Wednesday, February 28, 2007

అమృత కలశం

ఛాలా రోజుల తరువాత వెళ్తున్నా మా ఇంటికి...రైలుబండి ప్రయాణం,కిటికీ పక్కన చొటు,బయటకు తొంగి చూడగానే కనిపించే పచ్చటి ప్రకృతి,సుతిమెత్తని పచ్చని ఆకుల పొత్తిళ్ళలో సురక్షితంగా ఒదిగిపొయి,జోరుగా వీస్తున్న గాలి సవ్వడికి తాళం వేస్తునట్టుగా తలలూపుతున్న పత్తి పూవులు.ఏర్రటి తివాచిని తలపించే లాగా కళ్ళాల్లో ఆరబొసిన ఎర్రమిరప.జూమ్మంటూ చెవులని తాకుతున్న చిరుగాలి,చురుక్కున్న గుచ్చుకుంటున్న ఉదయభానుడి తీక్షన చూపులు..గట్టిగా ఒక్కసారి గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నకా ఒకింత హాయి
ఒక పక్క ఎంతో అనందంగా మనసు ఉరకలు వేస్తున్నా మరొపక్క శ్రీధర్ తో జరిగిన వాగ్వివాదం జ్ఞప్తికి వస్తూనే ఉంది..బాధ పెడుతూనే ఉంది,ఒకే సారి అనందవిషాదల మేలుకలయక ఇప్పటినా మనహ్ స్థితి.ఏప్పుడూ తన గురించే అలొచిస్తూ, తనకోసమే ఎదురుచుస్తూ, ఈ నిమిషంలో తను ఏం చేస్తుంటాదో,ఈ క్షనానేం అలొచిస్తున్నాడో, నన్ను గుర్తుతెచ్చుకుంటున్నాడో లేడో, నా గురించి అలొచిస్తాడా అసలు,గుర్తువస్తే ఒక్కసారి నాకు ఫొనె చేసి మాట్లాడొచ్చుగా,మాట్లాడ్దడే?అనుకుంటూ తనకోసం ఇంత ఆరాటంగా కొట్టుకునే నా మనస్సంటే ఇంతటి అలుసా..ఔనులే ఊరికే అన్నారా,మగువ తానంతట తానుగా వలచి వచ్చిన బిగువ అని.ఏందుకు నాకీ వేదన,ఎన్నాళ్ళిలా,ఎన్నేళ్ళు అలా,శ్రీధర్ తో నా పెళ్ళయ్యి ఇప్పటికి ఐదేళ్ళు,కావటానికి ప్రేమవివాహమే అయినా,పెళ్ళయ్యిన నాటి నుంచి ఒక్కరొజన్నా గడవలేదు మానడుమ ఎదో ఒక వాదులాట జరగకుండా,నిన్నటికి నిన్న ఎంటి ఆలస్యం అయ్యింది అన్నందుకు,ఎదో అయ్యిందిలే, ప్రతీదీ నీకు చెప్పాలా,అయినా ఏదొ దొషి ని ప్రశ్నించినట్టు గా ఎంటి ఎడతెరిపి లేకుండా ఈ ప్రశ్నలు,ఆట్టే విసిగించక వెళ్ళి పడుకో మహిత, అంటూ వెళ్ళిపొయాడు.
ప్రొద్దుటి నుంచి తన ఒక్క పిలుపు కోసం అర్రులుచాచి వేచి చూస్తున్నాను,మహితా ఇవాళ మన పెళ్ళి రోజు కదా అంటూ మరువలేని ఆ మధురానుభూతులని నెమరువేసే తన మాట కోసం ఎదురుచూస్తుండిపొయాను.శ్రీధర్ పెళ్ళైనప్పటి నుంచి ఎక్కువగా పని చేయటం మొదలుపెట్టాడు,మూడేళ్ళలొనే రెండు సార్లు పదొన్నతి పొందాడు,అలా తను ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ,మా మధ్యన అనుబంధం ఒక్కొక్క మెట్టు దిగుతోందేమో అనిపించింధి నాకు.ఏదొ తెలియని దూరం పెరిగిపొయింది.ఫక్కనే ఉండే ఆ మనిషిలో నా మనిషిని వెతికి వెతికి వేసారి పొయాను.శ్రీధర్ నీకు నీ ఉద్యొగమే అంథ ముఖ్యమా నేను కాదా అని అడిగినందుకు,ఔను అదినా చిన్నిల్లుగా మరి అంటూ తేలికగా తీసి పడేస్తాడునా ప్రశ్నను.ఇంత ఆద్రతతొ అడుగుతున్నా అంత అలవోకగా చెప్పేస్తాడు.ఊద్యొగం ముఖ్యమే కాని ఉన్నతమయిన స్థానంలొకి వెళ్లే పరుగులొ,భవితను తీర్చిదిద్దుకునే పధంలొ అపురుపమయిన మానవసంభందాలని నిర్లక్ష్యం చెయటం ఎంత వరకు సమంజసం,ప్రేమతో కదుపునిండదని నాకూ తెలుసు, కాని ప్రేమ నిండుకున్న కాపురం పండదనీ తెలుసు,కలిసి ఒకే చొట ఒకే చూరు కింద ఉండటమేనా పెళ్ళి పరమార్ధం,సంపాదించటం మగవాడివంతు ,వండి వార్చటం ఆడదాని వంతు, ఇంతేనా సంసారం అంటే,"మహితా నువ్వే నన్ను అర్ధం చేసుకొకుండా అనవసరంగా నువ్వు ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నావు,నీ మీద నా ప్రేమ తరగనిది చెరగనిది,అది అలానే ఇప్పటికీ ఉంది ఎప్పతికీ ఉంటుంది" అనే శ్రీధర్ ని చూస్తూంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది. "నాకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను మాట్లాడకపొయినా పట్టించుకొకపొయినా దాన్ని పెద్దగా లెక్కలొకి తీసుకొకు" అనేనా తన భావం. ఏం చేసినా తనను విడిచి వెళ్ళను అనేగా తన ధీమా.
హూ!! ఆలొచించిన ప్రతీ సారి సమధానం దొరకకపొయినా,ఒకటి మాత్రం బొధపడింది,ఈ జీవితం ఇంతే,ఎప్పుడూ ఎదో ఒక ఆరాటం,ఎల్లప్పుడూ ఎదో ఒక ఆలొచన.భాధ లేని రొజులకోసం బ్రతుకంతా వెతుకులాటే,అందుకొవాలనుకున్నవన్నీ అందని ద్రాక్షే,ఎవరికి వారు వారి పరిధిలో ఇతొధికంగా అందించే వేదన,విడువమన్నా వీడని క్లేధం.
బ్రతుకంతా పొరాటం
ఒకనాడు ప్రేమ కోసం
ఒకనాడు పరువు కొసం
ఒకనాడు మనిషి కొసం
ఒకనాడు మనసు కొసం...
అంతా కృష్ణమాయ.నా అలొచనలకు తెరదించుతూ…
ఆమ్మ బూర కొనిపెత్తవా అంటూ చేయి పట్టుకొని ఉపేసింది స్మృతి.అబ్బా ఉరుకోమ్మా ఇప్పుడువద్దులే పగిలిపొతుంది,ఇంటికి వెళ్ళాక తాతయ్యగార్ని అడిగి కొన్నుకుందువులే అన్ననా మాటను లక్ష్య పెట్టకుండా,నాకు కావాలి అంతే అంటూ కూర్చుంది,వద్దంటే వినదు పెంకి పిల్ల,అంతా శ్రీధర్ పొలిక,తను చెప్పేదే వేదం,తను పాడేదే రాగం అనే పంధా.ఈ మొండితనం వదిలించాలి అని నేను కూడా మిన్నకుండి పొయాను,ఇక ఎడుపు లంకించుకుంది,"స్మృతీ తర్వాత కొనిపెడతా అని చెప్ప కద నాన్నా,ఏడవకు"అని నేను ఎంత ఊరడించ ప్రయత్నించినా మంకుపట్టు విడువకుండా అలానే ఎడుస్తూ నిల్చుందిపొయింధి, పెంకి ఘటం,దానికే అంత పట్టుదల అయితే దాని తల్లిని నాకెంత ఉండాలి మరి,ఎడవనీలెమ్మని వదిలేసాను,దాని మానాన అది ఎడ్చి ఎడ్చి నిద్రపొయింది.రైలు గుంటూర్లొ ఆగింది,నిద్రపొతున్న స్మృతిని భుజాన వేసుకొని పయన ఉన్న బ్యాగ్ తీసుకొని మెల్లగా కిందకు దిగా,ఎదురుగా నాన్న,నన్ను చుడకుండా ఎటో వెతుక్కుంటున్నారు,నాన్నా ఇటు అంటూ బిగ్గరగా పిలిచా,నా వైపు చూసి వడి వడిగా అడుగులు వేసుకుంటూ నా దగ్గరకు వచ్చి,ఎంటి నిద్రపొయిందా అన్నారు,ఔను నాన్నా బూర కొనిపెట్టమని మారం చేసి చేసి ఎడుస్తూ నిద్రపొయింది అన్నాను,నా నుంచి స్మృతిని తీసుకొని తన భుజం మీద వేసుకుంటుండగా,కళ్ళు నులుముకుంటూ లేచి చూసింది,నాన్నాగారిని చూడగానే ఒక్కసారిగా దాని చిన్న చిన్న కనుబొమ్మలు బొలుడంత ఆశ్చర్యంతో ఒకదానితో ఒకటి సంప్రదింపులు మొదలెట్టేసాయి,అలా ముడుచుకుపొయిన బ్రుకుటి ఒక్కసారిగా విప్పారి,తాతా అంటూ నాన్నగార్ని గట్టిగా కౌగలించేసుకుంది,"తాతా అమ్మ బూర కొనిపెత్తలేదు"అంటూ నా మీద అప్పుడే చాడీలు చెప్పటం మొదలుపెట్టెసింది.మనం కొనుకుందాంలే అంటూ నాన్న ఊరడింపులు.
***************************************************************

