Thursday, October 2, 2008

సమత

టెంత్ క్లాస్ అంటేనే బోల్డన్ని పుస్తకాలు.... ఆరు పరీక్షల నుంచి పదకండు పరీక్షలకి పదోన్నతి....
ట్యుషన్స్...స్పెషల్ క్లాసులు...స్టడీ హవర్స్.....డొక్కు సైకిల్...ఎప్పుడూ చూసినా పంచర్లు
సాయంత్రం అయితే చాలు..ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అమ్మ చేత భానుమతి పాటలు పాడించుకోవాలా అని ఎదురు చుస్తూ ఉండే దాన్ని.....
ఒక రోజు అలానే హడావిడి గా ..స్టడీ హవర్స్ అయిపొగానే స్కూల్ నుంచి నా డొక్కు సైకిల్ మీద..పక్కన నా బక్క స్నేహితురాలితో ఇంటికి బయలుదేరా...
తెలుగు మాస్టారు ఎలా తన తెల్ల జుట్టు కి నల్ల రంగు వేసుకొని inspection రోజున స్కూల్ కి వచ్చారో చర్చించుకుంటూ...
ఆయన విగ్గు లాంటి జుట్టు మీద ....... బొర్లించిన బొచ్చె లాంటి బొజ్జ మీద జోకులు వేసుకుంటూ అలా అలా మా బక్కది చందు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఆగాము...
అది వెంటనే...ఒసేయ్ నాతో రా ..మా ఫ్రెండ్ సమత ని పరిచయం చేస్తా...వాళ్ళ ఇల్లు అక్కడే..మా ఇంటికి కొంచం ముందరే అంటూ దిగిన సైకిల్ మళ్ళీ ఎక్కింది...
"సరే పోనిలే..ఇవాళ కాస్త ఆలశ్యం అవుతుంది ఇంటికి..అంతే కదా... చిత్రలహరి ఎలాగూ ఈ పాటికి అయిపొయే ఉంటుంది..ఇంటికి వెళ్ళాక అక్క ని అడిగితే చెప్తుందిలే ..ఏం పాటలు వేసాడో..." అనుకుంటూ నేను కూడా చందు వెనకాలే వెళ్ళాను....
ఒక ఇంటి ముందుకి వెళ్ళగానే....వీధిలో అమ్మ పక్కన కూర్చోని పెద్ద ముగ్గు వేస్తూ ఒక పిల్ల కనపడింది...
ఎంటే నువ్వు ముగ్గేస్తున్నావా అంటూ మా చందు సైకిల్ దిగి ఆ అమ్మాయి పక్కకి వెళ్ళి...ముగ్గు లోకి ముక్కు పెట్టి మరీ చూస్తూ...ముఖ్యమైన నన్ను మర్చిపొయింది.....
"ఆ సమత అనే పిల్లేమో...ముగ్గులోనుంచి తల పైకి ఎత్తకుండా....ఆ పువ్వు కి ఏ రంగు వేద్దామే...దీనికి ఎం వేద్దాం అంటూ చందుతో మాట్లాడేస్తోంది....
గొంతు వినగానే.... చాల తీయగా ఉంది అనిపించింది....



















అప్పటి దాక ఎటువంటి ఉత్సుకతా లేకుండా నిల్చున్న నాకు...అప్పటికప్పుడు ఆ అమ్మాయి మొహం చూసెయ్యలి అనిపించింది
పాత సినిమల్లో కాంచనమాల...షర్మిలా టాగూర్...హెమమాలిని టైప్ లో ..ముంగురులు సవరించుకుంటూ తల పైకి ఎత్తింది ..... హీరోయిన్ ఎంట్రీ అక్కడే జరిగింది
ఇంతలో చందు..అదిగోవే..అదే సృజన..నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది...
హాయి అంటూ పళ్ళు అన్నీ బైటకి పెట్టేసింది పిల్ల..... తీరయన పలువరస.... అప్పుడే విచ్చిన ఏర్రటి ముద్ద మందారం రేకులు లాంటి పెదాలు.....
ఎక్కడో చదివాను నేను.. "అమ్మాయి నవ్వితే ..ముత్యాల దండ తెగినట్టు ఉండాలి అట"... చదివినప్పుడే అనుకున్నాను...ముత్యాల దండ తెగటం ఏంటి..... ఆ తర్వాత మళ్ళీ గుచ్చుకోలేక ఒక చావు కాకపోతేను...అని
కాని ఈ పిల్ల ఆ ముగ్గు ముందు కూర్చోని అలా అలా విసిరిన ఆ నవ్వు...నిజంగానే ముత్యాల దండ తెగింది
ఆ రాలి పడిన ముత్యాలన్నీ ఏరుకుంటూ.. హేల్లో అన్నాను ఆ అమ్మాయి వైపు చూస్తూ.....

