదో తెలియని ఉద్వేగం నాలో..... ఆపకుండా వాయిస్తునే ఉండిపొయాను........పాడిన చరణమే మళ్ళి పాడుతూ ఆ అమ్మాయి కుడా నాతో గళం కలిపింది.... అలా ఎంత సేపు విహరించామో ఆ సంగీథ సరస్సులో తెలియనేలేదు....ఎక్కడున్నావే…. అంటూ వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను...

అయ్యొ మా అమ్మ అండి ..... వెళ్ళాలి.... చాలా బాగా వాయించారు మురళీ గారు.... మళ్ళీ రేపు కుడా రండి తప్పకుండా ఇంకోన్ని పాటలు పాడుకుందాం......బొల్డన్ని ఉన్నాయి.... అంటూ చెంగు మని గట్టు మీద నుంచి దూకి కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయింది

అసలేమైందో ఒక్క నిమిషం అర్ధం కాలేదు....అలా చల్ల గాలి కి పడుకోని నేను కల గాని ఎమన్నా కన్నానా... అని చూసుకున్నాను.....ఎమో అర్ధమే కాలేదుఎప్పుడూ లేనంత భావోద్వేగం ....నాకే నా మురళీ గానం మొదటిసారి గా అత్యద్భుతంగా అనిపించింది...ఆ రాత్రి పడుకున్నాను అనే కాని....నిద్ర పొవాలనిపించట్లేదు....నిద్రా దేవత వస్తున్న కుడా...ఆవిడకి ఆ రోజు సెలవిచ్చేయాలనిపించింది....అలానే ఆ నిమిషం నిలిచిపోతే బాగుండు అనిపించింది....మళ్ళి మళ్ళి అదే రాగం మనసులో కదలాడుతూ ఉండిపొయింది....

**********************************************************

రాత్రి ఆలస్యంగా పడుకొవటం వల్ల ఆలస్యం గా లేచాను...కాలేజ్ కి టైం అయిపోతోంది అని త్వరగా తయారు అయ్యి బయలుదేరాను...బస్ స్టాప్లో నిల్చోని ఉండగా చెవిలో వినిపించింది ఒక చిన్న అరుపు..."కాలేజ్ కే నా" అంటూవెనక్కు తిరిగి చూస్తే ..ఒక అమ్మాయి....రాత్రి నా చేత అంత అద్బుతంగా ఫ్లూట్ వాయించేలా చేసిన ఆ చేతన ఈ అమ్మాయి ఏ కాబోలు....మీరూ....అన్నాను... ఓకింత తడబడుతూ...

మురళీ గారు..నేను అండి..నిన్న మేద మీద.....సిరివెన్నెల..సన్నజాజులు.... అమ్మ పిలుపు...

ఒహ్...మీరేనా...ఔనా కాదా అని చుస్తున్నాను.... అయిన నా పేరు మురళీ కాదండి.... ప్రకాష్.....

ఎమో అండి...మీ పేరు ఎదైనా...మీ మురళీ గానం విన్నాక అప్రయత్నం గా ఆ పేరు నా నోట అలా వచ్చేసింది మిమ్మల్ని అలానే పిలిస్తే ..పలుకుతారు గా..... అంటూ నా వైపు చుసింది

అప్పటిదాకా గమనించనే లేదు....చక్కటి కళ్ళు....ఎదో చెప్తునట్టు గా చాలా భావవ్యక్తీకరణ ఉన్న కళ్ళు....సంద్రంలోని సాంద్రత ఆ కళ్ళల్లో….అలా చూస్తుంటే ఆ ప్రవహంలో కొట్టుకుపోతానేమో అనిపించింది….తేరుకొని ఆ అమ్మాయి వైపు చుస్తూ…అయితే మిమ్మల్ని కుడా నేను చేతనా అని పిలుస్తాను...మరి మీరు కుడా పలకండి...అన్నాను

చేతనా నా....ఎందుకలా ... అన్నదిమరి మీరిచ్చిన ప్రొద్భలంతోనేగా...ఎప్పుడూ లేనంత బాగా వాయించగలిగాను....నాలో ఆ చైతన్యం కలిగించిన మిమ్మల్ని చేతన అనే పిలవాలనిపిస్తోంది..అన్నాను

సరే అలానే కానీయండి.... పేరు ఎదైతే ఎమైందిలేండి.....అదిగో మీ బస్ వచ్చింది వెళ్ళండి అంటూ బస్ వైపు చేయి చుపించింది

చేతినిండా గల గల మంటున్న మట్టి గాజులు....వెళ్ళి బస్ ఎక్కి కుర్చున్నాను....ఆ రోజు అంతా కాలేజ్ లో ఒకటే ఆలోచన.... ఆ అమ్మయి ఏ కళ్ళలో కదలాడింది...నలుపు అనే చెప్పాలి....కాని ఎదో తెలియని ఆకర్షణ.... చక్కటి కళ గల మోము...వాలు జడ..... ఆ రోజు రాత్రి గట్టు దిగి పరిగెత్తినప్పుడు....ఘల్లు ఘల్లు మన్న గజ్జెలు....ఇంకా మదిలో అలానే ఘల్లు ఘల్లు మంటూ..నా మది నంతా తడిపేస్తొంది

ఆమె ప్రతి కదలికలో ఎదో తెలియని రాగం...నన్ను కాక మరెవరినైన అడిగితే...ఆ అమ్మాయి మాములుగా ఉంటుంది అనే చెప్తారేమో

కాని నా కళ్ళకి మాత్రం .... తోలకరి జల్లు లా.....పొగడ పూవు లా...కోయిల పాటలా.....సంధ్యారాగం ల.....గోదావరి లా....... ఇలా ఎన్నో అనుబూతుల సమ్మేళనం లా అనిపిస్తోంది....

**********************************************************

విశాఖపట్నంలో ఉండటం నా అద్రుష్టం అనుకుంటూ ఉంటా ఎప్పుడూ....ఎందుకంటే బీచ్ కి వెల్లచ్చు ఎప్పుడు కావలంటే అప్పుడు...

బీచ్లో కూర్చోని పుల్ల ఐస్ తింటూ.... క్రిస్ణశాస్త్రి గారి కవిత్వం చదువుకుంటూ ...మనసులోనే నమ్మస్సులు అర్పిస్తూ ఉండగా ఎందుకో నా చూపు అటు గా వెళ్ళింది

చేతన.......