గేట్ ముందు కార్ ఆగగానే పరిగెత్తుకుంటూ వచ్చి పై పైకి ఎక్కుతూ,తనలొని సంబ్రమాశ్చర్యాలను ప్రదర్శించగలిగిన ఒకేఒక్క సాధనమైన తన తోకను అటు ఇటు ఉపేస్తూ,మూలుగుతూ నాకేయటం మొదలేట్టెసాడు మా భీముడు.ఓరెయ్ భీమా ఆగరా అంటున్నా వినకుండా నాకంటే ముందుగా పరిగెట్టుకెళ్ళి ముందుగదిలొ నుంచొని న వైపే చూస్తూ లొపలికిరా అన్న భావం
స్పురించేలా అరవనారంభించాడు.మాభీముడి గొంతు విని హడావిడిగా వచ్చేసింది అమ్మ. ఆమ్మమ్మా అంటూ వెళ్ళి చుట్టెసింది స్మృతి,నా తల్లే,నా బంగారమే,నా బాచాల కొండే,అమ్మమ్మ గుర్తుందానా బుజ్జితల్లికి,అంటూ ముద్దుల వర్షం కురిపించేసింది అమ్మ.భొజనాలు,కబుర్లు కాకరకాయలు అయ్యాక, "ఏమేవ్ మహితా నువ్వొక పనిచేసి పెట్టలేనాకు,ఒక మహత్తర యగ్నం అనుకొ "అన్నది అమ్మ,ఎంటమ్మా అది చెప్పు చేస్తాను అన్నాను,ఏంలేదే నీ పుస్తకాల అర కాస్త సద్ది,అందులొ అనవసరమైన చెత్తా పారేసి శుబ్రం చేసావనుకొ,స్వయంగా శివుని జటాజూటం నుంచి నేరుగా పొంగి వస్తున్న గంగలో నిట్ట నిలువుగా నిల్చొని స్నానం చేసినణ పుణ్యం కట్టుకున్న దానివవుతావే అన్న అమ్మ మాటలకినాకు నవ్వాగలేదు,ఏ అమ్మా అంత ఘోరంగా ఉందా నా అర,ఘొరమా అని చిన్నగా అంటావేంటె,అదొక మహాసముద్రం,అందులొ ఏదన్నా వస్తువు వెళ్తే ఇక దాని గతి అదొగతే,క్షీరసాగర మధనం నెరపి సునాయాసంగా అమృతభాండాన్ననా వెలికితీయవచ్చునేమో కాని,నీ అల్మారలొ నుంచి కావాల్సిన వస్తువు ఒక్కటి కూడా తీయలేమే,అది మాత్రం నిశ్చయం అన్నది అమ్మ.సర్లే అలాగే చేస్తానులే అంటూ పడుకొబొతుండగా,ఆహా అలా కాదు ఇప్పుడే చెయ్యలి మహిత అంటూ నన్ను నిద్రపొనీయకుండా ఆపేసింది,ఇక చేసెదేముంది,తమరి ఆజ్ఞ శిరసావహవిస్తాం మాతా అంటూ వంగిన నా తల మీద మురిపెంగా ఒక మొట్టికాయ వేస్తూ,చాల్లే వెళ్ళవే అంటూ స్మృతితో "చిట్టి తల్లీ,నీకొసం రొజూ కాకి కొకిల వస్తున్నాయి,స్మృతి ఏది అండి స్మృతివాళ్ళ అమ్మమ్మ గారు అంతు కా కా కా అంటూ అడుగుతున్నాయి నన్ను, అంటూ స్మృతిని తీసుకొని పెరట్లోకి వెల్లిపొయింది,నేను నా గదిలొకి వెళ్ళి,రెడియో స్విచ్ వేసి,ముందు అలమారలొ ఉన్నవన్నీ ఒక్క చెత్తో లాగి కింద పడేసి వాటి ముందు కూలబడ్డాను,ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టాలి,ముందుగా పుస్తకాలు,అవసరం ఉన్నవి ఒక పక్కగా పెడుతూ లేనివి ఇంకొక పక్కన పడేస్తూవస్తున్నా,ఆ క్రమంలొ కనిపించింధి నా డైరి,ఎప్పుడో చిన్నప్పటిది,బహుశా నేను ఆరవ తరగతి చదువుతున్నప్పటిది కాబొలు,తెరచి చుస్తే మొదటి పేజీలోనే పెద్ద పెద్ద అక్షరాలతో పి.మహిత 6-బి క్లాస్ అంటూ కనపడింది నా దస్తూరి,ఇంచుమించు భూగొలమంత పరిమాణంలో ఉన్న అక్షరక్రమం,ఇధి రాసింది నేనేనా అని అనుమానం వచ్చింది,ఇప్పుడు కూడా ఇలానే ఉందానా దస్తూరి అని ధర్మసందేహం కలిగింది,ఇంకెందుకు అలస్యం కలం కొసం వెతకనారంభించాను,వెతకగా వెతకగా మా అమ్మ పరిబాష లొ చెప్పాలంటే క్షీరసాగర మధనం నెరుపగా నెరుపగా,బైటకి వచ్చిన క్షీరాబ్ధికన్యక లాగా తళ్ళుక్కున మెరిసింది ఒక మూల,పెన్, చెతిలొకి తీసుకుందును కదా అది న చిన్ననాటి పెన్,,దాని పేరు "కంఫొర్ట్ పెన్",దాని కొసం అప్పట్లో నేను చేసిన భగీరధ ప్రయత్నం గుర్తుకువచ్చింది.