లోపలకి రా అన్నది...
వద్దులే మళ్ళీ వస్తాను అని చెప్పి సైకిల్ ఎక్కి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపొయా......
*******************************************************************************


ఒక నెల రోజుల తరువాత...సైన్స్ ఎక్ష్హిబిటిఒన్ ఏదో స్కూల్ లో అన్నారు....
అందరం పొలూఒ మని పొయం.....
అసలు మాలాంటి ఇంగ్లీష్ సార్ భాదితులకోసమే ఇలాంటి ఎక్ష్హిబితిఒన్స్ పెడుతూ ఉంటారు....
సైన్స్ పేరు చెప్పి ఇంగ్లీష్ క్లస్స్ ఎగ్గోట్టే అమ్రుత అవకాసం ఎంత మందికి దొరుకుతుంది....
ఎక్ష్హిబితిఒన్ లో ఎమన్నా అల్పెన్లిబె చాక్లట్స్ దొరుకుతాయేమో చుస్తుండగా.... ఒక స్టాల్ ముందు నిల్చోని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఎదేదో చెప్పేస్తూ కనపడింది...
మళ్ళీ ఆ పిల్లే....
ముగ్గు... ముత్యాలు.... ఆ పిల్లే
పేరు గుర్తుకురాలేదు సమయానికి
బుర్ర గోక్కుంటూ ఆ అమ్మాయి వైపే చూసి నవ్వను....
"అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కుడా నాకు సైట్ కొడుతున్నారా ..చీ చీ" .. ఇది ఆ అమ్మాయి చూపు సారాంసం.....
సురభి ప్రొగ్రాంలో సిద్ధార్థ కాక్ లా అవసరం లేకపొయినా నవ్వానా అని ఒక సందేహం కూడా వచ్చింది
వెనక్కు తిర్గి చూస్తే ఇద్దరు సత్రకాయ్ వెధవలు నిల్చోని ఉన్నారు....
"అబ్బా ఎముంటుంది రా ఆ అమ్మాయి.." అంటూ ఇద్దరూ ముత్యాల పిల్ల వఈపే చూస్తూ ఉన్నారు.....
బాలకుటీర్ స్కూల్ అని బాడ్జ్ పెట్టుకోని ఉన్నారు...
బాలకుటీర్ అంటే.... వాళ్ళ హెడ్మిస్ట్రెస్స్ "మొక్కలు --వాటి పెంపకం" అని ఎవరు చదవకపొయినా ఒక శీర్షిక రాస్తూ ఉంటుంది ఈనాడు పేపర్లో...ఆవిడ స్కూలేనా అని ఆలొచిస్తూ...అదే ప్రశ్న ఆ సొళ్ళు కార్చుకుంటున్న చపాతి మొహాలని అడిగాను...

ఆ అమ్మాయి కి అడ్డం గా నిల్చున్నానో...లేక నల్లగా ఉన్నా అనో....ఏ విషయానికి భాధ పడ్డారో తెలియదు కాని
ఇద్దరు వెంటనే నా రెక్క పుచ్చుకోని పక్కనే ఉన్న వల్ల హేడ్మిస్ట్రెస్స్ ముందు నిల్చోబెట్టారు....
ఆవిడ ..ఏన్నళ్ళ నుంచో తిండ్ది లేని పులి కి చిక్కిన జింక ని చూసినట్టు..నన్ను చూసింది....
నీకు మొక్కలు పెంచటం గురించి చెప్తా రా అంటూ పక్కనే ఉన్న గడ్డిలోకి తీసుకెళ్ళిపోయింది....
శాంతి స్వరూప్ నవ్వు ని మొహం మీద పెట్టేసుకోని.... ఆలిబాబా అరడజన్ దొంగల్లో ఆరో దొంగలా నేను.... ఆలిబాబా లా ఆవిడా.......
**************************************************************************

