Thursday, April 19, 2007

అవ్యాజమైన ప్రేమ






అది అయొధ్యాపురము...

శ్రీరామ పట్టాభిషేకం పుర్తి అయిన పదవ రొజు....

మామిడి చెట్టు చిటారు కొమ్మన కూర్చొని దీర్గాలొచనలో పడ్డాడు మర్కటమకుటం...
దిగులు గా..దిగాలు గా ఉన్నాడు..

కుర్చున్నవాడు కుర్చోక..ఒక్క ఉదుటున కిందకు దూకి...ఉద్యానవనం దాటి..రాజప్రాసాదానికి వెడలాడు....
కళ్ళు విప్పార్చి...ప్రాసాదమంతా కలయచుసాడు..

ఎడీ?? కనపడడే????.....
నా రాముడు..
శ్రీరామచంద్రుడు...
ఎక్కడున్నాడు????
నీలిమేఘశ్యాముడు..
అందాల రాముడు...
అనుకుంటూ..... అటు ఇటు పరిగెత్తాడు..

ఉహు..లాభం లేదు..ఇక్కడెక్కడా లేడు నా రాముడు..ఎక్కడికి వెల్లుంటాడు....ఇంకెక్కడికిలే...సీతమ్మ వారి కడకే వెళ్ళి ఉంటాడు...అనుకుంటూ....జనకీ జనని ధరనీ మాత ను తెరిపార చుసుకుంటూ...అడుగులో అడుగువేస్తూ ఉద్యానవనంలోకి వెళ్ళిపొయాడు...

హనుమంతుడి జన్మ కారనమే భక్తి,జ్ణానము..ఆ జ్ణానము ఎప్పుడో సముపార్జించేసాడు..ఇక భక్తి...రామనామ రూపేణ...ఆర్జిస్తూనే ఉన్నాడు...
రాముడి కోసం బాల్యం నుంచి వేచి చూసి చూసి...కడకు ఒక నాడు ఒక మూషికపర్వతమునందు రాముడ్ని కలుసుకున్నాడు....


ఇక ఆ నాటి నుండి ఈ నాటి వరకు..రాముడి చెంత చేరి,బొలుడన్ని మాటలు,పాటలు,ఆటలు,వేడుకలు చేసేసి..బ్రహ్మస్రుష్థిలో ఉన్న అనందాన్నతటిని తన వడిలో వేసేసుకొవాలని ఆరాట పడి పొయాడు...
కాని సీతమ్మ విరహములో కొన్నాళ్ళు...
రావణుడి వధలో మరిక్కొన్నాళ్ళు...
రాముడు హనుమంతుడ్ని కాసింత నిర్లక్ష్యం చేసాడని హనుమంతుడి ఆవేదన....
సీతమ్మ వారు లేని భాధ ముందు తన ఆవేదన ఏమంత నిలువలేదు..
ముందు ఏలా అయినా సీతమ్మని తీసుకొచ్చేసుకొవాలి అనుకున్నాడు
నా రాముడికి సీతమ్మను తెచ్చిపెట్టడంలో సాయం చేస్తే..ఇక నా రాముడు కష్టాలు తీరుతాయి...నన్ను పట్టించుకునే తీరికా వస్తుంది నా స్వామికి..అనుకొని...
కొతి మూకనంతటిని తొడ్కొని బొయి..రామచంద్రునితో బాటు గా...ఆయిన పక్కనే ఉండి....
వారధి కట్టె..
రావణుడిని కొట్టె..
సీతమ్మను తెచ్చే...

పట్తాభిషేక శుభసంధర్భాన..సీతమ్మ ఇచ్చిన ముత్యాల దండ కుడా హనుమంతుడికి అనందాన్ని ఇవ్వలేదు సరికదా.... ఆ దండ అంతటిని పీకి పీకి నేల పాలు చేసేసాడు... ఎంటయ్య అంటే...ఎడి ఇందులో నా రాముడేడి....రాముడి లేనిదేది నాకు లాస్యము కానేరదు.....అంటూ బుంగమూతి పెట్టెసాడు....
కూర్చున్న చొట నుండి...కనపడే వేప చెట్టు మీదకు దూకాడు...తోక అంతా ఒక చొటకి తెచ్చి తలగడ చేస్కొని నడుము వాల్చి..అలొచించనారంభించాడు...
"ఎమైంది నా రామయ్య కు...
నా ఆంతర్యం అవగతమవ్వలేదా...
లొకాభిరాముడు...సర్వాంతర్యామి..సర్వం ఎరిగినవాడు...ఆయనకి అర్ధం కాకపొవటమెమిటి నా పిచ్చి కాకపొతేను...మర్కటాన్ని కదా..మందబుద్ధి ని..చ చ..నా రాముడికి తెలియకపొవటమా
ప్రశ్నే లేదు ..తెలుసు తెలుసు..ఆయినకి అంతా తెలుసు..మరి ఆయిన నన్ను ఎందులకు పట్టించుకొవట్లెదు..గత పది దినముల నుండి ఆ సీతమ్మ వారి కొంగు విడువకుండా తిరుగుచున్నాడు...ఆ సీతమ్మ వారి దగ్గర ఉన్నది ఎమి...నా దగ్గర లేనిది ఏమి...ఈ మర్మమేమిటో కాసింత తెలుసుకోవలసిందే..."
ఆలొచన వచ్చిందే తడవుగా...కిందకు దూకి..సీతమ్మ వారి అంతహపురానికి పరుగు తీసాడు...
"సీతమ్మ...
అందాల సీతమ్మ...
స్త్రీ జాతికే ఆదర్స ప్రాయం ఆమె ఓర్పు...
రావణుడి చెరలో చూపించిన ఓర్పు.....
రాముడి రాకకై ఎదురుచుసిన ఓర్పు....
ఇప్పుడు కుడా అదే ఓర్పుతో...దారనికి ఉన్న వీడి రాని చిక్కు ముడి ని తీసె ప్రయత్నం చేస్తోంది...."
హనుమంతుదిని చుడగానే...
రావయ్యా హనుమా...
ఎమి ఈ నడుమ బొత్తిగా నల్లపుస వైనావు..అంటూ మాత్రు వాత్సల్యంతో పలుకరించింది
సూటిగా విషయనికొచ్చేస్తూ హనుమ...
సీతమ్మ వారి పాదాల కడ కూర్చొని..
"అమ్మా సీతమ్మ తల్లి...నా రాముడు ఎప్పుడూ నీ కొంగు వీడకుండా తిరుగుచున్నాడు..
నీ కడ ఉన్నదేమి..
నా కడ లేనిదేమి...
చెప్పరాదు తల్లీ.."
అంతూ ప్రశ్నించాడు....

వెంటనే సీతమ్మ తల్లి నవ్వుతూ "తన కుడి చేతి చూపుడు వేలును..తన నుదుటిన ఉన్న సింధురాని వైపు చూపిస్తూ...ఇదిగో దీని మహిమ ఇదంతా" అన్నది..
కట్టుకున్నవాడు కదా.....ఆ వివహ భంధం..ఆ భార్యాబర్తల అనుభంధం అట్టిది...ఇది అంతయు...మా వివహ బంధ బలము నాయినా..అని ఆవిడ భావం
సీతమ్మ వారి ఆంతర్యం తెలుసుకొక...హనుమ....
"ఒహొ సీతమ్మ వారి నుదుట సింధురమా నా రామునిని అకర్షించుచున్నది...
నుదుటిన ఉన్న ఆ చిన్న సింధురపు రేఖ కే అంత మయ్మరచిపొయి..నన్ను మరచి ..సీతమ్మ వెంట తిరుగుచున్నాడు గా నా శ్రిరామచంద్రుడు...
మరి నేను వంటి నిండా సింధూరము పూసుకొనినిన యెడల...ఇక నన్ను వీడి పొజాలడు..."అనుకుంటూ
వెళ్ళి వంటి నిండా సింధురము పులుముకొని..ఒక్క గెంతులో రాముడిని సమీపించి..
ఇదిగో శ్రిరామ చూడు నన్ను... అంటూ ఎగరనారంభించాడు...ఆ ఎగురుడు ఎంతయనను జాతి లక్షణము కదా
రాముడు..
నీలిమెఘశ్యాముడు...
కొదండరాముడు..
కమనీయధాముడు..
.హనుమంతుని ఆంతర్యం....
ఆ భక్తశిఖామణి ప్రేమను అర్ధం చేస్కొని...
హనుమా...చాల అందంగా ఉన్నావు..ఇటులనే నిత్య సింధూరసొభితుడవయి..నీ భక్తుల చేత పూజలందుకో...అంటూ దీవించాదు"

అంతటి అవ్యాజ్యమైన ప్రేమ ఆ రామ హనుమలది....ప్రేమకు...అది తెచ్చే అక్కసు కు...భగవంతులు కూడా అతీతులు కారు కాబోలు....

NOTE:

This story is not an imagination or my creation but its there in epics is what i was told by my Mother. She used to tell this story to me...And i added a bit of Spice to make this look a bit intresting.So please dont be in a illusion that its a creation...If any wanna proofs for this story..OOPS!!! sorry i cant..I believe in my MOTHER...so i believed...If u wanna believe believe...

Tuesday, April 10, 2007

మాకొద్దీ పెద్దతనము

నువ్వు ఔట్ నువ్వు ఔట్,ఇదిగో చూడు నీకంటే ముందు నేనే గీత దాటి వచ్చేసాను అంటూ చప్పట్లు కొడుతూ ఎగురుతున్నాడు విష్ణు....
ఏం కాదు నేనే ముందొచ్చాను..నువ్వే ఔట్ నువ్వే ఔట్...అంటూ విష్ణుని తొసేసాడు రఘు...
ఆ తొపుడుకి కింద పడిపొయాడు విష్ణు...మొకాలు దోక్కు పొయింది...సన్నటి ధారగా బైటకు వచ్చిన రక్తం....
అమ్మా!!!ఆ ఆ!!! అంటూ ఎడుస్తూ ఇంట్లొకి పరిగెత్తాడు విష్ణు...
**************************************************************
ఎవమ్మొ భారతమ్మా బైటకురా...నీ కొడుకు నా కొడుకుని కొట్టాడు ఇదిగో రక్తం కారిపొతోంది నాబిడ్డ కి చూడు...ఎం పెంపకం అమ్మా..... పిల్లల్ను కనగానే సరిపొదు పెంచటం కూడా తెలియాలి...

ఒహొ పెద్ద చెప్పొచ్చావులే..నీ కొడుకు ఎదో అల్లరి పని చేసి ఉంటాడు,దెబ్బ తగిలి ఉంటుంది,నీ నొటికి దడిచి మా రఘు గాడి మీద చెప్పి ఉంటాడు నీకు....అయినా ఎందుకు ఓ గొంతేసుకొని పడిపొతావ్ అందరి మీద...ఇదిగొ నీ ఈ గొంతు తట్టుకోలేకే నీ మొగుడు సన్యాసుల్లొ కలిసిపొయాడు


ఓసి నీ మొహం మండ....నా మొగుడు నిక్షేపంగా ఉంటే ...సన్యాసుల్లొ కలిసిపొయాడంటావెంటే..వెర్రి కుంక...నొరు మూస్కొని ఉండవే...నీ భాగోతం ఎవరికి తెలియదు గనుక...ఏనాడన్నా అత్తకి కూడు పెట్టిన మొహమేనా అది...పాపం పుణ్యాత్మురాలు త్వరగానే వెళ్ళిపొయింది...


అయ్యో మా అత్త గురించి ఎందుకు లేమ్మా..సహజం గానే పొయింది పెద్దావిడ...మీ అత్తే పాపం మందు పెట్టి మరీ చంపావట గా....లోకం అంతా కొడైకూస్తొంది...అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు ఎవరికి తెలియదు నీ సంగతి...



నా సంగతి తెలియని వాళ్ళు ఉంటారేమో కాని..నీ గురించి ఈ వీధిలొ ఏ చెట్టు ని అడిగినా ఏ పుట్టను అడిగినా చెప్తాయి..అయినా నీ నొట్లో నోరు పెట్టటం అంటే ..రాయి వేయటమే...
యెహే పోవే...నీతో నాకెంటి..నీతి జాతి లేని దానివి...ఈ జన్మలొ మా విష్ణుతో మీ వాడిని కలవనీయను...

అబ్బో పేద్ద వచ్చింది అండి...ఈవిడో మహరాణి...వాడొక యువరాజు....పొ పొవమ్మా..... నీతో మట్లాడితేనే పంచమహా పాతకాలు చుట్టుకుంటాయి

చి పొ...

చ పొ.....

ఒరేయ్ విష్ణు..విష్ణు..ఎక్కడ ఎడ్చావు రా..

రఘు ..ఊ అనవే...పలకవే రా..ఎక్కడ ఉన్నావు రా...
***************************************************************
విష్ణు రఘు ఇద్దరూ ఇసుకలో...

"విష్ణు దెబ్బ తగిలిందా?????..సారీరా...నువ్వే గెలిచావు..నేనే తొండి ఆడాను..సరేనా...."

"కాదు లేరా రఘు...నువ్వే గెలిచావు..."

"ఒరేయ్ విష్ణు నువ్వే గెలిచావు..దెబ్బ చూపించు..అయ్యో రక్తం కూడా వచ్చిందా..సారీరా!!!!!"

"అయ్యొ రఘు ఎందుకురా ఎడుస్తావు....ఉండు,ఇలా రా....కళ్ళు తుడుస్తా ఉండు....హా ఇప్పుడు లేవు లె నీళ్ళు...ఇంక ఎడవకు...ఈ దెబ్బ రేపటికల్లా మాడిపొతుందిరా...దా మనం ఇళ్ళు కట్టుకుందాం"

"సరే పద విష్ణు..ఇంకెప్పుడూ నిన్ను కొట్టను,పడెయ్యను మథర్ ప్రామిసె..., ఈ ఇసుక ఇల్లు కూడా నీకే ఇస్తాను...ఉండు కడతాను..చేయి పెట్టు ఇలా...."

పది నిమిషాల్లో తయారయ్యింది..ఇసుక ఇల్లు...

విష్ణు రఘుల పసితనపు స్వచ్చత్తకు గుర్తుగా...........
కుటిలత్వమెరగని వారి మనసుకు ప్రతీకగా...............
గొడవలు గండరగోళాలు దరిచేరని ఆనందతీరంగా.......
పెద్దతనపు చాయలే లేని అమాయకపు హృదయముగా...........
ఈర్ష్యా ద్వేషాలు ఎరుగని దేవుడి కోవెలలా................