పెన్సిల్తో రాసుకొమ్మని నాన్నా,లెదు నాకు పెన్నే కావలి అంటూ మారం చేసిన నేను,నాన్నాతో భీకర పొరాటం,చివరకి గెలుపు నాన్నదే,బుంగమూతి నాది,"పొనీలేండి ఎదో చిన్నది అడుగుతోంది కదా,అర్ధరూపాయే కడండి,కొనుదురూ" అంటూ అమ్మ చెవిలొ ఇల్లు కట్టుకొని పొరగా తప్పక పెన్ తెచ్చిన నాన్నా విసురు,అన్నీ ఒక్కసారిగ జ్ఞప్తికివచ్చాయి.ఆ పెంతో కాగితం మీద నా కుతురి పేరు రాసి చూసాను,"మధుర స్మృతి",అక్కడితొ ఆగక నా పేరు కూడా రాసి చుసుకున్నాను,డైరి లొని నా దస్తూరీతొ సరి పొల్చి చూసాను,నా దస్తూరీలో ఇంతటి మార్పా!!!మరి నాలొ ఎంత మార్పు?ఒక్కసారి సిమ్హావలొకనం చేస్కొవాలనిపించింది.నా దైరీలన్నీ సంవత్సరాలవారీగా పెట్టను,ముందుగా నా ఆరవ తరగతి డైరి,
"05/05/94"
నాన్నానాకు పుస్తకాల బ్యాగ్ కొనమంటే కొనను అన్నారు,"ఆ రేకు డబ్బా బాగానే ఉందిగా దాన్లో పెట్టుకెళ్తున్నావుగా పుస్తకాలు ఇప్పుడు బ్యాగ్ ఎందుకు,అయినా చదువుకొని తగలడు,బ్యాగుల మీద,బొమ్మల మీద ఉన్న ధ్యాస చదువు మీద ఉంటే ఇలా ఎందుకు ఎడ్చేదానివి" అన్నారు,నాకుచాలా భాదేసింది,ఎడుపొస్తొంది కూడాను...ఇదిగో ఇప్పుడు ఎడుస్తూనే రాస్తున్నా కూడా..."
ఆ కాగితం మీద కనిపిస్తున్న కన్నిటి చారల ఆణవాళ్ళను,నా వేళ్ళతో స్ప్రుసించాను,అప్పటి నా చిన్న హృదయవేదన ఒక్క క్షణం అనుభవంలొకి వచ్చింది
"16/08/94"
ఇవాళ మార్కులు తక్కువొచ్చాయని అమ్మ తిట్టింది నాన్న రెండు దెబ్బలు కూదా వేసారు,గచ్చకాయలు అడుకుంటూ పార్వతి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను,"ఎంతసేపూ ఆటలేనా ఒకపక్క చదువు అటక్కెక్కిపొయింది,నేను బయటకెల్లొచ్చే లొపల, పుస్తకం తెరవకపొయవో,చెప్తా నీసంగతి" అని నాన్న బెదిరించి వెళ్ళారు,అక్కద పార్వతి,ధనాయ్,సుబ్బి గాడు,మహీంద్ర,కల్పన అందరూ ఉన్నారు,ధనాయ్ ఐతే "ఎంటే మీనాన్న అలా అరిచారు,మా నాన్న ఐతే ఎప్పుడూ ఏలా అనలేదు అన్నది",ఔను అందరి తల్లితండ్రులు పిల్లలతో చక్కగా మాట్లాడుతారు అట,జొక్స్ కూడా వేసుకుంటారట,మా నాన్న అమ్మ ఎప్పుడూ నన్ను తిడుతూ ఉంటారు,ఏండాకాలం సెలవల్లో కూడా,సుమతీ శతకాలు,వేమన శతకాలు,పెద్దబాల శిక్షలొని లెక్కలు,చేయిస్తూ,చదివిస్తూ నా ప్రాణం తొడేస్తున్నారు. నా బాధ ఎవరికి చెప్పను,అన్నయ్య గాడు నేను ఏం చెప్పినా,పొవే వదిలేయ్ అంటాడు,అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందిగా నేను బ్రిడ్జీ కింద కూర్చొని ఎడుస్తుంటే,పొన్లే పాపం పిల్ల నల్లగా ఉన్నా బాగుందిలే అని తెచ్చి పెంచుకున్నామని,సొంత అమ్మాయిని కాదుగా అందుకే నాతొ ఇలా ఉంటున్నారు"
ఇక చదవలేక అపేసాను,చదువుతున్నకొద్దీ నవ్వాగలేదు,ఏదొ సరదాగా అటపట్టించటానికి బ్రిడ్జీ కింద దొరికావు అని అమ్మ అన్న మాటలు అంతగా పట్టించుకున్నానా నేను,అయ్యొ రాత ఇంతతి అమాయకత్వమా నాది.
ఆ డైరీ పక్కన పెట్టి నా పదవతరగతి డైరీ అందుకున్నా