నీళ్ళలోకి ముందు ముందు కు వెల్తూ....తన కాళ్ళను తడిపేస్తున్న అలలకు...బహుమతి గా తన చిరునవ్వు ని ఇచ్చి పంపుతోంది....తనని చూడగానే గుండే జల్లు మన్నది..... ఎన్నో కొత్త కొత్త రాగాలు నేర్పిస్తోంది ఈ అమ్మాయి నాకు ....

నా వైపు చుడాగానే..చేయి ఊపాను.... చెంగు చెంగు మంటూ లేడి పిల్ల లా అడుగులు వేసుకుంటూ వచ్చి నా ముందు మోకాళ్ళ మీద కూర్చోని...ఎగసి వస్తున్న శ్వాస ని అదుపు చేసుకుంటూ....మురళీ గారు ..మీరు వచ్చేసరా..హమ్మయ్య ఒక్క దాన్నే ఉన్నాను ఎలాగబ్బా అనుకుంటున్నాను ...

ఎంటి చేతిలో..క్రిస్ణశాస్త్రి గారి కవిత్వమా... అబ్బో..... అయినా మిమ్మల్ని చూస్తేనే అనిపిస్తోంది లేండి...

ఒక క్రిస్ణశాస్త్రి ..ఒక నండూరి వారు...ఒక ఆత్రేయ గారు ...ఇలాంటి కవిత్వాలే చదువుతారని ...అంటూ గల గల నవ్వేసింది

చివ్వుక్కు మన్నది మనసు...అంటే ఎంటి ఈ అమ్మాయి ఉద్దేశ్యం....పప్పు సుద్ద గాడిని అనా....ఇలాంటి కవిత్వాలు చదివే వాళ్ళని చూసి అలా నవ్వలనిపిస్తుందా ఈ అమ్మాయి కి....తమాయించుకొని అడిగాను...

"మీరు ఎటువంటి సాహిత్యం చదువుతారేంటి....?"నేనా....శ్రీ శ్రీ లాంటి విప్లవ కవులని ఇష్టపడతా..... ఉడుకు రక్తం కదా అంటూ మళ్ళీ పెద్ద పెద్ద గా నవ్వేసింది....

జడ పట్టుకోని ....ముందు ఆ నవ్వు ఆపుతావ లేదా అనాలనిపించింది....నా భావం అర్ధం అయ్యినట్టు గా...."అయ్యో మురళీ గారు..చూడబొతే మరీ నెమ్మదస్తుడి లా ఉన్నారే.... అయినా లోకానాం భిన్న రుచిహీ అన్నారు పెద్దలు..... జిహ్వకోక రుచి.....పుర్రె కొక బుద్ధి....., నేను భావ కవులని ఎమన్నా అన్నంత మాత్రాన.... పుషవిలాపం ప్రభ తగ్గుతుందా లేక క్రిస్ణపక్షం కీర్తి చెదురుతుందా.... ఎవరు ఎమనుకున్నా ...మీరు ఎమనుకుంటున్నారు అన్నదే ముఖ్యం కదండీ.......

మనం ఎల ఊహించుకుంటామో...మనం ఎలా ఆలొచిస్తామో...మనకి సమజం అలానే కనపడుతుంది అట..... అందుకని...నా మాటలని పక్కన పెట్టి...ఒక అద్భుతమైన కవిత చెప్పండి ..వింటాను..అంటూ

కాళ్ళు చాపుకోని...రెండు చేతులు వెనుక ఇసుక మీద పెట్టుకొని... నా వైపే చూస్తూ ఉన్నది....

అప్పుదే చూసాను...ఘల్లు ఘల్లు మంటూ నా మదిలో ఏ మూలనో నిలిచిపొయిన ఆ గజ్జెలు....

ఆమే పాదం నల్లటి మేని చాయలో ఉన్నా..ఎందుకో ఆ పట్టీలు ఆ కాళ్ళకి అందాన్ని తెచ్చెయా అనిపిస్తోంది..... ఇసుకలోకి జారి ఉన్న ఆ వాలు జడ.....అందులో ఉన్న కనకాంబ్రాలు.... చేతిని ఇసుకలో పెట్టటం వల్ల.....మనికట్టు వరకూ జారి..సగం ఇసుకని తాకిన ఎర్రటి మట్టి గాజులు...

సొగసు చూడ తరమా అనిపించింది ఒక్కసారి....

హలో భావ కవి గారు...ఒక్క కవిత చెప్పండి సార్ అంటూ తను అన్న మాటలకి ఈ లోకం లోకి వచ్చి పడ్డా....

"అమ్రుతం కురిసిన రాత్రి...

అందరూ నిద్రపోతున్నరు...

నేను మాత్రం కొండ దాటి...కోన దాటి...

వెన్నెల మైదానం లోకి వెళ్ళి నిలుచున్నాను..

జలజల మని కురిసింది వాన...

జాలువారింది...అమ్రుతంబు సొన...

దొసిళ్ళ నిండా తాగి తిరిగి వచాను...అందుకే నేను అమరుడినని ఎవరికి తెలియదు..."

వినగానే...నా వైపు చుస్తూ..."అమ్రుతం కురిసిన రాత్రి".... "నా అక్షారాలు వెన్నెలో ఆదుకునే ఆడపిల్లలు" .....బాలగంగాధర్ తిలక్ .... అం తేనా అంటూ అడిగింది

మీకు బాగా ఇష్టం కాబోలు తిలక్ కవితలు అంటూ రెండు చేతులకి ఉన్న ఇసుక దులుపుకుంటూ లేచి నిల్చుంది...

ఔను...మీకేలా తెలుసు అని అడిగా...