తమ ఇసుక ఇంటిని చూస్తూ ఎగురుతున్న రఘు విష్ణుల నవ్వులలో.....
"పెద్దతనంలో ఇన్ని ఆలోచనలు..ఇన్ని గొడవలు..ఇంత కాటిన్యము ఉన్నయి గావున..మాకొద్దు ఈ పెద్దతనము" అన్న భావమేదో స్పురించిది వారిరువురి తల్లులకు
******************************************************************************

పొరుగింటి పుల్లకూర

త్వరగా కానీయరా బాబు,నీకు సెండాఫ్ ఇచ్చివచ్చి మళ్ళి నేనొక కునుకేయాలి,అసలే రెపు పొద్దున్నే మీటింగ్ ఎడ్చింది ఆఫీస్ లో అంటూ బద్దకంగా మంచం మీద దొర్లుతున్నాడు ఆకాష్,ఒరేయ్ మన పార్ధు గాడు వెల్లిపొతున్నాడని నీకు కొంచం కూడా బాధ లేదారా,వాడ్ని నువ్వు మిస్ అవ్వవా ఆకాష్ అంటున్న అరవింద్ వంక చూస్తూ,స్వామి మనకి మిస్ లు గిస్ లు జాంతానహీ,అయినా వాడు హ్యపీ గా ప్రియని పెళ్ళి చేసుకొని అనందంగా,య్.స్ వెళ్తూంటే మధ్యలొ నీగొడవేంటి రా,అవన్నీ కాదులే కాని,ఇదిగో బాబాయి,నువ్వు వెళ్ళాక నన్ను కూడా లాగేయరా,చచ్చి నీ కడుపునపుడతా అంటూ ఒళ్ళువిరుచుకుంటూ లేచి కూర్చున్నాడు ఆకాష్,ఇవేమి పట్టనట్టు ఏవో బ్యాగులు సర్దుకొవటంలో నిమగ్నమైపొయాడు పార్ధసారధి. ఇదిగో కందిమెట్ల సత్య వీర వెంకట పార్ధసారధి తమరితొనే సార్ మాట్లాడుతొంది అంటూ అరుస్తున్న ఆకాష్ గొంతు విన్న పార్ధు, ఆ ఎంటిరా చెప్పు వింటున్నాలే అన్నాడు కాస్త విసుకుగా,ఆ గొంతులొని చిరాకు గ్రహించి, ఆ అంతేలేరా ఇప్పటిదాకా నువ్వేం చెప్తే అదే వింటా అన్నావ్,ఇప్పుడు ఆ చెప్పు వింటాలే అంటున్నావ్,రేపు ఎంటిరా నీ మాట వినేది అంటావ్,నీకు నేను మిస్టర్ మల్లన్నలా కనపడుతున్నానా ఎంటిరా వెధవ,అంటూ కోపంగా పార్ధు వంక చూస్తూ కూర్చున్నాడు ఆకాష్,ఇది విన్న పార్ధసారధి చేతిలోని పనిని ఆపేసి మరీ,"ఈ మిస్టర్ మల్లన్న ఎవరురా అకాష్??" అంటూ కుతూహలంగా అడిగాడు పార్ధు.ఆ ఎవడోలే మా బామ్మ చెప్తూంటుంది,"ఏరు దాటేదాక ఒడ మల్లన్న మల్లన్న అంటారు,దాటేసాక బొడి మల్లన్న అంటారు" అని,ఆ సామెతలొని కాండిడేట్లే ఈ మిస్టర్ మల్లన్న అంటూ నొట్లో ఉన్న బత్తీని వెలిగించేందుకు అగ్గిపెట్టకయ్ వెతుకులాటలో నిమగ్నమైపొయాడు ఆకాష్.
ఇదిగో కందిమెట్ల సత్య వీర వెంకట పార్ధసారధి తమరితొనే సార్ మాట్లాడుతొంది అంటూ అరుస్తున్న ఆకాష్ గొంతు విన్న పార్ధు...ఆ ఎంటిరా చెప్పు వింటున్నాలే అన్నాడు కాస్త విసుకుగా,ఆ గొంతులొని చిరాకు గ్రహించి, ఆ అంతేలేరా ఇప్పటిదాకా నువ్వేం చెప్తే అదే వింటా అన్నావ్,ఇప్పుడు ఆ చెప్పు వింటాలే అంటున్నావ్,రేపు ఎంటిరా నీ మాట వినేది అంటావ్,నీకు నేను మిస్టర్ మల్లన్నలా కనపడుతున్నానా ఎంటిరా వెధవ....అంటూ కోపంగా పార్ధు వంక చూస్తూ కూర్చున్నాడు ఆకాష్,ఇది విన్న పార్ధసారధి చేతిలోని పనిని ఆపేసి మరీ,"ఈ మిస్టర్ మల్లన్న ఎవరురా అకాష్??" అంటూ కుతూహలంగా అడిగాడు పార్ధు.ఆ ఎవడోలే మా బామ్మ చెప్తూంటుంది,"ఏరు దాటేదాక ఒడ మల్లన్న మల్లన్న అంటారు,దాటేసాక బొడి మల్లన్న అంటారు" అని,ఆ సామెతలొని కాండిడేట్లే ఈ మిస్టర్ మల్లన్న అంటూ నొట్లో ఉన్న బత్తీని వెలిగించేందుకు అగ్గిపెట్టకయ్ వెతుకులాటలో నిమగ్నమైపొయాడు ఆకాష్.
హ్ చ్1 చేయించమని చెప్పాను కదరా,ముందు ఆ హ్ చ్1 ప్రాసెస్సింగ్ పూర్తి చేయించరా అప్పుడు చుద్దాం అంటూ హడావిడిగా ఫొనె నంబర్ల పుస్తకం ఒక చేతిలో,సెల్ల్ ఫొనె ఒక చేతిలో పట్టుకొని చాలా హడావిడి గా నంబర్లు నొక్కుతూ ఉండిపొయాడు పార్ధ సారధి,ఏంటి రా అప్పులవాళ్ళకా ఫొనెలు అంటున్న అకాష్ తొ అరవింద్ "వాడికి అప్పుచేయాల్సిన ఖర్మేమిటి రా,రెండు చేతులా సంపాదించాడు,అమేరికా లోనే రెండు ఇల్లు కొన్నాడు,హైదరాబాద్ లొ ఉన్న దాదాపు అన్నీ ఖరీదయన ప్రదేసాల్లో ప్లాట్లు కొన్నాడు,బెంజ్ కార్,హొండా సిటీలు... ఇన్ని ఉన్న వాడికి అప్పుచేయాల్సిన అవసరం ఎందుకుంటుంధి నీ వెధవ ప్రశ్న నువ్వు నూ" అంటూ విసుకున్నాడు.
అబ్బా చా చెప్పొచ్చావులే... అప్పులవాళ్ళు అంటే నా ఉద్దేశ్యం వీడు అప్పు ఇచ్చిన ,వీడి దగ్గర అప్పు పుచ్చుకున్న వాళ్ళు అని, అంటూ చేతిలో ఉన్న టీ.వీ రెమొట్ ను అరవింద్ మీదకు విసిరాడు.
వెంటనే పక్కన ఉన్న స్టీల్ గ్లాస్ అందుకొని ఆకాష్ మీదకు విసిరడు అరవింద్, "ఒరేయ్ ,త్రుటిలో తప్పింది రా,కొంచెం ఉంటే కన్ను పొయెది రా,అసలే అమేరికా పెళ్ళికొడుకుని కాను,ఇంకా కన్ను కూడా పొతే ఎవరూ పిల్లను ఇవ్వరు రా, పెళ్ళి పెటాకులు లేక నీ ఇంటికే వచ్చి సెటిల్ అయిపొతా,నాకు సేవలు చేసుకుంటూ నీ జన్మ తరింపచెసుకొవాల్సి ఉంతుంది అంటున్న అకాష్ వాక్ప్రవహానికి అడ్డు కట్ట వెస్తూ,"ఒకే గయ్స్ లెట్ స్టార్ట్" అన్నడు పార్ధ సారధి. ఎంటి రా బబాయి అప్పుడే అయిపొందా నీ అప్పులవాళ్ళ ఫొనెలు అంటూ లేచి నిల్చున్నడు అకాష్."అప్పులవాళ్ళు కాదు రా,తెలిసిన వాళ్ళందరికి చివరి సారిగా ఫొనె చేస్తున్నాను రా.." అంటూ బ్యాగ్ అందుకొని బైటకు నదిచాడు పార్ధసారధి. ఆ మాటలు చెవిన పడగా,డిక్కిలో సామాన్లు సర్ధుతున్న అరవింద్ కి ఒక్కసారిగా చిన్న ఉలికిపాటు.
అదేంటి రా చివరిసారిగా అంటున్నావ్,అంటే మళ్ళీ రావా ఇండియా అని ప్రశ్నించాడు."ఎముంది రా ఇండియాలో పదే పదే రావటానికి.అయినా ఇక్కడ ప్లాట్స్ సంగతి,నా పేరు మీద ఉన్న ఇంటి అద్దెల సంగతి చూసుకొవటానికి బ్రోకర్ ని పెట్టాను. నెల నెల అతను ఎలాగూ దభ్భులు కలక్ట్ చేసి అకౌంట్లో వేసేస్తాడు, ఇంక దిగులే లేదు.అయినా అక్కడ
అంత బిజీ లైఫ్లో ప్రతి సారి ఇండియా రావటం చాలా ఇబ్బంది రా" అంటూ బ్యాగ్లు అన్నీ మెల్లగా లొపల పెట్టెసాడు పార్ధ సారధి. కార్ బయలుదేరింది.డ్రైవింగ్ చేస్తున్న పార్ధుతో ఎవో కబుర్లు చెప్పటంలో నిమగ్నమైపొయాడు ఆకాష్.ఎదో తెలియని బాధను అనిచివేసే ప్రయత్నం చేస్తూ అటు నుంచి అలొచనా ప్రవాహన్ని పక్కకు మరల్చే ప్రయథ్నం చేస్తూ కిటికిలో నుంచి బైటకు చూస్తూ కుర్చునాడు అరవింద్.అరవింద్ దిగాలు మొహన్ని చుసిన అకాష్, ఒరేయ్ పార్ధు.. నువ్వు వెళ్ళిపోతున్నావని మన అరవిందం గాడు కళ్ళ నీళ్ళు పెట్టెసుకుంటునాడురొయ్, నేను చేప్పనా వీడు అమ్మయి లా పుట్టాల్సింది పొరపాటున అబ్బయి లా పుట్టాడు అని అంటూ పక పక నవ్వేస్తుండగా, అరవింద్ ని చుస్తూ పార్ధ సారధి
"ఎందుకు రా అంత భాధపడతావు,బీ ప్రాక్టికల్ అండ్ నౌ చీర్ ఉప్ మన్" అంతూ అరవింద్ ను మములు స్థిథి కి తెచ్చె ప్రయ్థ్నం
చెసాదు. ఆ మాతలు విన్న అరవింద్, "బాధ నా గురించి కాదు రా, మీ అమ్మ నాన్నల గురించి. వాళ్ళని అలా వదిలేసి వెళ్ళటం భావ్యం కాదు రా,
అలొచించు ఒకసారి అన్నాడు."ప్రతి దానికి ఇలా సెంటిమెంటల్గా అలొచిస్తే ఏలా రా...లైఫెలో ముందుకువెళ్ళాలంటే ఇలాంటివి తప్పదు,ప్రాక్తికల్ గా ఆలొచించి చూడరా నీకే అర్దమౌతుంది"అంటూ ఇక తాను చెప్పటానికి ఎమీ లేదు అనట్టు గా ఆ సంబాషణను అక్కడితో ఆపేసాడు పార్ధసారధి.
నిశబ్ధం తాండవిస్తున్న ఆ స్తితిని మార్చే ప్రయత్నం చేస్తూ..ఆకాష్ అరవింద్తో, "ఖుచ్ పానే కేలియే కుచ్ కొనా పడ్తా హై" అన్నాడు వెనకటికి ఎవడో హిందీ ప్రబుద్ధుడు,"కుండ నిండుగా ఉండాలి పిల్లాడు గుండులా ఉండాలి" అన్నాడట ఎవడో నీలాంటి పనికిమాలిన పాపారవు,డబ్బు కావలంటే మరి దేశం కాని దేశం వెళ్ళాలమ్మా అన్నాడు. ఆకాష్ మాటలకి కొపంతో అరవింద్,"అంటే డబ్బే జీవిత పరమావధా...నీ జన్మ కారణమే డబ్బు సంపాదనా? అన్నడు ఆవేశం గా.."
ఔను రా మేము కారణజన్ములమే,మా జన్మ కారణం డబ్బే అంతేకాదు నేను సార్దకనమధేయుడిని కుడా కావాలని చిన్నప్పుడే మా వాళ్ళు నాకు ఆకాష్ అని పేరు పెట్టారు,విమానంలో ఏక్కి ఆకాశంలో ఎగిరి డబ్బు సంపాదించాలి అని..కాబట్టి పార్ధూ గాడే కాదు నేను కుడా త్వరలోనే హ్ చ్1 చేయించుకొని అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపొతా,అయినా ఎడో పెద్ద నీకొక్కడికే కన్నవాళ్ళ మీద ప్రేమ దేశం మీడ అభిమానం ఉన్నట్టు ఓ తెగ లెక్చర్లు దంచేస్తున్నావ్,నువ్వేం వేలగబెడుతున్నావొయ్ ఇక్కడే ఉండి,లేచమా తిన్నమా పడుకున్నమా అన్నట్టు గడిచిపొతుంది ఇక్కడ జీవితం,ఒక ఎదుగు బొదుగు లేకుండా,అంతే గా లేక ఏమన్నా మార్పు ఉందా??అంటూ సూటిగా ప్రశ్నించాడు ఆకాష్,ఆవేశంతో ఊగిపొతున్న అరవింద్ ఆకాష్ వైపు చుస్తూ.."నేను ఇక్కడ ఉండి ఎమీ వెలగబెట్టట్లెదు,లేచామా తిన్నామా పడుకున్నామా అనే చందాన గడుపుతున్న నిజమే కాని నాకొసం, కేవలం నాకొసమే బ్రతుకుతూ నా గురించే ఆలొచిస్తూ,ఇన్నళ్ళు నిత్యం నా గురించే స్రమిస్తూ,నా కాళ్ళ మీద నేను నిలబడగలిగే అంతటి వాడిని చేసి,నా కోసం కళ్ళళ్ళొ ప్రాణాలు పెట్టుకొని ఉన్న మా అమ్మ నాన్నకు మాత్రం బొల్డంత ఆనందాన్ని,సుఖాన్ని అందివ్వగలుగుతున్నా,ఆ సుఖం డబ్బు తెచ్చింది కాదు,నేను నిత్యం వాళ్ళ కళ్ళ ముందే తిరుగటం వల్ల వచ్చిన సుఖం" అన్నడు.
ఈ సంబాషనంతా వింటున్న పార్ధ సారధి కి ఈ గొడవ ఎటు దారితీయబొతోందో అని భయం బిగ్గరగా, ఒరేయ్ ఎవరో వెలేసినట్టు అలా అంత దూరాన నిల్చుండిపొయావేమిటి రా అంటూ అరిచాడు,ఆకాష్ మాటలకు బదులుగా "వినపడిండి కాని నాకు ఇంకా కొపం తగ్గలేదు" అనే భావం తొనికిసలాడే లాగా ఒక చూపు చూసి మల్లీ చటుక్కున మొహం వేసి,ఈ రాబొయే ప్రళయాన్ని ఆపాల్సిన బాధ్యత తన మీదే ఉన్నది గావున

ఒరేయ్ ఇక ఈ టాపిక్ వదిలేయండి,ఏర్ పొర్ట్ వచ్చేసింది అంటూ కార్ ను ఆపాడు. పార్ధసారధి కార్ నుంచి దిగగానే,ఆత్రుతగా అటుగా పరుగులాంటి నడకతో వచ్చారు,అతని తల్లి తండ్రి,పార్ధు వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు,కూతురు ఉన్నా,ఆడపిల్లలు ఆడపిల్లలే కాని ఈడపిల్లలు కాదుగా, ఎనాటికన్నా తమను చూసుకునే నాధుడు దిక్కు కొడుకే గా అంటూ ఉంటారు పార్ధు తండ్రి భాస్కర రావు గారు,ఇప్పుడు ఆ దిక్కు,ఎన్నో దిక్కులు దాటి వెల్లిపొతొందని కాబొలు ఆ ఆదుర్ధా...