05/04/97

ఇవాళ మా ఫేరెవెల్ పార్టి, అందరం కలిసి మైక్ ముందు నుంచొని "ముస్థఫా ముస్థఫా" పాట పాడాం ,"స్నేహితుల్ని వీడిపొయె రొజు మాత్రం కంటి నిండా కన్నీటి తొనే నంట ఫేరెవెల్ పార్టి" అన్న లైన్ దగ్గర అందరం చాల సేపు ఎడ్చాం,సీత ఐతే పాట మద్యలోనే వెళ్ళిపొయింది.అప్పట్లో నన్ను ఎడిపించిన సుబ్రమణ్యంగాడు నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు,వాడు మంచివాడే అని నాకు అప్పటిదాకా తెలియదు,వాడొక వెధవ పీనుగ అని నేనేప్పుడూ తిట్టుకునేదాన్ని,కాని మొదటి సారి ఎడుపొచ్చింది వాదు నాతో అలా మాట్లాడితే,అందరం ఆటొగ్రాఫులు కూడా తీసుకున్నాం,అసలు దెవుడు ఎందుకిలా చేస్తాడు,ఎందుకు మాందరిని ఇలా విడదీస్తాడు,దేవుడు మంచివాడని అమ్మ చెప్పిందిగా,మరి ఎందుకు ఇలా చేస్తాడు,నాకు హనుమంతుడి మీద కొపంగా ఉంది. మేమందరం ఎప్పుడూ ఉత్తరాలు రాసుకొవాలని అందరం కలిసి మా స్కూల్ సత్తయ్య కొట్టు పక్కన ఉన్న వినాయకుడి మీద ఒట్టెసుకున్నాం,ఒట్టు తీసి గట్టు మీద పెట్టకుండా ఉండేలా ఒట్టెసుకున్నాం,బాగా ఎడుపొస్తొంది,ఇంక రాయలెను"

ఇంకొక డైరీ అందుకున్నాను,అదినా కాలేజీలో ఉన్నప్పటిది లాగా ఉంది
14/09/00

ఇవాళ మొదటి సారి శ్రీధర్ నా వంకచూసాడు,గుండెల్లొ ఎదో తెలియని అలజడి,ఆ చూపులు నా మనుసులొ దాగి,నాకే సొంతమయ్,నాకె అర్ధం అయ్యే,ఎన్నో భావాలను చదువుతునట్టుగా,నా మనొసంపదనంతా దొచుకుంటునట్టుగా ఉన్నాయి,నా మొములొని కదలికలను తరచి తరచి చూస్తున్న తన చుపులు,నాపక్కగా సాగిపొతున్న తన అడుగులు,ఎదో తెలియని కలవరాన్ని, అనిర్విచనీయమయిన అనుభూతిని,మాటలకందని మధుర బాధని కలిగిస్తున్నాయి, నా అంతరార్దం ఈపాటికే తనకి బొధపడి ఉండాలే,అయినా అడుగు ముందుకేయడే??శ్రీధర్ తనంతట తానుగా వచ్చే రొజు కొసం ఎదురుచుస్తూ ఉంటాను,కాని ఎప్పుడు వస్తావు శ్రీధర్?????
01/01/01

శ్రిధర్లో కూడా ఒక దూర్వాసుడు దాగున్నాడని ఇవాళే తెలిసింది,గుడికి రావటం కాస్త అలశ్యం అయ్యింది అని విరుచుకుపడ్డాడు,చుట్టురా అందరు ఉన్నారన్న అలొచన కూడ లేకుండా,నొటికొచ్చినట్టు తూలనాడాడు,ఈ మగవాళ్ళంతా ఇంతేనేమో,ఆడడానిలొ ఉన్న అత్మాభిమానన్ని లక్ష్య పెట్టరు,ఎన్నో సార్లు చిలక్కు చెపినట్టు చెప్పాను అలా అరవద్దని,నామాట ఎనాడు విన్నాడు గనక....

"12/09/03"

డెలివరి అయ్యేదాక ఉందాం అని ఇవాళే గుంటూరు వచ్చాను,ఇందాకే శ్రీధర్ కాల్ చేసాడు,పాప పుట్టాలని తన కొరిక, అమ్మాయి పుడితే "సమ్యుక్త" అని పెడదాం అని నేను,కాదు మధుర స్మృతి అని పెట్టాలని తను,పెద్ద వాదులాటే అయ్యింది,మధుర స్మృతి అంతె ఇంక ఇందులొ మార్పేమీ లెదు అని చటుక్కున ఫొనె పెట్టెసాడు...చా...