ఆ కవిత్వం చెప్తునప్పుడు మీ కళ్ళలో కదలాడిన ఆ మెరుపు చుస్తే ఎవ్వరికైనా తెలుస్తుంది లేండి

తిలక్ అక్షారలు వెన్నెలో ఆడుకునే ఆడపిల్లలు అయితే..... మీ ఉద్వేగం సముద్రంలో ఉందె ఆగని అలలు కాబోలు... అంటూ నవ్వేసిందిగట్టిగా

లాగి వదిలిన వీణ తంత్రుల సవ్వడి ఆ నవ్వు

మీరు కుడా ఒక కవిత చెప్పండి ...విప్లవ కవి గారు అన్నాను

"నిప్పులు చిమ్ముకుంటూనింగికి నే నెగిరిపొతే

నిబిడాశ్చర్యంలో వీరు

నెత్తురు క్రక్కుకుంటూనేలకి నే రాలిపొతే

నిర్దాక్షిన్యం గా వీరే"

మా శ్రీ శ్రీ గారి మహప్రస్థానం.....మాకు దొరికిన మహ ప్రసాదం అంటూ రెండు అడుగులు ముందుకు వేసి నా ముందు నిల్చుంది

నాకు ఎందుకో నవ్వు వచ్చింది.... పసి పాప లో ఉన్న అంథ నిర్మలత్వం ఆ మోములో....

*******************************************************************************

పరీక్షలు వచ్చేసాయి.... చాలా హడావిడి గా చదువుకోవటంలో మునిగిపొయి ఉన్నాను...

మేడ మీద కూర్చోని లెక్కల రాక్షసితో కుస్తీ పడుతుండ గా

గోడ దూకి మేడ మీదకు వచ్చింది చేతన..

ఈ ఆరు నెల్లల్లో మంచి స్నేహితులం అయిపొయాముఎన్నో ఎన్నెన్నో చర్చించుకుంటూ..తర్కించుకుంటూ...పాడుకుంటూ... మీరు నుంచి నువ్వు దాక వచ్చేసింది మా స్నేహం....

ఎంటి మురళీ చదువుకుంటున్నావా....నీ అంత ఒపిక నాకు కూడా ఉంటే బాగుండేది.... నాకేమో ఆ పుస్తకాలు చూస్తేనే ఎక్కడలేని నిద్ర వచ్చేస్తుంది అంటూ నా పక్కన కూర్చుంది....

తన వైపు తిరిగి కుర్చొని "ఎందుకు చేతనా, నీకు పుస్తక పటనం అలవాటే గా...మరి పాపం క్లాస్ పుస్తకాలు చేసుకున్న పాపం ఎంటి అన్నాను"
ఎందుకంటే అవి క్లాస్ పుస్తకాలు కాబట్టి...

అయినా మనం ఎం చదివినా అందులో అర్ధం ఉండాలి మురళీ...అప్పుడే నేను చదవగలను...

అసమర్ధుడి జీవ యాత్ర లాంటి ఈ క్లాస్ పుస్తకాలని నాకు చదవాలనిపించదు

పైతాగరస్ థీరం అంటూ ..హైపాటెనెస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ అంటారు....నిజ జీవితంలో ఎక్కడ ఎలా ఉపయోగ పడుతుందో చెప్పనే చెప్పరు...
కచ్చితం గా ఎదో ఒక రూపంలో అది ఉపయోగ పడుతుంది ...కాని అది ఎలానో చెప్పకుండా కళ్ళు మూసుకొని బట్టీ కొట్టమంటారు

తెనాలిరామ క్రిస్ణుడు..దొంగలు పడ్డప్పుడు ఎంత తెలివి గా వ్యవహరించి వాళ్ళ చేత తోట కి నీళ్ళు పట్టించాదో చెప్తారు..కాని ఆ తెలివి ఉపయొగించి జీవిథంలో ఎదురయ్యే ప్రతి ఆటంకన్ని ఎల తప్పించుకొవచ్చో చెప్పరు...

అందుకే ఈ క్లాస్ పుస్తకాలంటే నాకు నిద్ర పుచ్చే జొల పాటలు

సర్లే నువ్వు చదువుకో..నేను సన్నజాజులు కొసుకోవటానికి వచ్చాను అంటూ లేచి సన్నజాజులు కొయటం మొదలుపెట్టింది....

చేతనా....పుష్పవిలాపం చదివావా అని అడిగాను

సర్రున నా వైపు తిరిగి…
"ఊలుదారాలతో గొంతు కురి బిగించి

గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ముఅకట!

దయలేనివారు మీ యాడువారు"

ఇదెనా మీరు గుర్థుచేయదలచుకుంది??

అయ్య భావ కవి గారు…. నేను మరీ అంత సున్నితం కాదు ,ఒక పక్క పుషవిలాపం చదువుతూ..మరో పక్క పూల మాల కట్టే రకాన్ని..కాబట్టి నాకు అలాంటివి చెప్పే ప్రయత్నం కూడా చెయ్యకండి సార్ అంటూ మళ్లీ వెనక్కు తిరిగి పూలు కోసుకోవటంలో పడిపొయింది…నాకు ఒకింత కోపం వచ్చింది…
చేతనా..నువ్వు ఇలా మాట్లాడితే నిన్ను గడసరి పిల్లా అంటారు అందరూ అన్నాను

పెద్దగా నవ్వుతూ నా వైపు చూసింది…అయ్యో మురళీ….నీకు ఒకటి చెప్తా ఉండు అంటూ తన వోనిలో తుంచి ఉంచిన పూలని చాప మీద పోస్తూ నా పక్కగా కూర్చున్నది….మనిషికి వచ్చే కష్తాళ్ళో తొంబై సాతం కష్టాలకి ఒకటే మూల కారణం ….అది ఎంటో తెలుసా …."ఎదుటి వాడి దగ్గర మంచి అనిపించుకోవాలన్న తపన ….నేను ఇలా మాట్లాడితే వాడు ఎమనుకుంటాడో
నేను ఇలా చేస్తే ఎమనుకుంటాడో..వాళ్ళ ఫలానా అభిప్రాయంతో ఎకీభవించకపోతే ఎమనుకుంటారో...నన్ను తప్పు గా అర్ధం చేసుకుంటారేమో…ఇలాంటి వన్నిటి వల్లనే సగం కష్టాలు మొదలవుతాయి….అలా ఎవరినో సంత్రుప్తి పరిచే ప్రయాసలో..…పాపం లోపల ఉన్న అంతరాత్మ గొంతు నొక్కేస్థూ ఉంటాం….నీవు భలే మంచి వాడివి అన్న పేరు ని సంపాదించి…ఆ సహబాసుల సవ్వడిలో...అంతరాత్మ అర్థనాదాలను నోక్కేస్తాం….ఛివరకు…ఎప్పుడో…ఎదో ఒక నాడు…. తెలియని ఎదో అసంత్రుప్తి వెన్నాడుతూ ఉంటుంది…
వెనక్కు తిరిగి చూసుకుంటే తెలుస్తుంది….ఎందరినో సంత్రుప్తి పరిచిన మన ఈ ప్రవర్తనలో మనల్ని మనమే కోల్పొయామని…."నాకెందుకు చెప్పు ఈ కష్టాలన్నీ… అందుకే తొచినట్టు ఉంటాను…తోచింది మాట్లాడతాను….ఎవ్వరిని నొప్పించే ఉద్దేశ్యం లేదు….అలా పొరపాటున నొప్పించినా….నా మనసు అర్ధం చేసుకునే నీ లాంటి స్నేహితులు ..నన్ను నా ఈ ప్రవర్తనను కూదా అర్ధం చేసుకుంటారు…..కాబట్టి చింత ఎమీ లెదుఅంతూ ముగించింది తన దీర్గ ఉపన్యాసము