"ఆ ఈ సామాన్ల్లన్నీ దించండి అంటూ హడావిడిగా అటు ఇటు తిరిగేస్తున్నరు,భాస్కరం గారు"
దిగాలు మొము తో ఎమీ చేయ్యలేని నిస్సహాయ స్తితి లో,పరిస్థితులను జీర్నించుకునే సంగ్రామంలో కొట్టు మిట్టాడుతూ మౌనంగా ఒక పక్కగా నిల్చొని భర్త చేసే హడావిడి అంతటిని తిలకిస్తూ ఉండి పొయింది,భాస్కరం గారి భార్య సుశీలమ్మ.
ఓరెయ్ పార్ధు ఇదిగో రా నీ సామనంతా ఇక్కడ పెట్టెసాం,ఇంకా చెక్ ఇన్ అవ్వటానికి గంట సేపు ఉంది,కాబట్టి ఈ లొపల ఒకసారి బాగా ఆలొచించుకో, నాకు నువ్వు ఏమన్నా బాకీ గాని లేక ఇవ్వాలని అనుకొని ఇవ్వకుండా మర్చిపొయిన బహుమతులు గాని ఉంటే గుర్తుకొస్తాయి అంటూ తన సహజ ధొరనిలో మాట్లాడుతూ ఉండగా,పక్కనే దిగాలుగా, మరి కాస్త కోపంగా నిల్చున్న అరవింద్ వైపే చుపిస్తూ ఆకాష్ కు సైగ చేసాడు పార్ధసారధి.అరవింద్ ని చుస్థూ ఆకాష్,హు!!, వీడు మళ్ళీ అలక పానుపు ఎక్కాదురొయ్... నేను చెప్పానా మనవాడు జస్ట్ మిస్స్ రా లేకపొతే ఎంచక్క అమ్మాయి లా పుట్టెవాడు,అలా ఐనా నాకు ఒక గర్ల్ ఫ్రండ్ దొరికేది అంటూ..అరవింద్ కు వినపడేలా
బిగ్గరగా, ఒరేయ్ ఎవరో వెలేసినట్టు అలా అంత దూరాన నిల్చుండిపొయావేమిటి రా అంటూ అరిచాడు,ఆకాష్ మాటలకు బదులుగా "వినపడిండి కాని నాకు ఇంకా కొపం తగ్గలేదు" అనే భావం తొనికిసలాడే లాగా ఒక చూపు చూసి మల్లీ చటుక్కున మొహం తిప్పేసుకున్నడు అరవింద్.హు వీడు ఇప్పుడప్పుడే లైన్ లోకి రాడు కాని పద రా, ప్రియ వాళ్ళంతా అక్కడ మనకోసమే ఎదురుచుస్తున్నారు,ఒరేయ్ నిన్ను అల్లుడిగా చేసుకోవటానికి మొదట్లో ఒప్పుకొకపొయినా, ఇప్పుడు లైన్లో కొచ్చేసాడు రొయ్ మీ మామ,అటు చూడు నీ వైపు ఎలా చుస్తున్నడో,ఔనులే పిల్లనిచ్చాడు గా ఇక ఏ అడ్డగాడిదనైనా గౌరవించక తప్పదు గా పాపం మామలకి అంటూ,ఎక్కడా పార్ధు కి తిరిగి జవాబు చెప్పే ఆస్కారమే ఇవ్వకుండా,ప్రియ ఉన్న వైపుకి నడిచాడు,ఆకాష్ ని చూస్తూనే ప్రియ,బాగున్నార ఆకాష్ గారు,చాలా థాంక్స్ అండి మీ అందరు లేకపొతే మా పెళ్ళి అయ్యెదే కాదు అంటూ పలకరించింది
రండి మా అమ్మా వాళ్ళని పరిచయం చేస్తా అంటూ వెనకకు తిరిగింది,ప్రియ ని అనుసరిస్తూ నడుస్తున్న ఆకాష్ కు,ఎదురుగా నడిచి వస్తున్న మనిషి ని చుస్తే ఎక్కడో చూసినట్టు జ్ణాపకం రాగా,వస్తున్న ఆ మనిషి వైపే చూస్తూ తన వేగాన్ని కించిత్ తగ్గించి నడుస్తుండగా చటుక్కున్న జ్ణాపకం వచ్చింది,అహను ధర్మజ,ఆకాష్ బాల్యమిత్రుడు.
ఒరేయ్ ధర్మజా అంటూ పిలిచేసాడు,ఆనందం ఆశ్చేర్యం కలగలిపిన కంఠంతో..అటు గా వెళ్తున్న ధర్మజ,అనుమానం గా ఆకాష్ వైపు చూస్తూ నిల్చుండిపొయాడు.....ఒరేయ్ నేను రా ఆకాష్ ని అంటూ తనని తాను పరిచయం చేసుకున్నడు ఆకాష్,గుర్తుపట్టిన ధర్మజ వేంటనే ఒక పొలికేకపెట్టినంత పని చేసి వేంటనే తమ చిన్ననాటి సంగతులు,అప్పటి స్నేహితుల గురించి ఎకబికిన మాట్లాడేసుకొని,అప్పుడు,కాస్త ఊపిరి పీల్చుకున్నారు,బొల్డంత సామన్లతో ఉన్న ధర్మజని చుస్తూ ఆకాష్,"ఒరేయ్ ఎక్కడికి రా వెళ్తున్నవ్,లేక ఎక్కడనుంచన్నా వస్తున్నావా" అంటూ ప్రశ్నించాడు,"ఔను రా,ఆస్త్రేలియా వెళ్తున్నను,కంపెనీ పని మీద,ఒక సంవత్సరం ఉండి వచ్చేస్తాను" అంటూ జవాబు చెప్పడు,మీ పని బాగుందిరా హాయిగా అలా అలా ఏగిరి వెల్తున్నరు అంటూ నీరసం గా కూలబడ్డాడు ఆకాష్,ఒరేయ్ నీకు అంతగా రావాలని ఉంటే చెప్ప రా,మా కంపెనీలో కాళీలు ఉన్నాయి,ఎలాగు నువ్వు ఏం.సీ.ఏ చేసా అంటున్నావ్,పైగా నీకు మూడేళ్ళు ఉద్యొగం చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి,వెంటనే నీకు మ కంపెనీలో ఉద్యొగం వస్తుంది,అసలు నీలాగా వేరే దేశాలు వెళ్ళి రావాలి అనుకునే వాళ్ళకి ఇది చాల మంచి అవకాశం రా అంటూ ఉత్షాహంగా చెప్పుకొచ్చాడు ధర్మజ