డైరీలన్నీ పక్కన పెట్టి అలొచిస్తున్నా,"అమ్మా నా బొమ్మ చూలు,నేనే చేచా" అంటూ వచ్చింది స్మృతి,రైలు ఎక్కే ముందు నేను కొనిచ్చిన చాక్లేట్ కాగితంతో చేసింది,అమ్మాయి బొమ్మ,రెండు పిలకలు కూడా పెట్టింది,"అమ్మ ఇది స్మృతి అన్నమాట,బాగుందా"అంటూ నా వైపు చుసింది.బాగుంది నాన్నా అన్ననా మాట విని అమితానందంతో తన బుజ్జి బుజ్జి పాదలతో భూమాత గుండెలమీద అపురుపమైన ముగ్గు వేస్తూ,పరిగెత్తుకెళ్ళిపొయింది.
పరిగెత్తుతున్న స్మృతి వైపు చుస్తూ లేచి వెళ్ళి పడకుర్చీలో కూర్చున్నాను.చిన్న విషయంలో కూడా అనందాన్ని అనుభవించే స్మృతి వయసుకి వెల్లిపొవాలనిపించింది ఒక్కసారిగా.వెనకగా వాలి కళ్ళుమూసుకున్నా,రేడియొలో నుంచి లీలగా వినపడుతున్న పాట,"మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే",హు!! మనసు ఎప్పుడూ ఆశ పడుతూనే ఉంటుంది,ఈ ఆశకి అంతు ఏది గనుక,
ఎంత తాగినా తీరని దాహం
ఎంత చూసినా తరగని మొహం
ఉవెత్తున ఎగిరే భావతరంగాలు
మిన్నంటి చుసే చిలిపి కొరికలు
వెరసి మదురొహాలా మనసు.
కాలం ఎన్నో గాయలకి మందు అనటం పుస్తకాలకే అంకితం,నా ఈ బాధ ఎవరికి తెలుసు గనుక,అనుభవం లొకి వస్తె కదా తెలిసేది,వడ్డున ఉండి ఎన్ని అయినా చెప్పచ్చు,నీటిలొకి అడుగిడితే కదా తెలిసేది అని నేనెప్పుడూ అనుకునేదాన్ని,ఎంతటి అమాయకత్వం.ఒకప్పుడు నాన్న బ్యాగ్ కొనలెదనీ,ఆయనకి నెనంటేనే ఇష్టం లేదు అనుకున్నా,దానికొసం ఎడ్చాను,మరి ఇవాళ బూర కొనిపెట్టలేదు గనుక నాకు స్మృతి మీద ప్రేమ లేదనా? సుమతీ శతకాలు వేమన శతకాలు చదవమని నా ప్రాణాలు తొడేసారు నిజమే కాని ముద్దుగా బుజ్జిగా చదువుకుంటే చదువుకో లేకపొతే లేదు అని లాలనగా నాన్న చెప్పి ఉంటే ఇవాళ నేను ఇంతదాన్ని కాగలిగేదాన్నా,నా స్మృతికి అన్నీ నేర్పకలిగేదాన్నా?అప్పట్లో స్నేహితులు దూరం అయిపొతున్నారన్న భావన కలుగగానే హ్రుదయాన్ని మెలిపెట్టినంత బాధ,ఎదో తెలియని నైరాశ్యం,మరి ఇప్పుడు??? అప్పటినా స్నేహసముదాయం లొని వారి పేర్లన్నా సరిగ్గా గుర్తులేవు,అంటె వారి మీద అప్పటినా ప్రేమ అబద్ధమా?? కాదే!!.శ్రీధర్ తనంతట తానుగా నా దగ్గరకు రాలేదని ఎప్పుదు వస్తాడో అని అప్పట్లో ఒకటే తపన ఒకటే ఆరాటం,అదే అలొచన,మనిషి మనిషిలొ ఉండేదాన్ని కాదు,అమ్మ చెప్పిన ఏ అని,నాన చెప్పిన ఏ కబురు చెవికెక్కెది కాదు,పొని అది అనందపారవశ్యమా అంటే కాదు,ఎదో తెలియని దిగులు. పాపకి మధుర స్మృతి అనే పెట్టాలి అని తను పట్టిన మంకు పట్టు నన్ను కాస్త బాధపెట్టినా,"ఎప్పుడూ మా మధ్య జరిగే ప్రణయకలహాలు,ఒకప్పుడు జరిగిన సరససల్లాపాలు,ఎంత కొట్టుకున్నా,ఎన్ని అనుకున్నా,మళ్ళి కలిసిపొయి ,ఒకరిలొ ఒకరు ఒదిగిపొయే అందం మా అనురాగబంధం.ఆ బంధం లొనుంచి జనించింది నా కూతురు,చుసిన ప్రతీ సారి మా నడుమ జరిగిన మధురానుభూతులను జ్ఞప్తికి తెచ్చే దాని పాల బుగ్గలు,బొసి నవ్వులు, వెరసి,నాకు మధురస్మృతి,అందుకే దాని పేరు మధురస్మృతి అని పెట్టాను,నా భార్య ఆగ్నకి విరుద్దంగా తన కొరికకి వ్య్థిర్కేం గా" అంతూ, మా స్మృతి మొదటి పుట్టినరొజు నాటి ఫొటో ఆల్బుం ముందు శ్రీధర్ రాసిన ముందు మాత చుస్తే కాని నకు అర్దం కాలేదు తను అంత మంకు పట్టు ఎందుకు పట్టాడో.నా మీద గుడిలో అరిచిన శ్రీధర్లో ఆడవాళ్ళన్ని గౌరవించలేదు అనేనెపం మొపానే కాని,"ఎంటి లేట్ అయ్యిందని ఓ అరిచెస్తున్నవ్,ఎం నువ్వు నిన్న రాలెదా ఆలశ్యంగా అంటూ తనలోని అహంకరన్ని నిద్రలేపిన నా ముర్ఖత్వం గుర్తుతెచ్చుకొలెదే? పదేళ్ళ క్రితం బాడపెట్టిన విషయాలు,ఇప్పుడు అలొచిస్థె,చిన్నవిగా,అంత ప్రాముక్యత ఉన్నవిగా అనిపించట్లేదు,కాని అప్పట్లొ అవే పెద్ద బాధలు,ఎవరు ఔనన్నా,ఎందరు కాదన్నా.కాని ఆనాడే ,ఆరొజుల్లొనే ఒక అడుగు ముందుకువేసి,మరోలా అంటే ఇప్పటిలా అలొచించి ఉంటే???? ఎంత బాగుండేడి,ఎంత అనందాన్ని అనుభవించకలిగేదాన్ని,ఎంత ప్రేమని ఆశ్వాదించకలిగేదాన్ని!!