టెంత్ క్లాస్ సెలవలు......
ఆగస్ట్ పదిహేనున ప్రదాన మంత్రి పావురాన్ని గాలిలోకి వదిలినట్టు.. మా నాన్న నన్ను రోడ్ మీదకు వదిలేసిన సెలవలు అవి.....
ఆడుకుందాం అని రోడ్ మీదకు వెళ్తే కాని తెలియలేదు ...నాకు సభ్య సమాజం నియమాల ప్రకారం ఆడుకునే వయసు అయిపొయింది అని
ఎక్కడ చూసినా చెడ్డీలు వేసుకొని క్రికెట్ ఆడుకుంటున్న అబ్బాయిలు....
లంగాలేసుకోని తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ అమ్మాయిలు.....
ఆడదాం అని వెళ్తే.. అక్కా నువ్వు మళ్ళీ రా అక్కా అని నన్ను తోసేసినంత పని చేసేసారు....
నటశేఖర క్రిస్ణ డాన్స్ చుసినప్పుడు కూడా వేయని అంత భాధ ......
అదే బాధ ని పంచుకుందాం అని చందు వాళ్ళ ఇంటికి వెళ్ళా....
నా బాధ అంతా విని...దాని చీమిడి కర్చీఫ్ తో నా కల్లు తుడిచి... ఉండవే జూస్ తెస్తా అని లోపలకి వెళ్ళి...మంచినీళ్ళతో బైటకు వచ్చింది....
పక్కనే పిల్లి లా సొఫాలో ఒక మూల గా కుర్చోని ఉన్న రంగడు...అదే ఈ బక్క చందు కి ఉన్న తిక్క అన్న....పక పక నవ్వాడు......
మయసభలో ధుర్యోధనుడిని చూసి నవ్విన ద్రౌపదిలా..... నవ్వుతూనే ఉన్నాడు....
ముత్యాల దండ తెగినట్టు కాదు..... లారీలో నుంచి గులక రాళ్ళ లోడ్ దింపుతున్న శబ్దం....
తెల్ల కుందేలు లాంటి వీడికి రాఖీ కట్టిన పాపానికి ఇంత వ్యదా నాకు?
ఇంతకన్న ఆ పిల్లల చేత తోయించేసుకొవటమే బాగుంది అనిపించింది
ఈ లోపల చందు బైటకు వచ్చి... నీకు బొర్ కొడుతోంది అన్నావ్ కదే... మా అన్నయ్యతో కాసేపు మాట్లడతావా లేక ఇంటికి వెళ్ళిపొతావా అన్నది....
ఎస్.వి క్రిస్ణా రెడ్డీ డాన్స్ చుస్తావా.....లేక రాజశేఖర్ నవ్వు చూస్తావా అని అడిగినట్టు అనిపించింది
ఒక్క క్షణం ఇద్దరూ కళ్ళ ముందు కదిలారు.. భయం వేసి... వేంటనే దాని బక్క కాళ్ళ మీద పడిపోయి మొక్షం ప్రసాదించమని వేడుకున్నా...
సరెలేవే పద సమత వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నది....
డి.డి లో అంజుమన్ ఉర్దూ సంచికా కార్యక్రమం మధ్యలో కరెంట్ పొయినంత ఆనదం గా అనిపించింది
వెంటనే లేచి పరిగెత్తాను.....
వెనక నుంచి ఆ తెల్ల కుందేలు నవ్వుతూనే ఉన్నాడు
****************************************************************************


ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళు ఎవరే...బ్రాహ్మలేనా అని అడిగింది ఒక ముసలావిడ గుమ్మం లోనే
నేనే ముందుకు వెళ్ళి..ఔనండి మేము బ్రాహ్మలమే..లోపలకి రావచ్చా అని అడిగా...
నా రంగు వైపు కాస్థ అనుమనం గా చుసక....
ఏదో గొణుగుతూ లోపలకి వెళ్ళిపొయింది
నేను చందు లోపలకి వెళ్ళాం....
వరండాలో వీణ ... ఆహ.......
"సో ఎంటే కబుర్లు" అంటూ చున్నీకి చేతులు తుడుచుకుంటూ బైటకి వచ్చింది..ముగ్గు పిల్ల.....
జూస్ ఎమన్నా కలిపిందేమో లోపల.???? ఏలాగు ఈ బక్క చందుది నాకు అని చెప్పి జూస్ చేయించి...లొటాడు తాగేసి..అదే లొటాలో నెళ్ళు నింపుకొచ్చింది
కనీసం ఈ అమ్మాయి అన్నా నాకు జూస్ ఇస్తే బాగుండు అనుకున్నా....
సృజన ఏం.పీ.సీ తీసుకుంటావా బై.పీ.సీ నా అని అడిగింది
బత్తాయి జూస్ తాగుతావా లేక మామిడికాయ జూస్ ఆ అని అడిగినంత తీయగా అడిగింది
జూస్ కానప్పుడు ఏ పీ.సీ ఐతే నాకేంటిలే అనుకొని... ఏమో తెలియదు ఇంకా ఏం అనుకోలెదు అని చెప్పా....
నువ్వు వీణ వాయిస్తావా అని అడిగా
లేదు మా అమ్మ వాయిస్తారు... నేను ఊరికే పాడతా..... అంతే.... అన్నది
అయితే ఎమన్నా పాడావా అని అడిగా
హీరోయిన్ ని వయసు చెప్పమంటే ఎంత ఇబ్బంది గా మెలికలు తిరుగుతుందో ..సరిగ్గా అలానే కాసేపు అహా..లెదు ..కాదు..రాదు...లాంటి పదాలన్నీ వాడేసాక.... ఒక పాట పాడేసింది
"నిన్న ఈ కలవరింత లేదులే...నేడు చిరుగాలి ఏదో అందెనే...ఇది ఏ ప్రేమ అందురా....మనసే పరవసించేనా..తనువే పులకరించెనా....ఓ మనసా..."
అంటూ ఒక ఐదు నిమిషాలు నాకు అన్ని రాకాల జూసులు ఇచ్చేసింది ......
హీరోయిన్ మీద ఎదో తెలియని లైకింగ్ మొదలు అయిపొయింది....
ఇప్పుడు ఈ అమ్మాయి ని ముగ్గు అని పిలవాలా...ముత్యం అని పిలవాల...లేక కోకిలా అని పిలవాలా.....
ఏం పిలుద్దాం అన్నా..ఎదురు గా వళ్ళ బామ్మ కూర్చోని నా రంగునే తీక్షణం గా చుస్తూ ఉంది.....
ఇంకా ఆవిడ అనుమానం తీరినట్టు లేదు
ఆవిడ వైపే చుస్తూ..సరే సమతా వెళ్తాను ఇక అన్నాను....
సరేనోయ్..వస్తూ ఉండు అప్పుడప్పుడు ..అన్నది...
మనసులో..ఎందుకు రాను..తప్పకుండా వస్తా ముగ్గు కం ముత్యం కం కోకిలా...అనుకుంటూ సైకిల్ ఎక్కేసా.....
******************************************************************************

మా ఇంటికి రా...రేపు నా పుట్టినరోజు... అంటూ ఫొనె చేసింది ....
నువ్వు పిలవటం నేను రాకపొవటం ఆ...అని మనసులో అనుకొని..బైటకి మాత్రం.."ఏమో సమతా...కుదరకపొవచ్చు...కాని ప్రయత్నిస్తా" అని చెప్పి ఫొనె పెట్టెసా...
కాలేజ్ కి ఆగ మేఘాల మీద వెళ్ళిపోయి...
తనే తెల్ల గా ఉంటా ..ఇక తన కన్నా ఎవరూ బాగోరు అని అనుకునే నా స్నేహితురాలు...ఈశ్వరి ( అసలు పేరు నాగ మల్లీశ్వరి... మొడ్రన్ గా ఉంటుంది అని ఈశ్వరి అని మార్చుకుంది.. ఎవరితో చెప్పద్దు ప్లీజ్) కి చెప్పా..... నీ కన్నా బాగుండే అమ్మాయి ఒకతి ఉంది అని చెప్పానా నీకు...ఆ అమ్మాయి పుట్టిన రోజు ఇవాళ... నాతొ రా సాయంత్రం...
వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి ని చుపిస్తా అన్నాను.....
నా వైపు కొరకొరా చుస్తూ " ఎవరు?? గులాబి రేకుల్లాంటి పెదాల తో....చిరుగాలి సవ్వడి లా నవ్వుతుంది అని కవిత్వం చెప్పావే.. ఆ అమ్మయి ఏ నా?" అంటూ మూతి నాలుగు వంకలు తిప్పింది
ఔనులే రావే అంటూ లాక్కెళ్ళా....
చిన్న గిఫ్ట్ ఇచ్చేసి.. ప్లేట్ బిర్యాని తినేసి ..... ఈశ్వరి కి సమత ని చూపించేసి... బై చెప్పగానే..సరే నే అంటూ ముత్యాల దండ ని మళ్లీ తెంపేసిన ఆ పిల్ల వైపే చూస్తూ....
ఆ రోజు కి మళ్ళీ మా హిట్లర్ డెన్ వైపు కి వెళ్ళిపొయా
*****************************************************************************