ఇదంతా వింటూ ఉన్న ఆకాష్,కాస్త నిరుథ్సాహంతో,అలా కాదు రా నాకిలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు,పుర్తిగా అక్కడే స్థిరపడాలని కోరిక అందుకనే పర్మనెంట్ వీసా కోసం ప్రయత్నిస్తున్న,ఏది ఆ ప్రయత్నాలు ఎవి ఒక కొలిక్కి రాలెదు,అన్ని ఫార్మాలిటీస్ అయితే పూర్తి అయిపొయయి అన్నడు,ఆ మాటలకి ధర్మజ,"సరేలేరా నీ ప్రయత్నం నువ్వు చేయ్యి,కాని ఎప్పుడన్నా మనసు మార్చుకొని ఒక సంవత్సరానికన్నా సరే చాలు వేళ్ళి వస్తా అనుకుంటే గనుక ఇదిగో నా విశిటింగ్ కార్డ్,ఇక్కడ నన్ను కాంటాక్ట్ చెయచ్చు" అని ఆకాష్ చేతిలో ఒక కార్డ్ పెట్టాడు,దాని వైపు చుస్తూ ఆకాష్, మనసు మార్చుకోవటమా ఆస్కారమే లేదు రా,మనసంతా ఒకటే కోరిక నిండిపొయి ఉంది రా,అబ్రాడ్లో స్థిరపడతం అంతే.ఐఅన సరే నిన్ను పలకరించటానికన్న ఉపయోగ పడుతుందిలే ఇది అంటూ జేబులో పెట్టుకున్నడు ధర్మజ ఇచ్చిన విశిటింగ్ కార్డ్ ను.
సరే రా మరి నేనిక బయలుదేరతాను,అమ్మా వాళ్ళంతా అక్కడ నిల్చున్నారు అంటూ ముందుకు నడిచాడు ధర్మజ,ఒహ్ ఔనా ఒక్క నిమిషం ఉండరా నేను నీతో వస్తా అంటూ, తన కోసం ఆగి నిల్చున్న ప్రియ వైపు చుస్తూ..ప్రియా నువ్వు వెల్తూ ఉండు,నేను ఇప్పుడే పది నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ ధర్మజ వైపు పరిగెట్టాడు,
ధర్మజ తల్లిని పలకరించాడు,అతని తండ్రి పొయి ఇప్పటికి పదేళ్ళు,ఎడుస్తున్న తల్లిని ఒదారుస్తూ,"అబ్బా ఒక్క సంవత్సరమే కదా అమ్మా వచ్చేస్తగా మళ్ళీ" అంటూ ఉండగా,సంవత్సరమే అని ఎంత తేలికగా చెప్పేస్తాడో చూడు బాబు అంటూ ఆకష్ వైపు చుస్తూ,మీ పిల్లలకు సంవత్సరకాలం ఇట్టే తిరిగివస్తుంది,కాని నాకలా కాదు బాబు అంటూ ధర్మజ ను పట్టుకొని,ఒరేయ్ ఒక నెళ్ళాళ్ళో వచ్చేయిరా,నిన్ను చూడకుండా నేను ఉండలేను రా అంటూ ఎడుస్తూ కొడుకుని వాటేసుకుంది. సరే సరే అలాగే వచ్చెస్తా కాని ముందు నువ్వు ఆ ఎడుపు అపేసి నన్ను నవ్వుతూ పంపు అంటూ,డ్రైవర్ ను పిలిచాడు,"దాసు అమ్మని జాగ్రత్త గా చుస్కో,ఏమి కావలన్నా తెచ్చిపెట్టు,అమ్మ కి ఎలాంటి లోటు ఉండకూడదు,అర్దం అయ్యింది గా,మీ ఆవిడని పడుకోమను అమ్మ కి తోడుగా,నేను తిరిగి వచ్చాక నీ జీతం పెంచుతా కాని అమ్మని జాగ్రత్త గా ఏ లోటు రాకుండా చుసుకుంటేనే,అంటూ చిన్న పిల్లవాడికి చాక్లెట్ ఆశ చుపించి అక్షరాలు దిద్దించినట్టు చెప్పుకొచ్చాడు ధర్మజ.ఒరేయ్ నువ్వు లేకపొవటమె రా నాకుండే పెద్ద లోతు..ఆ లోతు నువ్వు గాక వెళ్ళందరూ ఎలా తీరుస్తారు రా అంటున్న తల్లిని అనునయిస్థూ,
ఆకాష్ దగ్గర శెలవ తీసుకున్నడు ధర్మజ.లోపలికి వెళ్ళిపొతున్న ధర్మజనే చూస్తూ ఎడుస్తూ ఉన్న ఆవిడను ఒదార్చేందుకు వ్యర్ధ ప్రయత్నం చేస్తూ,ఆవిడను కార్లో కూర్చోబేట్టి,ఆవిడ వేళ్ళెదాక అక్కడే నిల్చోని ఉండిపొయాడు ఆకాష్,
ఎదో తెలియని బాధ గుండెల్లని మెలిపెట్టుతునట్టు గా ఉంది ఆకాష్ కు,ఆ బాధ ఎంతో సరిగ్గా తనకే అర్ధం కాలెదు,బహుసా ఆ తల్లి కన్నీళ్ళు తన గుండెలో ఆ బాధ జనించటానికి కారనభూతమేమో....అలోచిస్తూ పరధ్యానంగా పార్ధు ను దాటి వెళ్ళిపొతుండగా...ఒరేయ్ ఇటు రా అంటూ బిగ్గరగ పిలిచాడు పార్ధు. తేరుకొని,వెనక్కు వచ్చాడు ఆకాష్,ప్రియ ఆకాష్ కు తన తల్లి తండ్రుల్లుని పరిచయం చేసింది,వళ్ళని పలకరించాడు ఆకాష్,ఇంతలోనే ఒక పెద్దావిడ,నడవలేక నడవలేక నడుసుతూ,వార్ధక్యం తెచ్చిన నొప్పులన్నీఇబ్బంది పెడుతుండగా బొల్డంత శ్రమతో కూడిన అడుగులతో తమ వైపే వచ్చింది,ఆవిడ ప్రియ స్నేహితురాలు సరళ కు తల్లి గారు,తమ మనవడికి మొదటి పుట్టినరొజుకొసమయ్ తను తీసుకున్న బట్టలు ప్రియ చెతికిచ్చి అమెరికాలో ఉన్న తన కూతురుకి చేరవేయాలని వచ్చారు,రాగానే ప్రియను నవ్వుతూ పలకరించారు,క్షేమ సమచారాలు కనుక్కొని,చేతిలో ఉన్న ప్యాకేట్ ను ప్రియ కి అందిస్తూ,తెలంగాణా మాండలికంలో,ఇది ఎత్తకబొయి నా బిడ్డ కీయమ్మా,మంచిగున్నామని చెప్పు అంటూ ఎర్రబడ్డ కళ్ళ నుంచి ఎప్పుడేప్పుడు బైటకి వద్దమా అని సిద్దం గా ఉన్న బాధప్రవాహన్ని చుపుడు వేలుతో ఆపే ప్రయత్నమేదో చేస్తూ ఉంది ఆవిడ,అయ్యో ఉరుకొండి ఆంటీ... ఎందుకు ఎడుస్తారు,నేను చేప్తా లేండి సరళ కు అంటూ ఆవిడ చేయి ని అందుకుంది ప్రియ,ప్రియ మాటలకి ఇక మేము ఆగలేము అంటూ బైటకి వచ్చేసాయి ఇప్పటిదాకా దాగుడు ముతలు ఆడుతున్న కన్నీళ్ళు,"ఆంటీ మంచిగుంది,నిన్నేం పరేషాన్ గావద్దంది అని చెప్పు బిడ్డా,బుడ్డొడికి ఇయి పంపినానని చెప్పు,నేను ఈడ నిలవలేను గాని పొయొత్తా బిడ్డా" అంటూ ప్రియ మాట కొసం ఎదురుచుడకుండానే తిరిగి వెళ్ళిపొయింది ఆవిడ,పక్కనే ఉన్న ఆకాష్ మదిసముద్రము లొ మరలా ఒక రాయి పడ్డట్టు అయ్యింది,మళ్ళీ ఆవేదనపు అలలు,వాటి నుండి తనలో పొంగుతున్న ఆలొచనల తెరలు.... మనసు మార్చుకోవటానికి పార్ధు కోసం వెతికాడు,పక్కనే ఉన్న పార్ధు దగ్గరకు వెళ్ళి,పార్ధు మీ నాన్న గారు ఎరిరా చాల రొజులు అయ్యింది కలిసి అంటూ అడిగాడు ఆకాష్, అదిగో రా అక్కడే నిల్చున్నారు అంటూ భాస్కరం గారి వైపు చూపించాడు పార్ధు,భస్కరం గారి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు ఆకష్, "ఆ ఎమయ్యా ఎంత వరకు వచ్చాయి నీ విశా పనులు అంటూ పలకరించారు భాస్కరం గారు,ఎదో అంకుల్ నడుస్తోంది,రేపు పొద్ధునే వెళ్ళాలి చెన్నై స్టాంపింగ్ కి అంటూ సమధానం చెప్తూ పక్కనే ఉన్న పార్ధు తల్లి సుసీలమ్మ గారి వైపు చుసాడు ఆకాష్,గుడ్లలో నీళ్ళు కుక్కు కుంటూ,పార్ధు వైపే చుస్తూ ఉన్నది ఆవిడ, ఆ చూపు ఇందాక ధర్మజ తల్లి ధర్మజ వైపు చూసిన చూపే,కాకపోతే కాసింత తీక్షనత,కాసింత విషాదం ఎక్కువగా ఉంది ఈవిడ చుపులో,ఎందు చేత ఈ వ్యత్యాసం అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ఆకాష్.ఎర్రగా కందిన భాస్కరం గారి మొమును అప్పటిదాకా గమనించనే లెదు తను,ఆయిన తన బాధను కప్పిపుచ్చుకునేందుకు సతవిదాలా ప్రయత్నిస్తున్నరు, గుంబనంగా ,పైకి నవ్వుతూ ఉన్నా,లో లోపల ఆఇనా అనుభవిస్తున్నదేంటో ఆకాష్కు అర్ధం అవుతునే ఉంది,
చదువుల పేర కొనాళ్ళు,ఉద్యొగాల పేర మరి కొన్నాళ్ళు,ఇక స్తిరపడడం,పైకి ఎదగటం అనే సాకులతో శాశ్వతం గా తమకి దూరం అయిపొతున్న కొడుకుకి ఏమి చెప్పలేక,తన ఎదుగుదలను ఆక్షెపిస్తున్నరు అనే నెపం మొపుతాదేమో అనే భయంతో,తన భావాలను కొడుకుకి తెలియచేయలేక,తమ బాధను వెళ్ళండించలేక,భార్యను ఏమి చెప్పి ఒదార్చాలొ,ఎన్ని చెప్పి ఉరడించలో తెలియరాక, ఈ బాద థప్పదనే చేదు నిజం జీర్నించుకొలేక,పొంగివస్తున్న దుక్కన్ని పంటిబిగువున బందించటం చెత ఎర్ర బడింది కాబొలు ఆయిన మొము,
ఈ అలొచనలు ఆకాష్ ను నిలువనీయకున్నాయి,ఒక సారి ప్రియ తల్లి వైపు చుసాడు,సుసీలమ్మ గారి చుపుల్లొ ఉన్న విషాధం కన్నా కాసింత తక్కువే అయినా,విషణ్ణ వదనం తోనే ప్రియ చేతిని తన ,చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతూ,ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉన్నది ఆవిడ,పక్కనే ప్రియ తండ్రి,కూతుర్ని అత్త వారింటికి పంపేటప్పుడు ఆడపిల్ల తండ్రిలో ఉండే సహజమయిన విచారం,ఆందోళన,ఎం చెయ్యాలో తొచక,నిల్చున్న చొట నిల్చోక,అటు ఇటు తిరుగుతున్నరు. ఎం జరుగుతోందో,ఎందుకు జరుగుతోందో,అసలు తనలో అలజడి రేపిన ఈ సంఘటనల సమాహారం ఈ నాడు తనకు ఎందుకు ఎదురయ్యిందో,ఎప్పుడూ బాద అనే దాన్ని దరిచేరనీయని తనకు ఈ అనుభవం ఎంతో అర్ధం కావట్లెదు ఆకాష్ కు,వాళ్ళందరి కళ్ళళో కనపడుతున్న బాధ,కాదు,బాధ కాదు ఇంకెదన్నా పెద్ద పదమే వాడాలి దానికి,మాటల్లో చెప్పలేని,ఎవరూ తీర్చలేని ఆ ఆవేదనేదో,తనని కుదా భాదపెడుతోంది,నిలకడలేని తన మనసు ను ఒక చొట నిలిపే ప్రయ్త్నం చెయ్యతంలో విఫలమయ్యడు ఆకాష్.చాలా నిరాస్క్తతో అటు ఇటు తిరుగుతుండిపొయాడు,మైక్ లో అనౌన్శ్మెంట్ వినపడాగనే గుండె జల్లు మన్నది....తన ప్రాణ మిత్రుడు పార్ధు ఇక మళ్ళీ తిరిగి రాదు,ఎముంది రా ఇండియాలో రావటనికి ప్లాట్ల సంగతి,ఇంటి అద్దెల సంగతి చూడతానికి బ్రొకర్ ను పెట్టాను అన్న పార్ధు మాటలౌ గుర్తుకువచ్చయి,వాటిని చుదటానికి బ్రొకర్ ని పెట్టాడు కాని,భస్కరం అంఖుల్ ని చుడటానికి ఎవర్ని పెట్టాదో వీడు,అయినా ఈ అలోచన నాకింతవరకు ఎండుకు రాలెదు,ఇండియా అనగనె వాడికి ప్లాట్లు,ఇళ్ళు,అద్దలే గుర్తుకువచ్చాయే కాని,అమ్మా నాన్న గుర్తుకురాలేదేంచేత,చిన్నప్పుడు మా అమ్మ ను వదిలి రాను రా అంటూ తను ఎంత అడిగినా వినకుండా,సెలవల్లొ వాల్ల అమ్మతో పాటే అమ్మమ్మ వాళ్ళ ఊరు పారిపొయిన పార్ధు గాడేనా ఇప్పుడు అమ్మ ను వదిలేసి ఇలా...తన చెంపలమీదనుంచి జాలు వారుతూ,తన ముంజెతి ని చల్లగా తాకిన కన్నీటి చుక్కను చూసి చట్టుకున్న వెనక్కు తిరిగి చుసాడు,ఎవరు లేరక్కడ,అంటే ఈ కన్నీటి చుక్క నా కళ్ళడా,కాదు నా మనసుది అనుకుంటూ పొంగివస్తున్న కన్నీటి దారను చేతితొ తుడిచి,వాటి ఆణవాళ్ళు కుడా లేకుందే ప్రయత్నం చేసి,పార్ధు వైపు నడిచాడు,లొపలకి వెళ్ళటానికి సన్నధుదై,ఎంటి రా ఎక్కడికెళ్ళిపొయావు,నీకొసమే వెతుకుతున్నా,ఏనీవే ఆల్ ద బెస్ట్ రా.త్వరలో నిన్ను అమెరికాలో కలవాలని కొరుకుంటున్న అంటూ తన ను వాటెసుకున్నడు పార్ధు,యాంత్రికం గా తను కుడా వాటెసుకున్నడు ఆకాష్,,అరవింద్ గాడు అలకపానుపు దిగాడు రా అంటూ పక్కన నిల్చున్న అరవింద్ ను చుపించాడు,ప్రియ తన తల్లి తండ్రులకి వీడుకోలు చెప్పి కళ్ళు తుడుచుకుంటూ వచ్చి పార్ధు పక్కన నిల్చుంది,ఆ కణీళ్ళు తల్లి తండ్రిని వదిలిపెట్టి అత్తవారింటికి వెళ్ళే ప్రతి ఆడపిల్ల కళ్ళళొను కదలాడే జలాప్రవాహమే,కొత్తేమి కాదు,కాని భాస్కరం గారి కళ్ళలొను,సుస్సెలమ్మ గారి కళ్ళలో కదలదే జలప్రవాహమే,విషాద వుప్పేనై ఆకాష్ ను ముంచేస్తోంది,కొడుకుని ప్రేమగా ఆలింగనం చేసుకొని,"ముసలివాడినైపొయాను రా ఇక ఎక్కువ కాలం బ్రతకను,జాగ్రత్త రా నువ్వు"అంటూ కళ్ళలో నుంచి జల జలా రాలి పడుతున్న కనీటిని ఈ సారి ఆపే ప్రయత్నమే చేయలేదు భాస్కరం గారు,తల్లి దగ్గరకు వేల్లి ఆవిడను గట్టిగా వాటేసుకున్నడు పార్ధు,"ఒరేయ్ పార్ధు,ఎప్పుడూ నా కొంగు పట్టుకొని తిరిగే నిన్ను చుసి నేను మురిసిపొతుంటే,అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డలు వచ్చక కాదు అనే మా అమ్మ మాటలను,తెలికగా కొట్టి పారెసేదాన్ని రా, ఇప్పుడు అర్దం అయ్యింది,పెద్దవళ్ళు ఎది చెప్పినా అనుభవంతో చెప్తారు అని" అంటూ అప్పటిదాకా గుంభనం గా నిల్చున్న ఆవిడ ఒక్కసారిగా బిగ్గరగా ఎడ్చెసింది,ఎడుస్తున్న తల్లి ని చుస్తూ పార్ధు,అమ్మా ఎడవకు,గడ్డాలు వచ్చాక కుడా కొంగు పట్టుకుంటే అమ్మకూచి అంటారు కదా మరి,మా మంచి అమ్మ అర్ధం చేసుకుంతుంది నన్ను,నాన్న ఉన్నరు గా అమ్మా నీకు తోడు గా అంటూ ఆవిడను ఒదార్చాడు,ఇదంతా చుస్తూ నిల్చున్న ఆకాష్ కు మదిలో తెరలు తెరలు గా వచ్చిపడుతున్న ఆలొచనలు,విపరీతమయిన కలవరం,"నాన్న నీకు తోడు అంటున్నడే కాని మీకు నేను ఉంటాను తోడు గా" అనడే వీడు,అయినా పార్ధు గాడికి ఇక్కడ ఎం తక్కువ,నేనంటే దబ్బు లేని వాడిని,ఇబ్బందులు జాస్తి గా ఉన్నవాడిని, కాని పార్ధు అలా కాదే,భాస్కర్ అంకుల్ కే ఒక పది కోట్లు అవలీల గా ఉంటాయి,ఇక పార్ధు గాడు గత ఐధెళ్ళళ్ళో విపరీతం గా ఎడ పెడ సంపాడించెసాడు,పుష్కలం గా ఉంది వాదిదగ్గర లక్ష్మి,మరి ఇంకా ఎందుకు ఈ పరుగు,కనీసం తన తల్లి తంద్రుల వార్ధక్యం,తన తంద్రి,ఎక్కువరొజులు బ్రతకను రా
అంటున్న మాటలు కుడా తనను కదిలించలేకపొయయా... భాస్కరం గారికి ఏమి కాని తనకె ఆ ఒక్క మాట ఇంతటి ఆలొచనను ప్రేరేపించింది మరి పార్ధు ఆయినకు కొడుకు అయ్యి ఉండి ఎందుకు ఆ మాటలకు స్పందించలేదో ఆకాష్ కు అవగతమవ్వలేదు.

అదే తెలుసుకొవాలనిపించిది, లొపలికి వెల్లబొతున్న పార్ధు వైపు పరుగుతీసాడు,ఒరెయ్ పార్ధు ఒక చిన్న మాట రా అంటూ పక్క కు పిలిచాడు, ఎంటి రా నీ బాకీలు బహుమతుల సంగతేనా అంటూ నవ్వుతూ ఉత్సాహం గా ఉన్న పార్ధు ధొరని కి కాస్త చిరాకు పడుతూ,అది కాధు రా,ఇలా రా అంటూ పక్కకు తీసుకువెళ్ళాడు,పార్ధు నీకు వెళ్ళిపొతున్నందుకు బాధ వేయట్లెదా రా అంటు సుటిగా ప్రశ్నించాడు,పార్ధ సారధి అంత కంటే సూటిగా లేదు రా అని జవాబు ఇచ్చాదు, అదెంటి రా కనీసం మీ నాన్న గారిని అమ్మ ని చుసినప్పుడన్న నీకు బాధ అనిపించట్లెదా రా అంటూ ఆశ్చర్యం గా ప్రశ్నించాదు,"అందుకే కదా రా మా వాళ్ళ వైపన్నా చూడట్లెదు నేను" అని సమధానం చెప్పిన పార్ధు వైపు చుస్తూ ఖిన్నుడైనిల్చుండిపొయాడు ఆకాష్,పొరుగింటి పుల్లకూర రుచి అంటే ఇదే కాబొలు.....