శ్రీధర్ నన్ను అర్ధం చేసుకోకుండా,నిర్లక్ష్యం చేస్తున్నాడనేగా నా బాధ,అదే బాధ తన ద్రుష్టికి తీసుకువెళ్ళాల్సిన రీతిలో తీసుకువెళ్తే తను కూడా అలొచిస్తాడెమో,మా నడుమ మళ్ళీ వసంతం చిగురిస్థుందేమో. కాని మరో పక్క మనసు "ఓయ్ మహితా నువ్వెందుకు ఎప్పుడూ తపన పడాలి,నువ్వే ఎందుకు ప్రతీ సారి అడుగు ముందుకేయాలి,ఏం శ్రీధర్కి కుడా ఉండాలిగా ఆ అలొచన,తననే రానీయ్ నీదగ్గరకు,అంత పంతం తనకేనా" అంటూ సంధిగ్ధంలో పడేసింది.శ్రీధర్ దగ్గరకు నేను గా వెళ్ళటం ఒటమి కాదు అదే నిజం అయిన గెలుపు,తనకి అర్ధం చేసుకునే సామర్ధ్యం లేదు అనే నేను, పరొక్షంగా తన కంటే బాగ అర్ధం చేసుకొగలుగుతున్నాను అనేగా అర్ధం,శ్రీధర్ నన్ను అర్ధం చేస్కొలేకపొతున్నాడు నిజమే మరి తనని నెను అర్ధం చేసుకుంటున్నానా?
ఆర్ధం చేసుకుంటున్నాను కనుకనే అలొచించలేని తన తప్పిదాన్ని గ్రహించి,రెండడుగులు ముందుకువేసి మా నడుమ ఉన్న అడ్డు పొరలను తొలగించే ప్రయత్నం చెయ్యాలి,అలోచన వచ్చిందే తడవుగా కాగితం,కలం,అదే నా కంఫొర్ట్ పెన్,అందుకున్నాను.చాలా కాలం తరువాత రాసే అవకాసం వచ్చింది,అప్రయత్నంగా పెదవుల మీద తొనికిసలాడుతున్న చిరునవ్వును ఆపుకుంటూ,మనుసులొ పొంగుతున్న భావొద్వేగాలను కాగితం మీద వ్యక్థపరచటానికి సన్నద్ధురాలినయ్,ఉత్థరం రాయటం మొదలుపెట్టాను, ఆదిలోనే హంసపాదం అన్నట్టు,మొదలు లోనే సందేహం,ఏమని సంభొధించాలి,కాబోయే శ్రీవారికి తొనే ఆగిపొయిందాయే మా ఉత్తర పరంపర,ఇప్పుడు ప్రియమైన శ్రీవారికితో కొత్త పుంతలు తొక్కుతుంది కాబోలు అనుకుంటూ మొదలు పెట్టాను.
ప్రియమైన శ్రీవారికి
దెనికీ రాజీ పడని నాకు,రాజీ పడటంలో ఉండే అనందన్ని తెలిపింది మీ సాంగత్యం,ఆ అనందాన్ని పదిలపరుచుకునే మరో ప్రయత్నమే ఈ ఉత్తరం. "ఏందుకు మహితా ఎప్పుడూ నాచేత అరిపిస్తావ్ అది నిన్ను బాధ పెడుతుందని తెలిసినప్పుడు"అని ఎప్పుడూ మీరడిగే ప్రశ్నకు ఇదిగొండి నా జవాబు
మీ కొపం
మీ విసుగు
మీ చిరాకు
మీ నిర్లక్ష్యం
మీ మాటవిరుపు
మీ కటినవాక్కు
అన్ని నాకు మురిపమే,మీ అంతరంగం విదితమేఒక్క మాట దూరంలో ఆగిపొయిన మన బంధాన్ని చేరువ చేసుకునే ఈ ప్రయత్నంలో నాతో సహకరిస్తారని ఆసిస్తున్నానుమీ ఒక్క మాట కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచుసే నా మనసుని ఒక చుపు చూడరాదుటండీ
చూస్తారని ఆసిస్తూమీ మహిత
ఉత్తరం టప చేసిరమ్మని మా పనిమనిషి సుందరమ్మ చేతికిచ్చాను.గేట్ డాతి వెళ్తున్న సుందరమ్మను చూస్తే ప్రణయరాయభారాలకి పేరుపడిన పావురం గుర్తుకువచ్చింది.
************************************************************************************
చాలా భరంగా గడుస్తున్నాయి రోజులు,"అమ్మాయ్ మహితా,కాస్త గారెల పిండి రుబ్బుదువు రా అమ్మా " అన్న అమ్మ మాటలకి,ఎందుకమ్మా మిక్సిలో వేస్తే పొతుందిగా అన్నాను.రొట్లొ రుబ్బితే వచ్చే రుచి ఈ మషీన్లలో రావు లేవే,ఒక చెయ్యి వేద్దువుగాని రా అమ్మా అంటూ బ్రతిమిలాడి,బామాలి మొత్తానికి రొటి ముందు కుర్చొబెట్టింది నన్ను,మెల్లగా పిండి రుబ్బుతుండగా పరిగెత్తుకొచ్చాడు నరసు,మా సుందరమ్మ కొడుకు,ప్రస్తుతానికి వాడే మా స్మృతి కి మంచి నేస్తం,దాని లొకంలో,దన్ని అనుభవంలో విడువలేని చెలిమి ఈ నరసుది.రొప్పుతున్న వాడి చేతిలో ఒక కవర్ కనపడింది,దాని వైపు చూసి ఒక సారి వాడి వైపు చుసాను,నా చూపులో ఉన్న ప్రశ్న అవగతమయ్యింది కాబోలు,వెంటనే అది నా చేతిలో పెట్టాడు,ఎవరు ఇచ్చారురా అని అడిగాను,"అప్పుడప్పుదు సైకిల్ మీద వస్తుంటాడే నల్ల తాత,ఆయనిచ్చాడు" అంటూ గాలిపటంలా రివ్వున పారిపొయాడు.చెతిలో ఉన్న కవర్ తెరచి చూసాను
మహితా
నీఅంత భావవ్యక్తీకరణ నాకు రాదు,ప్రియ ప్రియతమ అని పిలిచే తత్వము నాది కాదని నీకు తెలుసు. ఎప్పుడూ ఎదో ఒక గొడవ పెట్టుకునే నీలొ నా మీద ప్రేమ ఉందని తెలుసుగాని,ఇంతతి ఆరధన కూడా దాగుందన్న సంగతి మరచిపొయాను మహిత.పని వత్తిడిలో పడి నిన్ను కాస్త నిర్లక్ష్యం చేసిన మాట నిజమే,అప్పుడప్పుడూ ఇళాంటి తప్పులు సహజమే,కాని అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగినది మత్రం కాదు. ఎప్పటిలా నీప్రశ్నలు అలానే సాగి ఉంటే ఇలా అంతర్ముకుడిని అయ్యే అవకాశం నాకు దొరికేది కాదేఓ,ఉత్తరం రాసి చాలా మంచి పని చేసావ్.చాల సందర్బాలలో తప్పు నాదే,అది తెలిసినా సారీ అంటూ నీ దగ్గరకు రాలేని నాకొసం ప్రతీ సారీ ఒక అడుగు ముందుకు వేస్తున్న నీ ఔదార్యం ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నా థాంక్స్ చేప్పే అంత దూరం మన మధ్యలేనందువల్ల మౌనంగా ఉండిపొయాను,నా మౌనన్ని ఇంత బాగా అర్దం చేసుకుంటావని అస్సలు అనుకొలేదు "నన్ను ఒక చూపు చూడరూ" అని నువ్వు రాసిన ఉత్తరం నిన్ను తప్ప ఎదీ చుడాలనిపించకుండా చేసింది,సెలవు పెట్టాను,రేపు బయలుదేరి గుంటూరు వస్తున్నాను. నీ ఎదుట ఏదీ మాట్లాడలేని,నాలొ ఉన్న ఏ అలొచను ఏ భావాన్ని బయటకు చెప్పలేని,చెప్పాలి అనిపించని నా సహజ స్వభావాన్ని అర్ధం చేసుకొగలవని ఆసిస్తూ
నీ
శ్రీధర్