*********************************************************************************పరీక్షా ఫలితాలు వచ్చేసాయి….

నేను కాలేజీలో రెందో స్థానంలో నిలిచాను…అమ్మ కారేట్ హల్వా చేసింది……

ఓరెయ్ ఆ పక్కింటి మహలక్ష్మి కి కూడా కాస్త పెట్టి రా రా…..అంటూ నా చేతిలో గిన్నె పెట్టింది….

ఆ అమ్మయి పేరు మహాలక్ష్మి అని ఎవరు చెప్పారమ్మ…. అని అడిగాను…

ఏవరు అనలేదు రా…ఊరికే మహలక్ష్మి లా ఉంటుంది అని నేనే అన్నానులే…
ఆ అమ్మయి ఇంట్లో తిరుగుతూ ఉంటే….మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటే ఎంత బాగుండేది అనిపిస్థుంతుంధి రా నాకు అంటూ లోపలకి వెళ్ళిపొయింది అమ్మ….

నేను గిన్నె తీసుకొని మెల్లగా చేతన వల్ల ఇంట్లోకి వెళ్ళాను..

ఇదే మొదటి సారి వాళ్ళఇంతికి ఇంటికి వెళ్ళటం…ఏవరండీ లోపల అని పిలిచాను…

.ఏంత సేపు పిలిచినా లోపల నుంచి బదులు లేదు….మెల్లగా అడుగు లోపల పెట్టాను…..

ఏదో గదిలో నుంచి మెల్లగా వినపడుతున్న వయొలిన్….

పంచరత్న కీర్తన….ఎందరో మహనుభావులు…..వినపడుతోంది సన్నగా…వయొలిన్ మీద…

మెల్లగా అటు గా వెళ్ళాను….హతాసుడినైపొయాను……..వాయించేది చేతన….

అలానే వింతూ నిల్చుండిపొయాను….ఏంత చక్కటి ప్రగ్ణ….

ఏంత శ్రావ్యం గా వాయిస్తొంది….

గమకాలు పలుకుతున్న ఆ వయొలిన్ దో ఆ అందం…లేక పలికిస్తున్న ఆ చేతులదో…..

మురళీ ఎప్పుడొచ్చావ్ అన్న చేతన పిలుపుకి ఉలిక్కిపడి చూసాను…ఛేతనా…నువ్వు ఇంత బాగా వయొలిన్ వాయించగలవు అని నాకెప్పుడూ ఎందుకు చెప్పలేదు అన్నాను ఆశ్చేర్యం నిండిన గొంతుతో….

నన్ను మోసం చేసింది అన్న భావన ఎదో నాలో…

ఇంత చక్కటి కళ చేతిలో ఉన్న అమ్మాయి ముంద నా లోల్లాయి పాటలు అనిపించింది ఒక్క నిమిషం

"నాదేముంది మురళీ….ఐదేళ్ళు నేర్చుకున్నను గనుక ఎదో వాయించగలుగుతున్నాను….ఏ గురువు లేని తీయటి పాటల కోకిలమ్మ లాంటి నీ మురళీ నాదం ముందు నేను ఎంత చెప్పు" అంటూ…నా చేతిలోని స్వీట్ చూస్తూ….ఏంటి విశెషం స్వీట్ పట్టుకొని మా ఇంటికి వచ్చావ్ మొడతి సారి అంటూ ప్రశ్నించింది
నేను కాలేజ్లో రెందో స్థానంలో నిలిచాను..అందుకని మా అమ్మ ఇది చేసి నీకు కూడా ఇచ్చి రమ్మంది…అని నా చేతిలో ఉన్న గిన్నె తన చేతిలో పెట్టాను…

ఏవరమ్మా వచ్చింది అంటూ బైటకు వచ్చరు ఒక పెద్దావిడ….

అమ్మా …..మురళీ అని చెప్తుంటానే….ఇతనే అంటూ పరిచయం చేసింది…

నువ్వేనా బాబు…రా లోపలకి….అంటూ నన్ను మధ్య గదిలొకి తీసుకెళ్ళారు….

ఇందాక సరిగా గమనించనే లెదు…. ఛక్కగా బారులు తీరిన పుస్తకాలు….ఓక పక్క గా పెట్టి ఉన్న బహుమతులు….ఓక మూల గా వీణ…..
ఛక్కటి అభిరుచి గలవాళ్ళు అని టక్కున చెప్పేసేయచ్చు ఆ ఇంటిని చూసి….

కూర్చో బాబు…కాస్త సేమ్యా చేసాను…తెచ్చి పెడతాను అంటూ లోపలకి వెళ్ళారు చేతన వాళ్ళ అమ్మ గారు….

ఛేతన కూడా అమ్మతో పాటే లోపలకి వెళ్ళింది…

పుస్తకాల అర ముందు కాసేపు నిల్చున్నాను…ఇంతలో..ఒకచేతిలో స్వీట్ మరో చేతిలో పనస తొనలు పట్టుకొని వచ్చింది చేతన…

ఫనస తొనలు చూడగానే ప్రాణం లేచి వచ్చింది

నాకు పనస తొనలంటే చాలా ఇష్టం అన్నాను….తెలుసు అందుకే గుర్తుపెట్టుకొని మరీ ఉంచాను నీ కొసం అన్నది చేతన…నీకెలా తెలుసు అని అడిగాను…
మీ అమ్మ గారు అన్నారులే ఒకసారి ఎప్పుడో అన్నది….