అలా అలా అలా ..... వీలైతే నాలుగు మాటలు...కుదిరితే ఒక పాట లా సాగిపొయింది మా పరిచయం....
తను బీ.టెక్ చేసినన్ని రోజులు..అప్పుడప్పుడు కనపడి....పొడి పొడి గా మాట్లాడి... వడి వడి గా వెళ్ళిపోయేది....
ప్రతి సారి ఆ ముత్యాలు ఏరుకుంటూనే ఉండిపొయాను.......
హటాత్తుగా చందు ఒక రోజు ఫోన్ చేసి.. మా సమత కి రంగడకి పెళ్ళే అని చెప్పెసింది...
ఆ కుందేలు పిల్లాడికి... ఏ ముత్యాల మూటా?????
అయినా కుందేలు కూడా మంచివాడేలే.... కాస్త తిక్క ఉంది కాని....నా రాఖీ మహిమ వల్ల బోల్డంత మంచి కూడా ఉందిలే
అందుకే సరిపెట్టేసుకున్నాను...
**********************************************************************************************
ఒక రోజు జీ-మెయిల్ లో ఏ బకరా దోరుకుతాడా అని చూస్తుండగా
రంగడు హాయ్ అంటూ మనుషుల్లా ..సాటి మనిషిని పలకరించిన్నట్టు ..జీ-టాక్ లో పింగ్ చేసాడు
వై.స్ రాజశెఖర్ రెడ్డీ ప్రభుత్వం పని చేసినంత వింత గా అనిపించి... ఏమైంది రంగా..బానే ఉన్నవా అన్నాను
నేను సమత నే అన్నది.....
ఒహ్ నువ్వా ముత్యాలు..గులాబి రేకులు... అని మనసులో అనుకొని..
హాయ్ సమతా ..ఎలా ఉన్నావ్ అన్నాను.....
అప్పటి నుంచి ఇప్పటి వరకు..ప్రతి రోజు పలకరిస్తూనే ఉంది ఆ పిల్ల......
సంగీతం సాహిత్యం.... వంటలు...కూరలు...వాళ్ళ ఆయన... వాళ్ళ అక్క....
అన్ని విషయాలు మాట్లూడుతుంది.....
హీ హీ అనో..హ హ అనో హీరొయిన్ టైప్ చెయ్యగానే.....
ఇక్కడ నా లాప్టాప్లో ముత్యాలు రాలి పడుతుంటాయి....
పసిపాప లో ముసినవ్వులా కపటాలు లేని మనసుతో బొల్డన్ని మాటలు .....
అన్ని సమ్యసలని పరిష్కరించేయాలన్న కసితో బోల్డన్ని వాదోపవాదాలు.....
పాత పాటలు...పాత రోజులు మళ్ళీ రావలీ అనే కోరికలు....
ఇలాంటి ఎన్నో తన భావలని నాతో పంచుకుంటుంది....
తోలకరి జల్లులో తీయటి పాట.... ఈ పిల్ల
రెండు మూడు రోజులు జీ-టాక్ లో కనపడకపొతే...... పది సార్లు రీఫ్రెష్ కొట్టేస్తున్నాను....
అయినా అమ్మాయి ని అయ్యి ఉండి ఇంకో అమ్మయికి నేను ఇలా లైన్ వెయ్యటం... అందులోను పెళ్ళి అయినా ఆంటీ కి..
చా ...
ఎం బాలేదు
డాక్టర్ అయొమయం దగ్గరకి వెళ్ళాలి..
ఉంటాను
సెలవు