తన చేయి పట్టుకొని ఉపుతున్న పార్ధు పిలుపు విని ఒక్క సారి గా ఈ లొకం లొకి వచ్చిన వాడై,పార్ధుతో పాటు నడిచి వెళ్ళాడు,లొపలకి వెళ్ళిపొతున్న కొడుకుని ఆఖరిసారిగా వాటెసుకున్నారు భాస్కరం గారు,తల మీద చేయి పెట్టి జాగ్రత్త రా పార్ధు,వేళకి తిను,సంపాదనలో పడి ఆరొగ్యం పాడుచేసుకొకురా అంటూ ఎడుస్తు చెప్పారు సుసీలమ్మ గారు,ఆ కన్నీటిలో కొడుకు ఎది అడిగినా కాదనలేని నిస్సహయత....ఇరువురు తమ కొడలు ప్రియ ను కుడా అశీర్వదించి,లొపలకి వెళ్ళిపొతున్న కొడుకు కొడలను అలగే చుస్తూ నిల్చుండిపొయారు.ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళేదాకా చుస్తూ ఉండిపొయారు,పార్ధు లొపలికి వెళ్ళిపొగానే ఆకాష్ గట్టిగా నిట్టురుస్తూ పక్కకు చుసాడు.. తన పక్కనే నిలబడి ఉన్న భస్కరం గారి కళ్ళళ్ళో గిర్రున తిరిగిన కనీళ్ళు,ఆత్రం గా కొడుకు నడిచి వెళ్ళిన వైపు గా పరుగులుతీస్తున్న ఆయిన చూపులు,పక్కన సుసీలమ్మ గారు తదేకం గా ఆ ఎంట్రన్స్ వైపే చుస్తూ ఉండిపొయారు, రండి అంకుల్ వెల్దాం అన్నడు భాస్కరం గారితో ఆకాష్,

"ఉండు బాబు పార్ధు ఇంకాసేపట్లో ఆ కనపడుతున్న కిటికీలో నుంచి వెల్తాదు,అంటూ సమాధనమిచ్చారు భాస్కరం గారు,కాని ఆ కిటికీ వైపు రావలంటే అక్కడ చాలా సేపు చెకింగ్ ఉంటుంది అది పూర్తి చేసాక కాని రావటానికి వీలుండదు అంకుల్ అన్నడు ఆకాష్,పొనీలే బాబు ఇక ఈ జీవితం లొ మళ్ళీ చుడలేను గా వాడిని,ఈ క్షణం మళ్ళీ తిరిగి రాదు గా అంటూ భస్కరం గారు పక్కనే ఉన్న సుసీలమ్మ గారి వైపు చుసారు,ఇద్దరూ ఒకరివంకఒకరు చుసుకుంటూ కళ్ళతోనే ఒకరినొకరు ఒదార్చుకుంటున్నరేమో అనిపించిది ఆకాష్ కు,ఎదో మాట్లాడాలి అని ప్రయత్నించాడు గొంతు మూగబోయింది,ఎదో అడ్డం పడింది కాబోలు ,ఆ అడ్డు పడింది పొంగి వస్తున్న దుఖం కాబోలు,దిగమింగాడు,అంకుల్ నేను అక్కడ కూర్చోని ఉంటాను మీరు పార్ధు ను చుసాక రండి అంటూ వెళ్ళిపొయాడు,మనిషి అయితే కూర్చున్నడే కాని అలొచనలు ఒక చొట నిలువనీయట్లెదు,ఆకాష్ కు తన తల్లి తండ్రులు గుర్తుకువచ్చారు,
ఒరేయ్ నువ్వు ఎక్కడికీ వెళ్ళి ఎమీ సంపాదించకర్లెదు రా,ఇంటి పట్టున ఉండి మా కళ్ళ ముందు ఉండరా,ఇప్పుడు నీ సంపాదన సరిపొతోంది కదా,మేము పొయాక నీ ఇష్టం వచ్చింది చేస్కో రా అనే తల్లి మాటలకి తను ఆవేశంతో
"ఆ నువ్వు నాన్నా అలా అనుకోబట్టే ఇవాళ నా బ్రతుకు ఇలా ఎడ్చింది,చాలీ చాలని సంపాదనతో,సొంత ఇల్లు లేదు,సరదాగా ఉండటానికి కావాల్సిన ఆ సదుపాయాలు సమకూర్చుకోలేకపొయాము,కనీసం ఇప్పుడన్న నన్ను వెళ్ళనీయండి,నేనన్నా వెళ్ళి సంపాదించి వచ్చే వాళ్ళకన్నా ఏమన్నా వెనకేస్తాను,నేను పడ్డ భాద వాళ్ళు పడకుండా ఉంటారు అంటున్న తన మాటలకి అడ్డు కట్ట వేస్తూ మధ్యలొ తన తంద్రి,"అబ్బో అమేరికా వెల్తే సంపాదించాలా,చేవ లేకపొతే సరి,సంపాదించటానికి ఎక్కడికో వెళ్ళకర్లేదు,ఇక్కడే ఉండి కుడా కోట్లు గడించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు అందులో నువ్వు ఆరాదించే రీలయన్స్ అదినేత ధీరుభాయి అంబాని నుంచి పుల్లారెడ్డీ స్వీట్స్ వోనెర్ పుల్లారెడ్డి దాకా..
ఒరేయ్ సంపదించాలని ఉంటే సరిపొదు రా కష్ట పడే తత్వం కుడా ఉండాలి ఈ వయసులో, అప్పుడే ఏమన్నా సాదించగలవు,అమెరికా వెళ్ళి డాల్లర్స్లో సంపాదించి రూపాయల్లో లెక్క చుస్కొవటమనే సులభ మార్గన్ని ఆవలంభించటం గొప్ప కాదు రా,నీకున్న ఆ కాస్త బుర్ర ఎదో ఇక్కడే వాడు,తద్వార నీకు నీతో పాటు ఇక్కడ ఎంతో మందికి ఆర్ధిక ఉపాధి కల్పించు,మంచి పారిస్రామికవేత్త వి అవ్వు,అప్పుడు వచ్చిన సంపాదన ఉంటుంది చుసావు దానిని ఇవ్వు నీ ముందు తరాలకి దాని తో పాటు స్రమించే తత్వాని సాదించే తెగువ ని కుడా అలవర్చుకుంటారు నువ్వు కలలు కనే నీ ముందుతరాల వాళ్ళు,అంతే కాని ఎక్కడికో పారిపొయి అక్కడ ఊడిగం చేసి ఆర్జించిన డబ్బు ను కాదు రా నువ్వు ఇవ్వల్సింది.డబ్బు సంపదించటం కోసం అమెరికాలకి ఆస్ట్రేలియా లకి ఇంగ్లాండ్లకి వెళ్ళటం తప్పని నేను అనను రా,కాని సంపాదించే తెలివి,సాదించకలిగిన వనరులు అందుబాటులో ఉన్న వాళ్ళు కుదా అదే సులభ మార్గాన్ని అలవర్చుకొని అలా పారిపొవటం కేవలం వాళ్ళ కుటుంబాలకే కాదు రా మన దేసానికి కుడా తీరని లొటు,యువతరం ఉండాల్సింది దేశాన్ని అంటిపెట్టుకొని,పని చేయల్సింది ,పని చేయాల్సింది దేశం కొసం,ఆ పనిలో నుంచి తను లబ్ది పొందాలి,పరిస్తితులు అనుకూలించని వారిని మనం ఆపలేకపొవచ్చు కాని అంతో ఇంతో అనుకూలించకలిగిన పరిస్తితులు ఉన్న నెఏ లాంటి చవటలు కుడా ఇలా ఆలొచించిబట్టే మనదేశం... మిమ్మల్ని కన్నందుకు మాకు ఈ కడుపుకోత ,అంటూ ఆవేశం గా మట్లాడే తన తండ్రి మాటలకి ఆ సర్లే ఏం చెయ్యలన్నా ముందు పెట్టుబడి కావాలి,అది ఇవ్వగలారా మీరు అంటూ ఎదురుప్రశ్నించిన తన అమాయకత్వం జ్ణప్తికివచ్చాయి ఆకాష్ కు" ఎదో నిర్నయించుకున్నవాడిలాగ లేచి నిల్చున్నాడు,చుట్టు పక్కలంతా కలియ చుసాడు అరవింద్ కోసం, దిగలుగా ఒక పక్కన కూర్చోని ఉన్న అరవింద్ ని చుస్తూ,ఒరెయ్ అరవిందం ఇటు రా అంటూ ఆనందం గా అరవింద్ దగ్గరకు పరిగెత్తడు,ఆకాష్ ని చుస్తునే,అరవిందం అనద్దని నీకు లక్షల సార్లు చేప్పాను అంటూ పొట్లాటకు దిగాడు అరవింద్,సర్లే రా అరవిందం రేపటి నుంచి పిలవనులే కాని నీకో మాట చెప్తాను వినరా అన్నడు ఆకాష్,తన మాటను లెక్కచేయని ఆకాష్ వైపు చుస్తూ ఆ చెప్పరా ఆకాశం ఎం చెప్తావో అన్నాడు అరవింద్,ఇద్దరూ ఒకరి వంక ఒకరు చూస్కొని ఒక్కసారి గా బిగ్గర గా నవ్వుకున్నారు,ఆ నవ్వుల పువ్వుల నడుమ అరవింద్ తో ఆకాష్,ఒరేయ్ అరవింద్ ఐ ఆం సొ సరీ రా ..నిన్ను నీ భావాలను ఎగతాలి చేసి ఆటపట్టించినందుకు,ఈ తప్పు కు ప్రాయొశ్చితం గా నీకు రేపు నేను పేద్ద పార్టీ ఇస్తాను సరే నా అంటూ ప్రేమ గా అరవింద్ భుజం మీద చేయి వేసాడు,ఆకాష్ మాటలకి కాసింత నిర్లక్ష్యం గా,పార్టీ ఆ, రేపా.....,ఎంటి సార్ మర్చిపొయినట్టు ఉన్నారు రేపు మనం చెన్నై వెళ్ళలి నీ వీశా అదే పర్మనెంట్ వీశా స్టాంపింగ్ కోసం,అంటూ వ్యంగ్యం గా సాగతీసాడు. ఆరవింద్ మాటలకి నవ్వుతూ, ఒహ్ నీకు చెప్పటం మరచిపొయానురా నేను రేపు చెన్నై వెళ్ళట్లెదు అన్నాడు ఆకాష్.ఆకాష్ మాటలకు ఒక్కసారి ఉలిక్కిపడి చుసాడు అరవింద్,అదేంటి రా ఎందుకు వెళ్ళట్లెదు,మరి నీ హ్ చ్1 వీశా సంగతేంటి,పొస్ట్ పోన్ ఏమన్నా చేయించుకున్నావ అంటూ ప్రశ్నించాడు అరవింద్.లేదు రా ఇక నాకు హ్ చ్1 వీశాతో పనే లేదు అంటున్న ఆకాష్ తో అరవింద్,అంటే నువ్విక అమెరికా వెళ్ళవా,నీ కల, నీ జీవిత ధ్యేయం అదేకదరా అంటూ అమయకంగా ప్రశ్నించాడు,వెల్తాను రా కాని శాశ్వతం గా ఉండటానికి కాదు నా యెదుగుదలకు కావాల్సిన పెట్టుబడి సంపాదించటానికి అన్నాడు ఆకాష్ ధీరత్వం తొనికిసలాడుతున్న గొంతుతో.అంతలోనే తమ వైపు వస్తున్న పార్ధు తల్లి తండ్రులని చూసి లేచి నిల్చున్నారు ఇద్దరూ,ఉండండి అంకుల్ కార్ తీసుకువస్తా అంటూ హడావిడి గా పరిగెత్తాడు అరవింద్.శోకాతప్త హృదయాలతో భారం గా అడుగులు వేస్తూ నడుస్తున్న ఆ దంపతుల్ని చూస్తుంటే ఆకాష్ కు ఇందాక తనకు అర్ధం కాకుండా మిగిలిపొయిన ఒక విషయం అర్ధం అయ్యింది,ధర్మజ తల్లి లోని కన్నీటికన్నా,భాధకన్నా ఈ దంపతుల కళ్ళలో కదలాడే భాధకు ఎందుకు అంత తీవ్రత ఉందో,ధర్మజ సంవత్సరం లొ తిరిగి వస్తాడన్న ఆశ ఆవిడ కళ్ళలో కన్నీరుని,గుండెల్లో భాదని కాస్త తగ్గించింది,ఎప్పటికీ ఇక తిరిగి రాను,కావలంటే మీరే వచ్చి అక్కడే సెటిల్ అవ్వండి నాన్న అంటూ.. ఉన్న దేశాన్ని వదిలిఎక్కడికీ వెళ్ళలేనితన తండ్రి నయిజాన్ని లెక్కపెట్టక,ప్రశ్నించే పార్దు వల్ల వాళ్ళకి శాశ్వతం గా కలిగిన పుత్రశొకం,కొడుకు ఉన్నా లేని వాళ్ళు అయిపొయిన వయినం,ఓంటరి అయిపొఇన ఆ దంపతుల తీరు,వారి ఆ తీవ్రమయిన భాధ కి కారణం. అవగతం అవ్వగానే చెప్పనలవి కాని బాధ పొంగివస్తున్నా,తన తల్లి తండ్రులకి ఆ గతి పట్టబోదని గుర్తువచ్చినప్పుడు ఒకింత ఆనందం ఆకాష్ కళ్ళళ్ళో.కార్ ఎక్కి కుర్చోని జేబులు వెతుకోనారభించాడు ఆకాష్,చేతికి తగిలిన ధర్మజ విసిటింగ్ కార్డ్ బైటకు తీసాడు,మనసు మర్చుకుంటే నాకు ఫొనె చేయర అన్న ధర్మజ మాటలు గుర్తుకువచ్చి ఒక్కసారి గట్టి గా ఊపిరిపీల్చుకున్నడు,గుండెలనిండా నిండిపొయిన ఆత్మవిస్వాసం,అనిర్వచనీయమయిన ఆనందంతో తను కూర్చుంది కార్లో కాదు చంద్రమండలం మీద అనట్టు గా కిటికీలో నుంచి బైతకు చుస్తూ ఉండిపొయాడు ఆకాష్, సార్దక నామధేయుడు.