ఏందుకో మొదటి సారి చాల హాయిగ అనిపించింది…నా గురించి నా అభిరుచుల గురించి కూడా అలోచిస్తుంది అన్నమాట

ఆ తలపే నా మది ని తడిపేసింది…మొదటి సారి అర్ధం అయ్యింది…. వ్యక్తీకరించని భావాలలో కూడా ఇంతటి తీయదనం ఉందని…ఇప్పుడు తన ప్రవర్తనలో చూపించిన ఆ తీయదనం..మాటల్లో చూపిస్తే ఇంతటి మాధుర్యం కచ్చితం గా వచ్చేది కాదేమోనా

ఈ మధుర భావ తరంగానికి అడ్డు కట్ట వేస్తూ వినపడింది ఒకగొంతుక…

ఓసెయ్ సుమతీ...ఎక్కడ చచ్చారే….తల పగిలిపోతొంది….కాఫీ పట్టుకు రా…. అంటూ…

నా ఫ్రశ్నార్దకమైన చూపు చూసి …నాకు దగ్గరగా జరిగి…చెవిలొ చెప్పింధి చేతన..మా నాన్న గారు…రాత్రి బాగ తాగేసారులే..అందుకే ఇంకో గంటా రెండు గంటలు వీరంగం వేస్తారు..నువ్వు వెళ్ళిపో నేను రాత్రి మేడ మీదకు వస్తాను …ఈ పనస తొనలు పట్టుకెళ్ళు…అంటూ లోపలకి పరుగెత్తింది…

ఛేతిలో ఉన్న గిన్నె పక్కన పెట్టి…మెల్లగా కదిలాను…వెనకగా వినపడుతున్న ఎడుపు….ఛేతన వాళ్ళ అమ్మ గారిది….ఈ వయసులో ఆవిడ మీద చేయి చేసుకోవాలన్న అలోచన ఎలా వచ్చిండో ఆయనకి

******************************************************************************

రాత్రి అన్నం తినేసి మేడ మీదకు చేరుకున్నాను…ఛేతన కోసం ఎదురుచూస్తూ కుర్చున్నాను….ఎంత సేపటికీ తను రాలేదు

ఛాలా అలవాటు అయిపొయింది ఈ అమ్మాయి….తన పై నాకున్న ఈ భావనికి ఏ పేరు లేదేమో..ఫ్రేమ అంటే చిన్న పదమేమో..ఆరాదన కూడా చిన్నదే…ఇంకేదో…మరేదొ….తన ఇష్టమైన సిరివెన్నెల సినెమాలో ని అదే పాట ను వాయిస్తూ కుర్చుండిపొయాను…

అయిపొయాక కళ్ళు తెరిచి చూస్తే…ఎదురుగా చేతన….ఫలించిన తపస్సు కి సాక్షాత్కరించే దేవతల్లా…ఒక్కసారి గా ప్రత్యక్షమైంది

ఎప్పుడొచ్చావ్ అన్నాను ఆనందం గా….ఛల్లగాలికి కంటి మీద పడుతున్న ముంగురులని సవరించుకుంటూ…నీ మురళీ గానం విని…ఒక్క ఉదుటున వచ్చి ఇక్కడ వాలనులే అన్నది…

నీకిష్టం అనే ఈ పాట వాయిస్తున్నను అన్నాను….

ఔను…నాకు చాల ఇష్టం ఈ పాట…..సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మోదటి సినిమా లోనే ఎంత బాగా రాశారో కదా….

సరస్వర సుర చరీగమనమవ్ సామ వేద సారమిది..నే పాడిన జీవన గీతం …ఈ గీతం…

ఎంత బాగా రాసాడో పెద్దాయన …

నా గురించి కూడా రాసాడు గా అన్నది

నీ గురించా…ఏమని అన్నాను…

"తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలిమిన వాడినేది కోరేది"అంతూ ఆదిబిక్షువు వాడినెది కోరేది పాట లోని ఆ పదాలను గుర్తుచేసింది…

ఒక్క సారి కలిసాయి ఇద్దరి చూపులు..అంతే…ఇక ఆపకుండా పది నిమిషాలు అలానే నవ్వుతూ ఉండిపొయాము… చేతన కల్లల్లొ జాలువారుతున్న కన్నీళ్ళు చూసాను….గుండె చివుక్కు మన్నది….

ఏంటి చేతన ఆ నీళ్ళు అని అడిగాను…వెంటనే తుడుచుకుంటూ…" ఎడ్చినా నవ్వినా వచ్చెది కన్నీళ్ళే" అని అన్నారు గా మీ ఆత్రేయ గారు అంతూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది…పొద్దున వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది…

.అసలు ఎమన్నా తిన్నదో లెదో అని సందెహం వచ్చింది అదే అడిగాను…

కంటి పని కన్ను చేస్తుంది…చేతి పని చేయి చెయ్యాలి..లేకపోతే కడుపు నిండదు అని మా అమ్మ చెప్తూ ఉంటుందిలే..అందుకే తినెసే వచ్చాను అన్నది…

మనసు మెలిపెట్టినట్టు అనిపించింది…….

నా భావాన్ని పసిగట్టినట్టు ఉంది…వెంటనె నా పక్కన కూర్చోని నా చేతిని తన చేతిలోకి తీసుకోని నిమిరిందిమొదటి స్పర్శ….ఆ స్పర్శలో ఎటువంటి కాంక్ష లేదు….

నేను ఉన్నను అన్న ధైర్యం

ఇది జీవితం….మన అనుబంధం దీన్ని ముందుకు నడిపిస్థంది అన్న ఊరట….

అబ్బయి అమ్మయి అన్న బేదాలకి…… సాంఘిక బంధనాలకి తావు లేని స్నేహం ఇది అన్న బాసట…

ఆ స్పర్శలో….