ఉత్తరాన్ని మడిచి,అలొచనలను తెరిచాను,అలొచనల దొంతరోలోనుంచి ఒక్కొక్కటిగా జాలువారిన విషయాలన్నిటిని చుస్తే ఒకటి అవగతమయింది,జీవితంలో చాలా చిన్నవైన విషయాలని చాలా పెద్దవిగా చేతులారా మనమే చేసుకుంటమేమో,కొంచెం జాగురుకులమయ్ అలొచిస్తే బాధ లేని బహు చక్కని అనందతీరం చేరుకొగలమేమో.నా జీవితం ఇలా అయిపొవటానికి లొపం ఎవరిది అని ఎప్పుడూ ప్రశ్నించుకునే నాకు జవబు దొరికింది.లోపం అలొచనలది, లొపం చుసేద్రుక్పదానిది, తప్పు ఎవరి వైపు నుంచన్నా జరగచ్చు కాని ఆ తప్పుని చూసే ద్రుష్టికొణంతో చుడగలిగితే చాలా చిన్న కష్టాలు సులువుగా కనుమరుగైపొతాయి కాబొలు,పెద్ద పెద్ద సినిమా కష్టాలని మనం ఏమి చేయలేకపొవచ్చు,కాని ఇలాంటి చిన్న చిన్నవి మత్రం మన చేతుల్లొనే ఉన్నాయి మరి. ఒక్కసారి ఎవరికి వారం అలొచించి చూసుకుంటె మన జీవితపు కష్టాల చిట్టాలో ఈ చిన్న కష్టలా జాబితానే చాంతాడంత ఉంతుంది,ఆ ప్రవాహంలో కొట్టుకుపొతూ అసలు తమ ఉనికినే కొల్పోతూ మినుకు మినుకు మంటూ ఎక్కడో కనపడతాయి లెక్క కు మించని సినిమా కష్టాలు,హు!!! అంత సుగమమయిన జీవన మార్గన్ని ఇంత టినం గా మార్చుకుంటున్న మన మానవ మన్స్తతత్వాలమీద కాస్త కొపం మరికాస్త నవ్వు వచ్చాయి.మనుష్యులు-వారి స్వభావలు-అలొచనా రీతులు అన్న విషయం మీద తీసీస్ సబ్మిట్ చేసి డాక్త్తరేట్ పొందే అర్హత వచ్చేసింది ఇక నాకు,అనుకుంటూ నవ్వుకుంటూ,అలొచనాసముద్రం లొ మునిగిపొయి,చేతికి ఉన్న చేతికి ఉన్న పిండిని అప్రయత్నంగా నొటికందించాను,అబ్బా ఎక్కడో అపశ్రుతి,"అమ్మా ఇందులొ ఎదొ తగ్గింది,అసలు రుచే లేదు"అన్నాను చిరాకుగా, "ఆ మత్రానికే ఎంటా విసుగు,రుచి దేముందే ఎలా కావలంటే అలా తెచ్చుకొవటం మన చెతుల్లొ ఉన్న పనాయె,ఎది తక్కువయిందొ కాస్త మనసు పెట్టి చూడు,ఆ తక్కువయ్యింది తగినంత కలుపు,బ్రహ్మండమైన రుచి వస్తుంది" అన్న అమ్మ మాటలు నన్ను అల్ఫ్చింపచేసయి.జీవితానికి అన్వయించుకొగలిగిన చక్కని ఉపమానంలా తోచింది అమ్మ మాట.జీవితంలో తగ్గినదేంతో మనసు పెట్టి చూసి,తక్కువయిన దానిని తగినంత కలిపే ప్రయత్నమే నేను పంపిన ఉత్తరం,చివరకు వచ్చిన అద్భుతరుచే శ్రీధర్ జాబు. పెద్ద సినీమా కష్టాలు లేకపొయినా,ఉన్న చిన్నవాటికే పెద్దతనాన్ని ఆపాదించి నిస్సారంగా వ్యధాభరితంగా సాగిపొతున్న నా జీవనగమనం ఒక దారిలొకి వచ్చిందనిపించింది.రొట్లొ పిండి తీసుకోడానికి వచ్చిన అమ్మను చుట్టెసి గట్టిగా ముద్దుపెట్టుకున్నను,ఎంటే ఎమయింది నీకు ఉన్నపళాన అంటున్న అమ్మతో,"క్షీరసాగర మధనం చేయించావుగా,అందులొనుంచి పైకి వచ్చింది ఒక అమ్రుతకలశం ,అది ఇప్పుడు నా జీవనకలశం,అంతటి జీవనామ్రుతాన్ని పంచిపెట్టిన మొహినీ దేవివి కదా నువ్వు,అందుకే నీకీ ముద్దు" అంటున్న నా మాటలను ఆశ్చర్యం,అమాయకత్వం కలగలిపిన చుపులతో నావైపే చూస్తూ నిల్చుండిపొయింది అమ్మ.
*************************************************************************************
Dedicated to:
Cancer tho baadhapaduthu,mandula prabhavam valla pedavulu bhaymkaram gaa vaachi chudanalvi kakunda unnarojuna kuda.. Pillalu randarra..hanumanthundi chupistha meeku antuu thana baadha lonu anadanni vethiki pattukoni,ma andariki panchuthu,adenti ala antunnaru antuu prasninchina nalanti agnanulaku,thappadani telisinappudu manaspurthi gaa sweekarinchatame anandame picchi danaa antuu … Brathakataniki,jeevinchataniki madhya unna sunnitha vaythyasanni sunisitham ga teliyacheppina na menattha Sri.Maatha Sukhavaani gaariki , udatha bakthigaa naa ee kadanu ankithamisthunnanu