Monday, April 2, 2007

మేడిపండు

అమ్మా నాన్నా జానకి అందరూ రండి త్వరగా త్వరగా అంటూ పరిగెత్తుకుంటూ లొపలకి వచ్చి నట్టింట్లో నిలబడి చేతిలో ఉన్న పుస్తకం వైపే చూస్తూ ఆనంద తాండవం చేస్తున్నాడు విజయ్ శేఖర్,పూజాగ్రుహమునందు భగవంతుడి ముందు కైమోడ్చి నిల్చొని మంత్రపుష్పం చదువుతూ ఉన్న విజయ్ తల్లి సుమతి,కొడుకు గొంతు విని పరుగులాంటి నడకతో బైటకి వచ్చారు,లొపల ముల్లపూడి వెంకట రమణ గారు రాసిన భాగవత కధలు చదువుతూ కూర్చున్న రామక్రిష్ణ గారు కొడుకు పొలికేక విన్నా,ఆ భాగవత కధామృతాన్ని ఆస్వాదిస్తూ మధ్యలో లేవటానికి మనస్కరించక లొపలే కుర్చుండిపొయారు.తన పిలుపు విని వచ్చిన తల్లిని చెల్లిని చూస్తూ నాన్న ఏరి,త్వరగా రమ్మను అమ్మా అంటూ తల్లిని తొందరపెట్టసాగాడు .తన అనందాన్ని తన వాళ్ళతో పంచుకొవాలన్న తపన అంతటిని దాచుకోలేకున్నాడు విజయ్. అదే పనిగా నాన్నా నాన్నా అంటూ పిలుస్తున్న కొడుకు పిలుపులకి ఇక తప్పేలా లేదు,ఒక సారి పొయి వస్తేగాని వీడి గొల ఆగదు అనుకుంటూ మెల్లగా పడకుర్చీలో నుంచి లేచి బైటకు వచ్చారు రామక్రిష్ణ గారు. విజయ్ వంక చూస్తూ.. "ఆ ఏరా బడుద్ధాయి,ఎంటి ఆ హడావిడి అంటూ ప్రశ్నించారు" తండ్రి మాటలకి ఒకింత గర్వం,ఒకింత అనందం ఒకింత అశ్చెర్యం కలగలిపిన చూపుతో తండ్రి వంక చూస్తూ,అతని చేతిలో ఆ నాడే మర్కెట్లోకి వచ్చిన మాసపత్రికను పెట్టాడు,కొడుకు వాలకం అర్ధం కాక,కాస్త సందేహం గా ఆ పత్రికను తిరగేసారు రామక్రిష్ణ గారు,లోపల తాటికాయంతటి అక్షరాలతో ప్రచురితమైన వార్తను చూపిస్థూ,బిగ్గరగా చడవండి నాన్న గారు అన్నాడు విజయ్,కళ్ళజొడు సరిచేసుకుంటూ చదివారు రమక్రిష్ణ గారు,"ఉగాది కధల పోటీలలోమొదటి బహుమతి సంపాదించుకున్న కధ "గంగా ప్రవాహం" రచయిత శ్రీ విజయ్ శేఖర్ గారికి మా స్పూర్తి మాసపత్రిక వారి హార్ధిక శుభాకంక్షలు.కొడుకు వ్రుద్ధిలోకివస్థున్నాడనటానికి ఇది సంకేతం అని తెలిసినా పొగిడి పాడుచేయబుద్ధేయక మిన్నుకుండిపొయారు రామక్రిష్ణ గారు,కాని సుమతిది తల్లి మనసుగా వెంటనే లొపలకి పరుగెత్తుకెళ్ళి పంచదార తెచ్చి కొడుకు నోటిలొ పొస్తూ,నా తండ్రే నా నాయనే,నేను చెప్పలేదుటండి వీడెప్పుడో పెద్ద రచయత అయిపొతాడని అంటూ కొడుకుని చుస్తూ మురిసిపొయింది.ఏదో అలోచిస్తూ నిల్చున్న విజయ్ చెల్లెలు జానకి,అన్నయ్య వంక చూస్తూ,అన్నయ్యా ఐతే వాళ్ళు ముందుగా ప్రచురించిన దాని ప్రకారం ఈ కధల పొటిలో గెలుపొందిన వారికి ప్రముఖ రచయత వేదాంతం పద్మనాభ శాస్త్రి గారితో రెండు రొజులు గడిపే అవకాడం ఇస్తారు కదా అంటూ అడిగింది."ఔను అందుకేగా మరి నా ఈ సంబరం,లేకపొతే ఇంతకముందేన్నడూ నా కధలకు బహుమతి రాలేదా,లేక పత్రికల్లో ప్రచురితమవ్వలేదా" అంటూ జానకి తల మీద మొట్టికాయ వేస్తూ,లోపలకి వెళ్ళిపోతున్న తన తండ్రిని అనుసరించాడు విజయ్.మళ్ళీ యధాతధం గా పడకుర్చీలో పడుకొని భాగవత కధలు చదవటంలో నిమగ్నమయ్యె ప్రయత్నం చెయ్యసాగారు రామక్రిష్ణ గారు,తన పక్కనే కూర్చున్న కొడుకు వాలకం ఒక కంట కనిపెడుతునే ఉన్న ఆయినకు విజయ్ ఆంతర్యం అర్ధమౌతూనే ఉంది,ఇప్పుడు వాడు ఆ రచయిత తో పాటురెండు రొజులు గడపాలి అది కూడా అతని ఇంటికి వెళ్ళి,దానికి తన అనుమతి కావాలి,అడాగాలని ఉన్నా తను వద్దని అంటానేమో అనే సందేహం అడుగనీయకుండా అడ్డుపడుతోంది,ఇరవయ్ మూడేళ్ళనుంచి చూస్థునాడు తన కొడుకుని ఆ మాత్రం అర్ధంచేసుకోలేరా..... వేలుపట్టి నడిపించిన రొజుల్లో ఊతమయి,ఆటలడే వయసులో బొమ్మ అయ్యి,స్నేహితులే లోకం అయ్యే సమయంలో తాను కుడా ఒక స్నేహితుడయ్యి కొడుకు ఎదుగుదలలో ప్రతి క్షణం ప్రతి నిముషం వెన్నంటి ఉన్నారు రామక్రిష్ణ గారు. అభ్యుధయ భావలు గల మనిషి,కొడుకు చెప్పే ప్రతి మాటను పూర్తిగా వినటం,వాడు చేస్తా అన్న ఏ పనిని ఆపకపొవటం అలవర్చుకున్నరు, ఎందుకంటే మంచేదో చెడెదో గుర్తించకలిగిన శక్తిని ఉగ్గుపాలతో అలవర్చారు ఆయిన.తెలుగు పండితుడు అయిన రామక్రిష్ణ గారు వ్రుత్తిరిత్యా బ్యాంక్ ఉద్యోగి అయినా,ప్రవ్రుత్తి రిత్యా రచయత మంచి సాహితీవేత్త,పండిత పుత్ర పరమ సుంట అనే ఆర్యొక్తినీ తిరగరాసే ప్రయ్త్నమేమన్నా చేయాలి అని ఆయిన ఎప్పుడూ అనుకునేవారు ,తన కొడుకు చందమామ పుస్తకాలు వీడికి మంచి సాహిత్యాభిరుచిని పెంచాలి అనుకునే వారు,కాని ఒకళ్ళు పెంచితే పెరిగేదా అభిరుచి,అది అంతర్గతం గా జనించి నవనాడుల్లోను నిలిచిపొవల్సినదే.కాగల కార్యం గంధర్వులే చేస్తారు అన్నట్టు,తన అలోచనలను ఊహలను నిజం చెస్తూ,సహజ సాహిత్యాభిలషతో పెరిగాడు విజయ్,పుస్తకం చుసినప్పుడు అతని కళ్ళళో కదలాడే ఆనందం,దానిని త్వరగా చదివెయ్యలనే అతని తపన చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నారు రమక్రిష్ణ గారు,నెలారంభమలో జీతం వచ్చిన వెంటనే బజారుకు తన ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకెళ్ళెవాళ్ళు ఆయిన,మీకేం కావలో కొనుకొండర్రా,కాని చెరి పది రూపాయలు మాత్రమే అనేవారు,జానకి వెంటనె జడపిన్నీసులు,రంగు రిబ్బన్లు,ఇంకా బొల్దన్ని చాక్లెట్లు,బొమ్మల చిట్టా చెప్పేసెది ఆపకుండా,కాని విజయ్... నాన్న గారు నాకు చందమామ పుస్తకం కావాలి అని అడిగేవాడు,మూడు రూపాయలే రా అది,మిగిలిన యేడు రూపాయలకి ఇంకేమన్న కొనుక్కొ రా అని కొడుకుతో అంటూనే లొలొపల,వీడు మరొక పుస్తకమేమన్నా అడిగితే బాగుండును అని అనుకునేవారు,తన తండ్రి ఆంతర్యం అవగతమయ్యో,లేక తండ్రి రక్తంలో నుంచి ప్రవహించి తనలోకి ప్రవేశించిన ఆ సాహిత్యభిరుచో ,ఈ రెంటిలో దేని ప్రొద్భలమో తెలియదు కాని,వెంటనే ఆ యేడు రూపాయలకి ఇంకేదన్న పుస్తకం కొనండి నాన్నగారు,సిందుబాద్ యాత్రలో లేక ట్వింకిలో అంటూ తండ్రి వైపు ఆత్రం గా చూసేవాడు. విజయ్ చిన్నతనంలో అతను ఏమి పుస్తకం చదవాలో రామక్రిష్ణ గారె నిర్ణయించి ఇచ్చేవారు ,కాని వయసు పెరుగుతున్న కొద్దీ,మెల్లగా గ్రంధాలయలకి అలవాటు పడ్డడు విజయ్, గుంటూర్లో ఉన్న దాదాపు అన్ని గ్రంధలయాల ద్వారముఖాలు తనని గుర్థుపట్టెస్తాయి,అడపదడప కధలు రాసి పత్రికలకి పంపేవాడు,కవితలు కూడా రాసేవాడు,వక్తత్వ,వ్యాసరచన పోటిలలో పాల్గొనేవాడు,ఎక్కడికి వెళ్ళినా విజయం అతనిదే,సార్ధక నామదెయుడు కదా మరి,ఒక మారు షీల్ద్లు బహుకరిస్తే మరొకమారు పైకమే ఇచ్చేవారు బహుమానం గా,ఇక ఆ పైకం పట్టుకొని "విశాలంద్ర బుక్ హౌసె" కి పరుగుతీసెవాడు,మంచి తెలుగు పుస్తకానికి మేలైన భండాగారం ఈ విశాలంద్ర అంటూ ఉంటాడు ఎప్పుడూ
అలా అలా మొత్తానికి ఎన్నో పుస్తకాలను సంపాదించాడు.వయసుతో పాటు అతని గ్రంధాలయం కూడా దినదినాభివ్రుద్ధి చెందుతూ వచ్చింది,తన ప్రతి పుట్టినరొజుకి వయసు లెక్కించింకపొయిన,బారులు తీరిన తన పుస్తకసంపదను మాత్రం తప్పక లెక్కవేసుకునేవాడు,ఒకొక్క నాడు అయితే ఆ పుస్తకాల అర ముందు అలానే నిల్చొన్ని గంటలతరబడి అలానే వాటి వైపే చుస్తూ ,తను ఎంతటి కోటీస్వరుడినో అనుకొని మురిసిపొయేవాడు,పుస్తకాన్ని తాకి చూసి ఆనందించేవాడు,ఇంకా పట్టలేని పారవస్యం పెల్లుబికినపుడు,తన చెల్లెలు జానకిని కూడా లాకొచ్చి తన పుస్తకాలను చూపిస్తూ,చూడు జానకి ఎంత బాగుందో నా పుస్తకల అర ,అలా ఒకదానిపక్కన ఒకటి బారులు తీరి,ఆకరలు వారి గా,ఎత్తుల వారి గా నిల్చొని ఉంటె ఎంత ముచ్చట గా ఉందో,ఇంతకుమించిన ఆనందం ఎముంటుంది గనుక అంటూ పుస్తకమంటేనే పారిపొయే జానకిని బలవనతంగా కూర్చోబెట్టి తనకు నచ్చిన పుస్తకాలనుంచి తను బాగా మెచ్చిన కొన్ని పదాలను,చిన్నపాటి కధలను చదివి వినిపించెవాడు,చివరకి జానకికి సొష వచ్చి పడిపొవలసిండే కాని తను
మాత్రం ఆపేవాడు కాదు.తను ఎంతగానో అభిమానించే వేదాంతం పద్మనాభసాస్తృయ్ గారి రచనలకు మాత్రం తన గ్రందాలయంలో ప్రతెయేకించి ఒక అరను ఎర్పరిచాడు,అన్నయ్యా ఎండుకు అల ఆ పుస్తకాలు మాత్రం విడిగా పైన పెడతావు,వాటిని కూడా వీటితో కలపవచ్చు కదా అని అడిగే జానకికి,లేదమ్మా ఈ పుస్తకాలు నా అభిమాన రచయిత పద్మనాభం గారు రాసినవి,ఆయిన నా ద్రుష్తిలో దేవుడు,దేవుడి స్థానం ఎప్పుడూ ప్రథ్యేకమే మరి,కొందరు భక్థిరసం బాగా పలికించగలరు,కొందరు శ్రుంగారరసాన్ని అద్భుతంగా చూపించగలరు,మరికొండరు హాస్యాన్ని బహు చక్కగ పండిచగలరు,ఇంకొందరు కవితలను వేరొకరు రాజకీయాలను,ఇలా ఒక్కొక్కరు ఒకొక్క దాని గురించి రాయటంలో ఆరితేరిన వారు,కాని నేను ఇప్పుడు చెప్పిన ఈ రసాలన్నిటిని అవలీలగా అలవోకగా రచించగలిగిన ఒకేఒక్క మనిషి మా పద్మనాభం గారు,ఆయిన నిజం గా సాహితీదైవం నాకు,ఆయిన సాహితీ మేదోసంపత్థి కి ఎంతటి వారలయినా పాదక్రాంతులవ్వవలసిందే అంటూ చెప్పుకోచ్చేవాడు. పద్మనాభం గారికి సంబందించిన సమాచారాన్ని అంథటిని సేకరించి భద్రపరచుకునేవాడు,తన మదిలోను,గదిలోను.ఆయిన ఎక్కడన్నా ఉపన్యిస్థున్నారు అని వింటే చాలు ఇక పరుగుతీసేవాడు,అంతటి వీరాభిమాని,ఆయిన సాహితీప్రస్థానాన్ని అలగే ఎప్పటికీ సాగించాలని అనుకునే సాహిత్య పిపాసి విజయ్. ఇప్పుడు ఇన్నాళ్ళకి తన దేవుడితో ప్రత్యక్షంగా రేండు రోజులు గడిపే అవకాసం వచ్చింది,ఇక ఇంతకు మించి ఏది కావలనుకోలేదు విజయ్,అతని జీవితంలో అదే తనకున్న ఒక్కగానొక్క కోరిక,దేవుడే దిగి వచ్చి వరమిచ్చినట్టుగా ఉండి విజయ్ కు,కాని తండ్రి ఒప్పుకొవాలిగా,వయసు తనలో ఎంతో మార్పును తెచ్చినా,తండ్రి అనుమతి లేకుండా ఏది చెయ్యని అలవాటు మాత్రం అలానే ఉండి పొయింది విజయ్ కు.తన మాట తంద్రి ఏ నాడు కాదు అనరని తనకు తెలిసినా..ఎక్కడో ఏ మూలో చిన్న సందేహం,చట్టుకున వద్దులే రా అన్నరంటే...అమ్మో ఆ ఊహే బరించలేకున్నాడు,ఏం చెయ్యలో ఎలా అడగాలో బొదపడక,అలాగే తంద్రి పక్కన కూర్చొని ఏదో పుస్తకం తిరగేస్థుందిపొయాడు,కొడుకు వాలకం చూస్తే మనసులో ఉన్నది అడిగేలా లేడు అనుకొని రామక్రిష్ణ గారె ముందడుగు వేసి,"అ రా ఎప్పుడు వేళ్తున్నావ్ మరి పద్మనాభం గారి దగ్గరకి అంటూ ప్రశ్నించారు"ఆ ప్రశ్నలో దాగున్న అనుమతిని గ్రహించిన విజయ్ కు ఆనందంతో కళ్ళు విప్పారాయి.వెంటనే లేచి నిల్చున్నవాడయ్ తంద్రితో,రేపే రమ్మన్నారు నాన్న గారు,రేపు పొద్దున నుంచి యెల్లుండి రాత్రి దాకా అంటే పూర్తి గా రెండు రోజులు ఆయిన దగ్గర ఉండే అవకాశం నాన్నగారు అంటూ ఆపకుండా చెప్పుక్కొచ్చడు.విజయ్ లోని పారవశ్యం గమినించి లొలొపలే నవ్వుకున్నారు రామక్రిష్ణ గారు,విజయ్ లో ఆయినకు తన యవ్వనం అగుపించింది,యవ్వనంలో ఉండాగా తను ప్రవర్తించిన తీరే ఇప్పుడు విజయ్ లొనూ.... *********************************************************************************************************