మురళీ….నా గురించి ఎవో అలోచిస్తూ నువ్వు భాదపడకు….జీవితంలో ప్రతి చిన్న విషయం లోనూ అందం ఉంది ఆనందం ఉంది

చెడు మంచి….అనుభవం ఏ కొవకి చెందినదైనా…చివరకు మిగిల్చేది చక్కటి అనుభూతే….ఫ్రతి అనుభవం ఎంతో నేర్పిస్తుంది ..మరెంతో ముందుకు నడిపిస్తుంది…ఛూసే ద్రుష్టికోనం లోనే ఉంటుంది మంచి చెడు…మనసుకు కష్టం కలిగించేది చెడు

హాయిని కలిగించేది మంచి…

నాకు ఉన్న చిన్న చిన్న కష్టాలు….రెప్ప పాటు కన్నీరు…అన్నీ నాకు మంచే ..ఏందుకంటే అవి కూడా నా మనసుకు హాయిని ..ఒకింత ఊరట ని ఇస్తూ ఉంటాయి….ఏడ్చినప్పుడు…కళ్ళు..వాటితో పాటు మనసు…రెండిటిలోనీ బరువు దిగిపోతుంది…

ఏడవటం తక్కువ ..అనే భావం నాకు ఎప్పుడూ లేదు

మరెప్పుడూ నువ్వు నవ్వుతూనే ఉంటావు గా అనే గా నీ సందేహం..

ఏడవటం తప్పు కానే కాదు కాని….దానికి సమయం సందర్భం ఉన్నాయి కదా…కావాల్సిన సమయం లొనే రావాలి ఆ కన్నీరు..అప్పుడే వాటికి విలువ….

ఏన్ని పుస్తకాలు చదివినా…జీవితం ఒక్కటే ఎప్పుడూ ఎదో ఒకటి నెర్పే పుస్తకం

నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అనే అనుకుంటాను నేను ఎప్పుడూ…

నో రిగ్రెట్స్…

ఫైన వాడు ఏం చేసినా ఎదో ఒక కారణం ఉండే ఉంటుంది అని నమ్మకం నాకు

ఆ నమ్మకమే నడిపిస్తుంది నన్ను…

కన్నీటి తో పాటూ గా…కొయిల పాటను

భూపాల రాగాన్ని

ఇంద్రధనస్సుని

పసి పాపలను

అమ్మ ని

మంచి మనుసున్న వాళ్ళని

ఇచ్చాడు ఆ పై వాడు….

ఛిన్న చిన్న కష్టలాను వీలైనంత జటిలం చేసుకునే మనస్తత్వం ఇవ్వనందుకు ఆయనకి థాంక్స్ చెప్పాల్సిందే నేను

అందుకే…నువ్వు కూడా …మా చేతన కి బోల్డన్ని కష్టాలు ఉన్నాయి…అయినా అలా పైకి నవ్వేస్తూ ఎదో గడిపేస్తోంది అని ఒక ఆర్ట్ సినెమాలో హీరోయిన్ లా నన్ను చూడకు….ఇప్పుడు ఇంకొ నందితా దాస్ ని కాలేను నేను…అసలె మావి ఒకటే రంగు లు అంటూ నవ్వేసింది

నా గుండెబరువునంతా బైటకి లాగేసింది ఆ నవ్వు…

నేను కూడా ఆ లాస్యం తో శ్రుతి కలిపాను మనసారా…సర్లే..చాలా సేపు అయ్యింది…ఒక పాట వాయించు అని అడిగింది….

"నువ్వు వస్తావని బ్రందావని ఆస గా చుసేనయ్య క్రిష్ణయ్యా" పాట వాయించను…వింటూ నా ఒడిలో పసి పాప లా నిద్రపొయింది చేతన…ఇంత చిన్న వయసులో ఎంత చక్కటి తాత్విక చింతన…ఎంత చక్కటి విశ్లేషణ….ఏన్నో పుస్తకాలు చదివినా రాని అనుభూతి …చేతన చెంత కలిగింది…జగన్నాటక సుత్రదారి శ్రీ క్రిష్ణుడు కూడా చేయాల్సిందంతా చేసి ఇలానే యసొదమ్మ వడిలో పడుకునేవాడు అట…ఏందుకో ఆ నిమిషంలో అది స్మ్రుతిపదంలో కదలాడింది నా వడిలో చేతన ని చుసినప్పుడు

ఆ నల్ల ని వాలు జడ నా చేతిలోకి తీసుకున్నాను…తన నవ్వు లానే…ఎన్నో భావలు పలికిస్తునట్టు గా గాలి కి కదలాడుతున్న ముంగురులు…..ఈ పాపాయి వడిలో మరోక పాపాయి నై అయిపొవాలనిపించింది….గట్టిగా నుదురుమీద ముద్దు పెట్టుకున్నాను…అన్నీ నాకు తెలిసిన విషయాలే ఐనా…ఎమి తెలియని దాని లా తను చెప్పే తీరు…మళ్ళీ మళ్ళీ ఆలొచించేలా చేస్తుంది నన్ను….ఏంత పెద్ద కష్టం అయినా….చిన్న చిరునవ్వుతో ఎదుర్కునే ఈ అమ్మయి వ్యక్తిత్వానికి ఒకింత ఆశ్చెర్యం…. ఆమె తో నా స్నేహం గుర్తుకువచ్చినప్పుడల్లా ఒకింత గర్వం ….నాదన్న గర్వం

ఇటువంటి విశ్లేషన అందరికి ఉంటే…జీవితంలో వచ్చే ప్రతి అనుభవం ఒక పాటం…ఒక లాస్యం

*********************************************************************************

మూడు రోజులు అయ్యింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి….ఆ రోజే తిరిగి విశాకపట్నం వచ్చాను….రాగనే చేతనని చుడాలనిపించింది….ఇంటికి వెళ్ళి చూస్తే తలుపులు తాళాలు వేసి ఉన్నాయి…

వెంటనే వచ్చి అమ్మ ని అడిగానుఅమ్మా ఆ పక్కింటి మహలక్ష్మి వాళ్ళు ఎక్కడికెల్లారు అని…

ఓహ్ వాళ్ళా….ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గారికి ట్రాన్స్ఫర్ అయ్యింది అట రా…

గుంటూర్ వెల్లిపొతున్నాం అని చెప్పింది…

ఆ అమ్మయి కి పెళ్ళి కూడా కుదిరింది అట…

అయినా వాళ్ళ నన్న కి ఎమన్న పిచ్చి ఆ ఎమిటి రా

కుందనపు బొమ్మ లాంటి పిల్లను తీసుకెళ్ళి అలాంటి వెర్రి వెంగలప్పకు కట్టబెడుతున్నడు…

ఇదే మాట అడిగాను రా వాళ్ళ ఆవిడని…ఏం చేస్తాం అండీ…కట్నాలు కానుకలు ఇచ్చుకోలేని వాళ్ళము…. అందుకే ఆయన అలా నిర్ణయించారు అన్నది అంటూ చెప్పుకొచ్చింది అమ్మ…

ఆ అబ్బాయి ని నువ్వు చూసావా అని అడిగాను

ఆ చూసానులే రా…నువ్వు వెళ్ళిన తెల్లారే..ఆ పిల్లకు పెళ్ళి చూపులు…ఆ పిల్లవాడు కాస్త మతిస్తిమితం లేని వాడు అట….ఏ పని పాట లేకుండా ఇంట్లోనే ఉంటాడు అట…కాని బాగా ఆస్తిపరులని విన్నానులే..జానకి బాగ నచ్చి….కాని కట్నం లేకుండా చేసుకుంటున్నారు అట…..