బంజారా హిల్ల్స్,హైదరాబాద్ లోని ప్రముఖులందరూ ఉండే ప్రదేశం అది,అక్కడి ఇళ్ళన్ని చూసుకుంటూ నడుస్తున్నాడు విజయ్,పద్మనాభం గారి ఇంటి ముందు ఆగాడు,లొపలకి అడుగుపెట్టడానికి ఎక్కడో చిన్న సందేహం,అలొచిస్తూ ఉండగా,ఎవరూ కావలి సాబ్ అంటూ పిలిచాడు గుర్ఖా,అతనికి వివరాలు చెప్పాడు విజయ్,లోపలకి పంపారు విజయ్ ని,లొపలకి అడుగిడి,ఇంటి లోపలకి నడిచాడు,బైట పెద్ద లాన్,మంచి ఆహ్లదకరమైన వాతావరణం,ఆ ఆహ్లాదం చుట్టురా ఉన్న ప్రకృతిదో లేక తనను చుట్టిన భావోద్వేగానిదో అర్దం కాలేదు విజయ్ కు.ముండు గది లొనే కుర్చిలో కూర్చోని కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నారు పద్మనాభం గారు.విజయ్ నమస్కారం అండి అన్నాడు,వేంటనే పేపర్లో నుంచి తల బైటకు పెట్టారు పద్మనాభం గారు,విజయ్ ని చూస్తూనే "ఆ రావయ్య రా,విజయ్ శేఖర్,"సాహితీ మేరుపర్వతం పద్మనాభం" అంటూ నన్ను పత్రికల్లో ఎడ పెడ పొగిడేసే పిల్లడివేనా నువ్వు" అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీని చూపించారు కుర్చొమనట్టు గా,పద్మనాభం గారి ముండు కూర్చునే అర్హత తనకి ఉందో లెదో అని సందేహిస్తు,"పర్లేదు లేండి అంటూ ఆయిన అహ్వనాన్ని సున్నితం గా తిరస్కరించాడు","ఎంటయ్యా రెండు రోజులు ఇలా నా ముందు నిల్చోనే ఉంటావా కూర్చో కుర్చొ అంటూ కుర్చి విజయ్ వైపు కు లాగారు" ఇక తప్పక బిడియపడుతూనే కుర్చున్నాడు విజయ్."ఆ విజయ్ శేఖర్,నా దినచర్య ను దగ్గరగా చూడాలని ఉండి అని విన్నవించుకున్నవట గా స్పూర్తి పత్రికి ఎడిటర్ గారి ముందు,కావున నీ కొరిక ప్రకారమే,ఇప్పుడు మన కార్యక్రమం ఎంటయ్యా అంటే,నాకు కొంతమంది తో మీటింగ్స్ ఉన్నాయి ఇవాళ,వాటన్నిటికి నిన్ను తీసుకువేళ్తాను,నువ్వు ఈ రెండు రోజులు నాతొనే ఉంటావు,సరే నా మరి" అని అడిగారు.అలాగే అండి తప్పకుండా వెళ్డాం అన్నడు విజయ్.సరే మరి నువ్వు కూర్చో నేను పదినిమిషళ్ళో వస్తాను బయలుదేరుదం అని లోపలికి వేళ్ళరు,చుట్టురా కలియచూసాడు విజయ్, ఎదురుగా షెల్ఫ్లో చొటు సరిపొకపొఇనా ఒకడానిపక్కన ఒకటి ఇరుక్కొని మరీ,పద్మనభం గారి సాహితీ మేదోసంపత్తి కి మేము నిదర్శనం అని చెప్తునట్టు గా ఉన్నాయి,ఆఇనకు వివిధ సందర్బాలలో వచ్చిన షైల్ద్లు,అవార్డ్లు." లేచి షెల్ఫ్ వైపు నడిచాడు విజయ్,వాటినే చూస్తూ ప్రతి షైల్ద్ మీద రాసి ఉన్న బిరుదులని చదువుతున్నాడు,ఇంతలోనే లొపలనుంచి పెద్ద సబ్దం,ఎవరో ఎవర్నో కొడుతున్న దాఖల,వెంటనే పద్మనాభం గారి గొంతు వినపడింది,"ఎన్ని సార్లు చెప్పాలే నీకు,నీకు మాటలతో చేప్తే సరిపోదే,దేబ్బ పడాల్సిందే,ఎన్ని సార్లు చెప్పను బట్టలు తీయగానే బీర్వా తలుపు వేయ్యమని,నీకు ఇలా చేప్తే కాదే ఉండు అంటూ దేనితోనో ఎవరినొ బాగ కొడుతున్న సబ్దం,హతాసుదైపొయాడు విజయ్,ఈ సారి నుంచి వేస్తాను అండి ఈ ఒక్కసారికి వదిలేయండి అంటూ వినిపించింది ఒక ఆడ గొంతుక,ఆ ఆర్తనదాలు పదినిమిషాల పాతు అలానే సాగాయి. నిల్చున్నవాడు నిల్చునట్టే ఉండిపొయాడు విజయ్,ఏం జరిగిందో,అసలిప్పుడు జరిగింధి నిజమో లేక కలయో అర్ధంకకున్నధి,నేల వైపు చూస్తూ ముడిపడిన బ్రుకుటితో ఆలొచిస్తూ ఉండిపొయాడు విజయ్,"ఎమయ్యా బైల్దేరుదామ" అంటున్న పద్మనాభం గారి మాటలు విని ఈ లొకం లోకి వచ్చినవాడయ్,సరె నండి అంటూ ఆయినను అనుసరించాడు. కార్లో పద్మనాభం గారి పక్కన కుర్చున్నాడు,కార్ బయలుదేరింది,కార్తో పాటు విజయ్ అలొచనాప్రయానం కూడా.పద్మనాభం గారు భార్యను కొట్టారు అన్న విషయం విజయ్ జీర్నించుకోలేకున్నాడు,స్త్రీ స్వాతంత్రం పేర ఆయిన రాసిన "ఓ స్త్రీ మేలుకో","సంపుర్న స్త్రీత్వం" లాంటి పుస్తకల్లోని మాటలు గ్ణప్తికి వచ్చాయి, "ఓ స్త్రీ దేని కోసం నీ వెతుకులాట, స్వేచ్చ కొసమా ప్రేమ కొసమా, మాట కొసమా,మనిషి కోసమా, ఇచ్చే దానవు నీవు, చేప్పే దానవు నీవు, నేర్పే దానవు నీవు,చేసే దానవు నీవు, ఆ నీవు, అల్పురాలివా????? ఆ అల్పత్వం నీదా??? లేక నిన్ను అబల అనే మాదా???" ఇది రాసింది ఈ మనిషేనా అని ఆస్చర్యచకితుడైపొయాడు విజయ్.కార్ ఆగింది,ఒక పేద్ద భవంతి ముండు,అది ప్రముఖ నిర్మాత దర్శకుడు అయిన జంపర్ల నరసిమ్హం గారి స్టుడిఓ,దిగి మెల్లగా పద్మనాభం గార్ని అనుసరించాడు విజయ్.లోపలకి వెళ్ళగానే నరసిమ్హం గారు పద్మనాభం గార్ని ఎదురు వచ్చి వాటేసుకొని మరీ లొపలకి తోడ్కొని పొయారు,ఎదో సినిమా కి పద్మనాభం గారు కధ రాస్తునట్టు ఉన్నారు,దాని గురించి ఎవో చర్చలు సాగయి కాసేపు,అన్నిటిని వింటూ పక్కనే కూర్చున్నాడు విజయ్,కధ చాలా బాగుంది ఎప్పటిలాగే నచ్చింది,కాని ఎక్కడో ఎదో వెలితి,ఈ కధ బాగుంది అని మనస్పూర్తి గా అంగీకరించలేకపొతున్నాడు తను. వాళ్ళ చర్చలు ముగిసాయి అప్పటికే సమయం రెండు కావస్తొంది,భొజనానికి లేచారు అందరు,షద్రసోపెతమయిన భొజనం ముగించి,మళ్ళీ చర్చలో పడ్డారు,ఈ సారి చర్చ కధ గురించి కాదు,ఆ సినిమాలో పని చేయబొతున్న కొత్త హీరోఇనె గురించి,ఆ అమ్మైకి ఈ డయ్రచ్టొర్ గారే మొదటి సారిగా అవకాసం ఇస్తున్నారు,"నరసిమ్హం గారు,మరి మీరే చూడాలి,మమ్మల్ని కూడా ఒక కంట కనిపెట్టాలి,ఎంత సేపు చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అనుకుంటే ఎలా అండి,మేము కూడ యవ్వనం లొనే ఉన్నామండొయ్"అంటున్న పద్మనాభం గారి మాటలు విని ఆస్చేర్యపడిపొయాడు ,పద్మనాభం గారి మాటల్లొని ఆంతర్యం అవగతమయ్యింది విజయ్ కు,అలోచనలో పడ్డాడు,పద్మనాభం గారి వయసు సుమారు అరవయ్,ఆ హీరోఇన్ వయసు,వీళ్ళ మాటలప్రకారం చూస్తే ఇరవయ్యి, హు!!!!ఇది నిజమా లేక కలా,ఎమీ అర్దం కావట్లెదు విజయ్ కు,"ఏమయ్య బయలుదేరుదామా మరి అంటున్న పద్మనాభం గారి మాటలు వినపడి ఈ లొకం లొకి వచ్చాడు విజయ్."ఇప్పుడు మన ఆఫీచె కి వెల్దాం పద,అక్కడ ఒక కొత్త సినిమా కి కధ తయారు చేసే ప్రయత్నం లో ఉన్నామయ్య అంటూ చెప్పుకొచ్చారు పద్మనాభం గారు. కార్ బయలుదేరింది,పద్మనభం గారి ఆఫిచె ముందు ఆగింది,ఇద్దరు లోపలికి నడిచారు,పద్మనాభం గారికి ఎదురు వస్తూ "సార్ మీరు చెప్పినట్టు గా స్చ్రిప్ట్ రేడీ చేసాము సార్,ఇక మీరొచ్చి చుడటమే తరువాయి" అంటూ చెప్పసాగాడు ఒక వయిక్తి. సెకరేట్ర్య్ నువ్వు ఘటికుడివయ్యా,నిన్న చెప్పాను ఇవాళ్టికల్లా పని పూర్తి చేసేసావు అంటూ అతని బుజం మీద చెయ్యి వేస్తూ అభినందించారు పద్మనాభం గారు.రండి సార్ రండి కూర్చొండి,ఇదిగో నండి అంటూ పద్మనాభం గారి చేతిలో సుమారు పది కాగితాలను పేట్టాడు పద్మనాభం గారి సెకరేత్ర్య్.ఆ కాగితాలను కాసేపు తిరిగేసారు పద్మనాభం గారు,కాగితాలను పక్కన పెడుతూ,బావుండయ్యా, మొత్తానికి ఈ ఇంగ్లీష్ వాళ్ళు అసాద్యుల్లయ్యో,స్రుజనాత్మకత కాస్త ఎక్కువే వేధవలకి అంటూ సిగరేట్టు వేలిగించారు,అసలేం జరుగుతోందో భొదపడట్లెదు విజయ్ కు.సరేనయ్యా మరి రెండు రొజుల్లో స్చ్రిప్ట్ రేడ్య్ ఐపొతుందని ఆ డయ్రెచ్టొర్ కి కబురు పంపు,ఇదిగో ఆ చేత్తోనే తయ్లం కుడా పంపమన్నని చెప్పు,ఎంటి అర్దం అయ్యిండా అంటూ తన సెచ్రతర్య్ వైపు చుస్తూ బైటకు నడిచాడు,ఆఇననే అనుసరిస్తూ వెనకాల విజయ్ కుడా. ఇంటి దారి పట్టారు ఇక,ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అగింది కార్,ఒక మూల కూర్చొని అడ్డుకుంటూ కనపడ్డాడు ఒక నిర్బాగ్యుడు.అతనిని చూపిస్తూ పద్మనాభం గారు విజయ్ తో "ఆ అడుక్కునే అబ్బాఇ ని పిలవవయ్యా,వాడికి ఈ రెండు రూపాయలు ఇస్తే పుణ్యం పురుషార్దం రేండునూ" అన్నారు.విజయ్ పిలిచాడు,పద్మనాభం గారి రెండు రూపాయలు ఇచ్చి పంపారు.ఇంతలోనే అయిన సెల్ ఫోనె ఆపకుండా మోగటం మొదలుపెట్టింది,దానిని చేతిలోకి తీసుకొని మాట్లాడటం మొదలుపెట్టరు,"ఆ వాడి స్రర్దం,వాడికి అంత సఋఅలం గా రాయటమే వస్థే ఇంక కావలసింది ఎమి ఉండిలే,అయ్నా వాడు ఆ రొటరీ క్లబ్ వాళ్ళతో కుమ్ముక్కయాడు అండుకే ఈ ప్రైజ్ లేకపోతే "సాహితీ సారంగధర" బిరుదు అందుకొవాటానికి మన తెలుగు సాహితీ లోకంలో ఉద్దండ పిండాలు లేరుటండీ, అయినా వాడి కర్మాన వాడు పొతాడు,మనకు అభిమాన సంపద జాస్తిగా ఉంది,వాడి దగ్గర ఎమి ఉంది ఈ బొడి బిరుదులు తప్ప,ఆ ఆ చదివాను లేండి,"శరత్ ౠతువు" నవలే గా,విన్నాను లెండి ఆ నవలకే వచ్చింది ఈ బిరుదు అని,మనలో మన మాట నేను చదివాను అండి ఆ పుస్తకం,అది జేంస్ బయ్యేర్ రాసిన "సీ మీ యాస్ ఇ యాం" నవల్ లో నుంచి పూర్తిగా కాపీ లెండి,మీరు ఇవాళ ఇంటికి రండి మనం తీరికగా మాట్లాడుకొవచ్చు,సరే సరే,అలాగే,ఎదురు చూస్తు ఉంటా,ఉంటా మరి" అంటూ ఫోన్ పెట్టేసారు, ఎండుకో విజయ్ కు చాలా కష్తం గా,ఇబ్బంది గా ఉంది,ఇక ఉండబట్టలేక పద్మనాభం గారి వంక చూస్తూ "కొంచం అర్గేంట్ పని గుర్తుకువచ్చింది,నన్ను ఇక్కడ దింపెయండి,రేపు వచ్చి కలుస్తాను" అన్నాడు.