వచ్చే మాఘమాసం లోనే పెళ్ళి కాయం చేసుకున్నారు

అయినా ఆ పిల్లకేం రా బంగారం….చిదిమి దీపం పెట్టుకోవచ్చు…. దానికి కట్నం ఎందుకు…. వీళ్ళ అమ్మ వాళ్ళ తోందర కాకపోతేను …అన్నది అమ్మ…జానకి ఆ……

ఆ అమ్మయి పేరు జానకి అట నా అని అడిగాను

అవును రా..ఇన్నాళ్ళు నేను కూడా ఎప్పుడూ అడిగాను కాదుమహాలక్ష్మి అనే పిలిచేదాన్ని….మొన్న వాళ్ళ అమ్మ అంటూంటే విన్నానులే …జానకి అని….

పుట్టాక పెట్టరో…లేక పెట్టకే పుట్టిందో తెలియదు కానిజానకిలో ఉన్న సహనం , ఓర్పు, ఒడుపు అన్ని పునికిపుచ్చుకోని పుట్టింది ……

తన పేరు జానకి అయినా …మరేం ఐనా…నాకు మాత్రం చేతనే…అయినా….

ఏంత ధైర్యం గల పిల్ల రా…. ఆయ్యో ఇలా జరిగిందేమిటే అమ్మయి అని నేను వాపొతుంటే…అలా ఎందుకు అంటారు ఆంటీ…. ఫై వాడు ఎం చేసినా ఎదో ఒక కారణం ఉండే ఉంటుందిఛుద్దాం లేండి ఇందులో ఎం మంచి ఉందో అంటూ నా మాటలను తేలికగా కోట్టి పడేసింది రా అంటూ ముగించింది అమ్మ..

నాకు తెలుసు….చేతన ఇలాంటిదే ఎదో అంటుంది అని…

మల్లెపందరి నీడ లాంటి మనసు తో నాలంటి ఎన్నో పూవులకు బాసటై నిలుస్తుంది

నాలో కలిగించిన స్పందన తో…నన్ను…నావంటి మరెందరినో ముందుకు నడిపించే ధైర్యాని నాకు ఇచ్చింది…..

తను మళ్ళీ రాదు అన్న మాట స్పురణకు వచ్చినా కూడా…నా కంటిలో నుంచి ఒక్క కన్నీటి చుక్క జాలు వారలేదు….

తన తో గడిపిన ఈ కొంత సమయం …జీవితానికి సరిపడా అనుభూతులని మిగిల్చింది…..

మానసికం గా తను ఎప్పుదూ నా వేంటే ఉంటుంది అన్న గట్టి నమ్మకంఏందుకంటే ….తను చేతన గనుక… జీవితంలో ప్రతి నిమిషాన్ని ప్రతి క్షణాన్ని చైతన్యం తో నింపే నా స్నేహితురాలు గనుక

Thursday, June 12, 2008

నేను..మా అమ్మా...మా నాన్నారు









నా భాష ఎవ్వల్లు అర్ధం చేచుకొవట్లేదు…..
ఎం చెప్పినా ఒంట్ నానా అని నా బుగ్గలు కొలికెత్తున్నాలు….
అందుకే మా అత్త కి చెప్పాను…నా కధ లాచిపెట్టు అత్తా అని….
నాతో రండి ….నా కథ చెప్తా
నా పేరు….చిన్నులు…కన్నలు….బంగార్లు…బుజ్జితల్లి…. ఇలా ఎన్నో…
మా నాన్న కి ...అమ్మ కి ..చెరొక పేరే ఉంది…మరి నాకేమో ఇన్ని పెట్టారు
ఒక చారి పిలిస్తే నేను వెళ్ళను కదా …అందుకే నాకు బొల్డన్ని పెత్తారు









యెల్లుండే నాకు పల్లు వచ్చాయి….
కాని మా అమ్మ దగ్గర నాకన్నా ఎక్కువ పల్లు ఉన్నాయి..
మా నాన్నారు కి ఐతే అమ్మ కన్నా ఎక్కువ ఉన్నాయి
మరి నాకేమో నాలుగే ఉన్నాయి….
బాగ దురదగా ఉంది….అందుకే రొజూ నాన్నారు ని అమ్మ ని కొలుకుతున్నాను
ఆమ్మ ఎమో….వద్దు కన్నలు…తప్పు నాన్నా అంతుంది….
నాన్నా ఎమో….. ఎయి…కర్ర ఎది…హన్నా…అంతాదు
ఏవరన్నా నన్ను చిన్నతల్లీ అని ఎత్తుకొగానే వాల్లని కొలికెతున్నాను…
వల్లేమో అమ్మ తో...."అమ్మొ మీ అమ్మాయి బెమ్మ లాచసి అని పితిరీలు చెప్తున్నారు











మలి నేను ఎవలిని కొలకాలి ఇప్పులు??????
ఆకుందాం అంతే ఓలు లేలు….నాకెం తెలియదు…..బైతకి కుదా తీచుకెల్లడు నాన్న










నాన్న నెను లెకుందా ఆచి కి ఎల్లిపొతున్నాడని మొన్న భలే కొపం వచ్చింది అనుకొండి నాకు…
అందుకే మా నాన్న ని బాగ కొత్తెచాను….మా బుడుగు గాడి బాచ లొ అయితే…మా నాన్న కు ప్రయ్వేట్ చెప్పేచా….
నాన్న ఎమో….అమ్మొ…బంగార్లు….లే నాన్నా నా మీద…కొత్తకు నాన్నా అని ఎల్చాదు