విజయ్ మాటలకు ఆశ్చెర్య పడుతూ,"సరే నీ ఇష్టం, డ్రవర్ కార్ ఆపు,అంటూ ఒక పక్క గా కార్ ఆపించారు" విజయ్ దిగి,పద్మనాభం గారి దగ్గర శెలవు తీసుకున్నాడు. "మేడిపండు చూడ మేలిమయ్యి ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు...." అనే వేమనశతకం లోని పద్యం మదిలో మెదిలింది.....**********************************************************************************************************"ఎమండీ వాడికి ఎమయిండో కొంచం చుడరాదు,ఆ రచయిత ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇదే వాలకం.ఉలకడు పలకడు,భొజనం చెయ్యరా అని బలవంతం చేస్తే,పళ్ళెం ముందు కూర్చొని ఎదో కెలికి వెళ్ళిపొతున్నాడు,ఎప్పుడూ మొహం వేలాడేసుకొని తిరుగుతున్నాడు,వెళ్ళి అడగండి ఎమైందో" అంటూ రామక్రిష్ణ గారి చెవులో ఇల్లు కట్టుకొని పొరుతోంది విజయ్ తల్లి సుమతి. రెండు రొజులనుంచి కొడుకు అంతర్మదనం ఒక కంట గమనిస్తూనే ఉన్నరు రామక్రిష్ణ గారు,ఎం జరిగిందో ఉహించకలిగిన అనుభవం ఆయినది.ఇక లాభం లేదు అనుకొని లేచి కొడుకు దగ్గరకు వెళ్ళారు,తన గదిలో పడుకొని ఉన్నాడు,అలా దీనం గా పడుకొని సున్యం లొకి చూస్తున్న కొడుకుని చూస్తే మనసు చివుక్కు మన్నది రామక్రిష్ణ గారికి."అసుర సంద్య వేళ ఆ నిద్ర ఎమిటి రా" అంటున్న తండ్రి గొంతు విని ఉలిక్కి పడి లేచాడు విజయ్."ఎం లేదు నాన్నగారు కాస్త వంత్లో బాలేదు,అంతె" అంటూ లేచి నిల్చున్నాడు. అతగాడి గొంతు లోని మార్పు,మనసు లోని మధనము,రెండు గమనించారు,కొత్తగా ఎమీ లేదు,ఆయిన ముందుగా ఊహించినదే. "రా అలా బైటకు వెళ్ళి వద్దాం"అంటూ బైటకు నడిచారు. అయిష్టంగానే తండ్రి ని అనుసరించాడు విజయ్.మెల్లగా వీధుల వెంబడి నదుస్తున్నారు ఇరువురు."అన్ని సందేహాలను కడుపు లో పెట్టుకుంటే కడుపుకి అన్నం ఎక్కే ఖాళీ ఉండదు,అన్నం ఎక్కకపోతే,మీ అమ్మ ఎడుపు కు అంతం ఉండదు,అంతం లేని ఆ ఎడుపు వల్ల,నాకు తలనొప్పి రాకుండా ఉండే ఆస్కారమే లేదు,అంచేత త్వరగా నీ సండేహ నివ్రుత్తి ఘట్టం మొదలుపెడదామా" అంటున్న తండ్రి వంక చూస్తూ మనసులోనే ఆస్చేర్యపోయాడు విజయ్.తన కంటే బాగా తన గురించి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి తన తండ్రి కాబోలు అనుకుంటూ... "ఎం చెప్పమంటారు నాన్న గారు,తన రచనల్లో స్త్రీ స్వాతంత్రం స్త్రీ స్వేచ్చ,సాంఘిక భందాల్లో స్త్రీ,అంటూ స్త్రీల మీద ఎంతో సానుబూతిని కనబరిచిన రచయిత,ఇంట్లో భార్య మీద దాష్టికం చేలాయిస్తాడు,రావణాసురుడి లో ఉండే రాక్షసత్వన్ని తన చేతల్లో చుపించాడు,రావనుడు సీత ను చేరపడితే,ఇతను సినీతార ను.మానవ సేవే మాధవ సేవ అని రాస్తూ,తన పాపాలను కడిగే సాదనం గా నిర్భాగ్యులను చూస్తాడు,రేండు రూపయల్లో పున్యం పురుషర్దం రెండూ వచ్చేయాలనే తపన,తయ్లం పేర కొట్లకి కొట్లు కొంపలో మూలగాలనే దురాశ.ఒకరు ఎదిగితే ఒర్వలేడు,సొంతగా ఎదగలేడు,ఎవరో రాసిన వాటిని కాపీ కొట్టి,అద్బుతమైన పదజాలం వాడి ఆద్యంతం ఆనందడోలికల్లో తేలియాడించి,తన రచనల రుచి మరిగిన నాలాంటి పాఠక అర్భకులని,వారి మనొభావలని కించపరుస్థున్నాడు,ఇది క్లుప్తం గా నా అభిమాన రచయిత,ఆయిన మీద నా కొత్త రివిఎవ్" అంటూ ఆవేసం గా చెప్పాడు విజయ్.వింటున్న మీకే ఇలాంటి రచయతలు కుడా ఉంటారా అని ఆశ్చెర్యం కలిగి ఉండచ్చు,ఇక అనుభవం లొకి వచ్చిన నాకు అంతర్మధనం కాక ఇంకేమిటి నాన్నగారు అంటున్న కొడుకు ని చుస్తూ రామక్రిష్ణ గారు..."విజయ్,ఒక రచన అనేది ఎన్ని రకాలుగా జనిస్తుందో చెప్పగలవా??" అంటూ సూటిగా ప్రశ్నించారు"లేదు నాన్న గారు,చెప్పండి" అన్నాడు విజయ్."ఒక రచయత తన మనసులో ఉన్నది ఉనట్టు గా ఒక కధ గారస్తాడు....తన చుట్టూ ఉన్న ప్రపంచన్ని,అందులో ఉన్న విభిన్న మనస్తత్వలని గమనిస్తూ,అలొచిస్తూ,ఆ అలొచనల్లో నుంచి వచ్చిన ఒక ఊహతో ఒక కధ రాస్తాడు....ఒక వ్యక్తి,లేక ఒక వ్యవస్త తన మనసకు ఇలా ఉండాలి అని అనిపించినప్పుడు,అది నిజ జీవితంలో తనకు తారస పడక, క్షోబ చెంది తన కలానికి పనిచెప్పినప్పుడు పుడుతుంది మరొక కధ....సంఘజీవి అయిన తను పరపతికి తలవొగ్గి,తనలొనే అనిచివేసుకున్న ఎన్నో కొరికలకి రూపం ఇస్తూ రాసే కధలు ఇంకో రకం,వీటినే పర్వర్టేడ్ రచనలు అంటాం మనం....తనలోని మలినాన్ని కడిగెస్తూ,మంచితనాన్ని చుపిస్తూ పుట్టిస్తాడు మరికొన్ని కధలను...."ఇన్ని రకాలు గా ఒక కధ జనిస్తుంది...రచనను బట్టి రచయతను అంచనా వేయటం చాలా తప్పు. కాపీ కొట్టాడు,నా మనొభావలతో అడుకుంటున్నాడు అన్నావు,నిన్ను తన రచనలు చదవమన్నడే కాని తనను అభిమానించమనలేదు గా,అంటే నీ ఇష్ట ప్రకరాం నువ్వు ఎంచుకున్నావు అతగాడిని...అతను రాసిన ఎదో ఒక పుస్తకం నీకు బాగా నచ్చి ఉంటుంది,ఇక మెల్లగా ఇష్టపడావు,ఆ ఇష్టం ఆరధన గా,ఆపై పిచ్చి గారూపంతరం చెంది,అతగాడిని కలవటమే నీ జీవితం లో ఉన్న ఒకేఒక్క లక్ష్యం గా మారింది. ఈ ప్రక్రియ అంతటి లోను ఎక్కడన్న ఎప్పుడన్నా ఒక్కసారి ఆగి అలొచించావా?????ఇతను రాస్తున్నది ఎంత వరకు సమంజసం అని.....నువ్వే కాదు చాలా మంది తమకు నచ్చిన రచయితో లేక కవిఓ..ఎవరైనా సరే....పిల్లి పరిగెత్తింది అని రాసినా...ఆహ ఒహొ అద్బుతం అమొఘం...ఒక జంతువు తన అడుగుల వేగం హెచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో...దాని హవభావాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు రాసారు ఫలానా రచయిత..రచనలంటే వారివి..రచయిత అంటె వారు... సాహితీ మేదొసంపత్తి అంటే ఆయినదే...ఆయిన మనిషి కాదు దేవుడు..అంటూ... లేని గొప్పదనాన్ని ఆపదించి..మేరుపర్వతం అంతటి వ్యక్తిత్వన్ని అంటించి చుస్తారు.... ఆ తప్పు రచయతలది కాదు..చుసే పాఠకులది...అద్భుతమయిన రచన జాలువారిన కలము లొ సిరా ని కూడా అమ్రుతం లా చుడటంలో తప్పు పాఠకుడిది కాని రచయతది ఎంత మాత్రము కాదు.....కాపీ చేసాడు నిజమే...కాపీ చేసాడు చేసాడు అంటూ అదే పనిగా దాని గురించే మాట్లాడకపొతే...కాపీ చేసిన బానే రాసాడు అనుకొని వదిలేయ్..లేకపొతే వేధవ కాపీ కొట్టాడు అనుకొని తీసి పడేయ్....దాని గురించి అంత వాదులాట..అంత కాలయాపన ఎండుకు రా....."ఒక రచయిత లోని, లేక ఒక కవి లోని,..సరిగ్గా చెప్పాలంటే ఒక కలాకారుడి లోని "విద్వత్తు" ని అభిమానించు,అభిమానానికి ప్రేమ కి నడుమ ఒక సన్నటి పొర ఉంది..ఆ పొరను గుర్తించకలిగే నేర్పుని అలవరుచుకో...ఒక మనిషి లొని కొన్ని గుణగణాలు నచ్చటం అభిమానానికి కారణం...ఎది నచ్చినా ఎది నచ్చకున్నా కొన్ని సార్లు ఎదో ఒక కారణం వల్ల ..చాలా సార్లు అ కారణం లేకపొయినా జనించేది ప్రేమ....ఒక మనిషిలోని విద్వత్తుని ప్రేమిస్తు ఆ మనిషినే ప్రెమిస్థున్నా అని మనకు మనమే ముసుగు వేసుకోవటం ఎంత వరకు సమంజసం అలొచించు ....నువ్వు ఇష్టపడ్డావు కదా అని నీ డ్రీం హీరో లా ఉంటాడు అని ప్రతి కలాకారుడి గురించి అంచనా వేయకు..." తంద్రి మాటలు విన్న విజయ్ కు ఒక్కసారిగా ఆలొచనా ప్రవాహం కొత్త మలుపు తిరిగినట్టు గా అనిపించింది.ఇలా కుడా అలొచించచ్చు కదా అనుకున్నాడు లొలొపల.....తంద్రి వంక చూస్తూ "రెండు రొజుల నుంచి ఇదే అలొచిస్తూ మదనపడుతున్నా అని మీకు తైల్సీ ఎందుకు ఊరుకున్నారు నాన్నగారు,ఇవే మాటలు రెండు రోజుల ముండే చెప్పి ఉండచ్చు కదా అని ప్రశ్నించాడు" అమాయకంగా ప్రశ్నిస్తున్న తన కొడుకుని మురిపెంగా చుస్తూ "తెలివగలవాడిలో ఉన్నది తెలివితక్కువవాడికి లేనిది ఎమిటో చెప్పు??" అన్నారు...వెంటనే తెలివి అనేసాడు విజయ్... కళ్ళల్లో చెప్పెసాగా నేను అనే ఆనందం తొనికిసిలాదుతుండగా.... ఎంత యెదిగినా...ఇంకా చిన్నగానే కనపదుతున్న తన కొడుకుని ఆప్యాయం గా దగ్గరకు తీసుకుని,భుజం చుట్టు చేతులు వేసి..."తెలివిగలవాడికి తెలివితక్కువవడికి తెడా "అలొచనా", ఒక విషయం జరిగినప్పుడు,ఒక అనుభవం ఎదురయినప్పుడు,తెలివిగలవాడు అలొచిస్తాడు,ఎందుకిలా జరిగింది,దీనికి కారణం ఎంటి,దీనికి పరిష్కారం ఎంటి,అసలు ఉన్న పరిష్కార మార్గలెన్ని,అంటూ విభిన్న కొణల్లో ఆలొచించి,ఆ అనుభవం లొనుంచి పాఠం నేర్చుకుంటాడు,తద్వారా తన జ్ణానసంపదనను పెంచుకుంటు పొతాడు. మరి తెలివిలేనివాడు,ఆ అలొచన లొపించటం వల్లే..అనుభ్వాలను గత జీవితపు చేదు గుర్తులుగా మిగులుచుకొని,అసమర్ధుడి గా,చెతకాని వాఇ గా మిగిలిపొతాడు, అంతే కాని పుట్టుకతోనే తెలివి రాదు,వచ్చేది గ్రహించుకునే శక్తి మాత్రమే,అది కుడా కొందరికి కాస్త ఎక్కువ గా,కొందరికి కాస్త తక్కువ గా,అలొచిస్తూ ఉంటే ఆ గ్రహనించుకునే శక్తి దాంతట అదే పెరుగుతుంది,నువ్వు తెలివిగలవాడివి అవ్వలనే నా కొరిక మరి" అన్నారు. నాన్న గారు అన్నం తినలి పదండి ఇంటికి వెల్దాం,కడుపు ఖాలీ అయిపొయింది అంటూ తండ్రి చేయి పట్టుకొని ఇంటిదారి పట్టడు విజయ్. తండ్రి చేతి స్పర్సలో,ఆ తెయ్యదనాన్ని,ఆ కమ్మదనాన్ని కడుపారా ఆరగిస్తూ.........