ఏం చెయ్యాలి అబ్బా అని అలొచించాను….
నాన్న ఎమో ఎల్చాడు…కొత్తకు నన్ను అని……..
ఆమ్మ ఎమో బొమ్మ తెచ్చి…..ఎగిరి ఎగిరి ఆదించింది నన్నునాకెమో భలె నవ్వొచ్చెచింది








హీ హీ హీ హీ హీ హీనేను నవ్వాగానే...
అమ్మ నాన్న ఎమో చూదు చూదు అమ్మాయి పల్లు చూదు…
ఆమ్మొ అప్పుడే నాలుగు పల్లొచ్చెసాయి చిన్ను కి అని ఒకతే గొల








బొమ్మలిచ్చెచారు నాకు…ఆకొమని…
నెను ఆకుంతున్నానా…ఇంతలోనే అమ్మ వచ్చేచి….
చిన్నులు….ఆం తిందాం రా నాన్నా అని లాగెచింధి నన్ను

















లాను నేను లాను అని నేను చెప్పినా…. అర్ధం చేచుకొకుండా…..
ఎడవకూడదు చిన్ను అంతుంది…
నెనేక్కడ ఎల్చాను???????
ఛీ మా అమ్మ కి నా బాచ అర్ధమే కాదుపిచ్చి అమ్మ…..












భొల్డంత పెలుగన్నం నా పల్లలొకి తోచేచింది


















నీకు చెల్ పొన్ ఇస్తాను…..ఆం తిను అని అమ్మ అంతుంది……
.ఆం మొత్తం మొత్తం తినేచాక….చెల్ లాక్కోని నాన్న కి ఇచ్చేస్తుంది
నాన్నరేమో దాచెస్థాడు…..
అమ్మో చిన్ను పాదు చేచేస్థుంది అని అంటారు













ఇదిగో….ఈ పుతోలో నా పక్కన ఉన్మదే…….మా నాన్నారు…….
నానారికి కుదా నా బాచ రాదు
కాని ముద్ధు పెదతాడు నాకు












నా బాచ ఎవ్వరికి లాదా?ఎవలికైనా వస్తే…మా అమ్మ కి నాన్నారు కి చెప్పండివీల్లతో వేగలేక చస్తున్నాను…ఒకటే అల్లరి ఇద్దరు….ఉకో నాన్నా…ఉకో బంగారం అని










ఉంతాను తాతా……

Tuesday, June 3, 2008

ఉషాకిరణము..నిషాతరుణము


తొలిసంధ్య వేలలో…. తొలిపొద్దు పొడుపులో..తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం …..




ఎగిరొచ్చే కెరటం సింధూరం




జీవితమే రంగుల వలయం…దానికి ఆరభం సూర్యుని ఉదయం




గడిచే ప్రతినిమిషం ఎదిగే ప్రతిభింభం




వెతికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం




అ హృదయం సంధ్యా రాగం…… మేలుకొలిపే అనురాగం




ఈ చిత్రం చుడగానే స్మృతిపధంలో మెదిలిన మాట…పాట… బాలు గళం ….వేటూరి కలం…..అనితర సాధ్యం …అపార మధురం



దిగులుగా విసుకుగా అలసటతతో గడిచిన ఒక రాత్రి నుంచి …మరొక రోజులోకి అడుగు పెట్టే సమయంలో …..ఇటువంటి ఒక చక్కటి చిత్రం కళ్ళ ముందు కదలాడితే….... గత రోజు గ్నాపకాలు మటుమాయం అయ్యి ....రొజు మరింత నూతనోత్సాహంతో మరింత తీయటి అనుభూతితో మొదలవుతుంది




బద్దకం గా పక్క మీద నుంచి లేచి……


అప్పుడే వచ్చేసిన సుర్యుడి మీద కన్నెర్ర చెయ్యటానికి వీధి గుమ్మం లొకి వెళ్ళగానే...


కళ్ళెదురు గా ముగ్గు వేస్తూ కనపడే అమ్మ……


మంచుపొరల మధ్యలొ నుంచి యెర్రటి యెరుపు చొక్కా వేసుకోని.. పనిలొకి వచ్చెస్తున్న సుర్యా రావు……




కుహు కుహు అంటూ ….ఏ చెట్టు కొమ్మ మధ్యనో నక్కి….నాతో పాటు పాడగలరా అని సవాలు విసురుతూ ఉన్న కోయిలమ్మ


పెరడులో ఉన్న గులాబి ఆకుల మీద నిలిచి…అటా... ఇటా…ఏటు పడను??….ఎటు పడినా చేరేది నీ పాదులోకేలే….అంటూ గులాబీలతో ముచ్చటించె మంచుబిందువులు….


ఒక చక్కటి రోజు ……. అతి చిక్కటి కాఫీతో మొదలుపెట్టే నాన్నగారు……


లొపల ఎక్కడి నుంచో సన్నగా వినపడుతున్న ఎం.యెస్.సుబ్బలక్ష్మి గారి వేంకటేశ్వర సుప్రభాతం…..


చిన్నగా వస్తున్న ఆవలింత......…….


గుండెలనిండా గాలి పీల్చుకోగానే అనిర్విచనీయమైన అనుభూతితో నిండిపొయిన ప్రతి అణువు….


అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా..... అన్న వేటూరి మాటలు గుర్తుకొచ్చి …..చల్లగ నిట్టూర్చే హృదయం…..

ఇన్ని చక్కటి అందాలను ఇచ్చి…వీటన్నిటిని దాచుకునేందుకు ఒక్క హృదయం మాత్రమే ఇచ్చిన కృష్ణ భగవానుడిని మనసులోనే తిట్టుకుంటూ…..రేపు కల్లొకి వచ్చినప్పుడు నిలదీయాలని నిర్ణయించుకొని…….


అడుగు ముందుకు వేస్తూ ...అడుగుల్లో కొండంత ధైర్యాన్ని...మరొక మంచి రొజు గ్నాపకాలని పొదివి పట్టుకుంటూ....మొదలుపెట్టే రోజు....ఇంతకన్నా మంచి ఆరభం ఎముంటుంది గనుక.........

Thanks to my friend Suresh for sharing this wonderful photograph

I take the pleasure of dedicating this piece of work to THE MELODY KING SP Balasubramaniam gaaru on his 63rd Birthday