Monday, February 19, 2007

ఆనంద తృష్ణ

తెల్లటి పుచ్చపూవు లాంటి వెన్నెలలొ చల్లటి పిల్లగాలుల తాకిడికి ఉయ్యాల ఊగుతునట్టుగా అటు ఇటు కదులుతున్న మల్లె తీగల నడుమ నుంచి తొంగి తొంగి చూస్తునాడు చందమామ,మల్లె పందరి నీడలొ..యమునా తటిలొ నల్లనయ్య కయ్ ఎదురుచుస్తున్న రాధిక లాగా ,తెల్లటి నవారు మంచం మీద పడుకొని రాధకు నీవేరా ప్రాణం ఈ రాధకు నీవేరా ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం ప్రేమకు దేవాలయం అంటు శ్రావ్యంగా పాడుతొంది సుధీర, పక్కనే రొట్లొ గొరింతాకు రుబ్బుతున్న సుధీర తల్లి పద్మావతమ్మ గారు, ఏమే సుధీర అలా పాటలతో కృష్ణుడి మీద ప్రేమ కురిపించటమేన, ఆ మల్లె తీగ కింద అలా పడుకొకపొతే,కాస్త ఆ మల్లెలు మాల కట్టి ఆ నల్లనయ్య మెడలొ వెయచ్చుగదటె అన్నది.
ఊలు దారలతో మెడకు ఉరి బిగించి,గుండెల్లొ సూదులుతో గ్రుచ్చి కూర్చి దండ చేసి, ఆ పూల ఆత్మ ఘొష నడుమ నా కిట్టిగాడికి మాల వేయమంటావా అమ్మా,పువ్వు చెట్టున ఉంటెనె దానికి అందం మనకు ఆనందం ఎమంటావు అంటూ వెనుకగా వెళ్ళి తల్లి మెడ చుట్టు చేతులు వేసి వెనకగా కూర్చుంది సుధీర. అబ్బబ్బా ఈ కృష్ణపక్షాలు,పుష్పవిలాపలు చదివి చదివి మరె పయ్ త్యం పెరిగిపొతొందే నీకు అంటు ప్రేమగా విసుక్కుంది పద్మావతమ్మ. అయ్యో పిచ్చి అమ్మా దాన్ని భావుకత అనాలి అంటూ తల్లి కి ముద్ధు పెట్టి చేతిలోని గొరింతాకును తీసుకొని చేతిలో చుక్క పెట్టుకుంటూ లొపలికి వెళ్ళిపొతున్న తల్లిని చుస్తూ నవ్వుకుంది సుధీర
బోగి మంటల పొగలు దట్టంగా అలుముకుంటున్న వేళ,పక్షుల కిలకిల రావాలు అమ్రుతగానమయ్ వినపడుతున్న వేళ,పాల కుండలతొ గొల్లలు ఎదురువస్తుండగా,పచ్చటి ప్రకృతిని నిలువెల్లా తడిపేసిన మంచు బిందువుల నడుమ,ఎర్రగా పండిన గొరింత పారాణి అయ మెరుస్తున్న పాదాలతొ,గల్లు గల్లు మంటున్న కాలి అందెలతో గడ్డి మీద అడుగులు వేసుకుంటూ చేతిలొ ముగ్గు డబ్బాతొ ముంగిట్లొకి నడిచింది సుధీర.సంక్రాంతి ముగ్గు వేసి దాని మీద గొబ్బెమ్మ పెట్టి,దాని మీద గుమ్మడి పూవు పెట్టి,చెక్కిలికి చేయి ఆనించి ముగ్గు వేపే చూస్తూ మురిసిపొతుండగా కాళ్ళకి సూదులు గుర్చుకునట్టు గా అనిపించి కిందకి చూసింది,మెత్తటి గడ్డిలొనుంచి తన పాదాల గొరింత ని చూసి మయమరిచిపొయి తన అడుగుల్లొ అడుగు వేసుకుంటూ తన వెంటే వచ్చేసిన ఎర్ర చీమలు,ఒక్క అంగలో దూకి లొపలికి పరిగెత్తింది సుధీర,పరుగులొ గల్లు గల్లు మంటున్న తన కాలి పట్టీలు చుస్తుంటే సుధీరకు తన ప్రాణ స్నేహితురాలు కల్పన గుర్తుకువచ్చింది,ఆ పట్టీలు ఎంటే అరచేయి మందాన అంత వెడల్పుగా,చక్కగా సన్నగా చిన్న మువ్వులున్నవి పెట్టుకొక,పయ గా గల్లు గల్లు అంటు అదేదో గంగిరెద్దు మెడలొ మొగే గంటలాగ,అసలు నీ వాలకం ఎంటే,పెద్ద బొట్టు దానికింద మీ రాముల వారి కుంకుమ,చేతినిండా కాశి దారాలు,ఎప్పుడు చూసినా లంగా వోణీలు,ఎల్లప్పుడు నీ చేతిలొ పండే గొరింట,అసలు నీ పేరు మంగళ గౌరి అని పెట్టాల్సింది పొరపాటున సుధీర అని పెట్టారు,గ్రుహినిగా స్థిరపడిపొవాల్సిన నిన్ను ఉద్యొగం చెయ్యమంటూ వదిలేసారు,ఎమన్నా అంటే భావుకత భావుకత అంటావు,చందమామ కధలు భేతాళ కధలు విన్నాను కాని ఈ భావుకత ఎంటే నాకస్సలు అర్ధం కాదు అంటూ విసుక్కునే కల్పన అమాయకత్వం గుర్తుకువచ్చి నవ్వుకుంటూ నిల్చుండిపొయిన సుధీర,ఏమిటే పట్టపగలు ఆ పరధ్యానం,వచ్చి ఇంట్లొ పని చూడు అంటున్న తల్లి పిలుపుకి ఉల్లికిపడి చూసింది,ఒక్క ఉదుటున తల్లి దగ్గరకు వెళ్ళి,అమ్మ రాముడి కంటే నేనే అద్రుష్టవంతురాలిని,ఎలా అంటావేమో,రాముడికి వాళ్ళ అమ్మ అద్దంలొ చూపించిదట చంద్రుడిని కాని మా అమ్మ ఏకంగా నా గుప్పెట్టలోకే తెచ్చేసింది సూర్యుడిని అంటూ ఎర్రగా పండిన అరచేతిని చుపించింది తల్లికి.
సర్లే ఈ మటలకేం కాని వెళ్ళి త్వరగా తయారవ్వు ఆ పెళ్ళి వాళ్ళు బయలుదేరేఉంటారు అంటూ తొందరపెడుతున్న తల్లితో,అబ్బా,అమ్మా ఎదో ఒకటి మీరే చూసి కానిచేయమని ఇంతకమునుపే చెప్పా కదా మళ్ళి ఎమిటిదంతా అంటూ తన చిరాకును ప్రదర్సించనారంభించింది.అలా అంటే ఎలానే వెళ్ళు త్వరగా అంటున్న పద్మావతమ్మ గారి మాటలువిని ఎంటట ఎమంటొంది అని వినిపించింది ఒక గొంతుక,విశ్వామిత్రుడిలొని కొపం,ధర్మరాజు లొని నిజాయతి,శ్రీకృష్ణదేవరాయలు లొని గాంభీర్యం కలగలిపిన మహొన్నత వ్యక్తిత్వం అని సుధీర ఎప్పుడూ గర్వించే తన తండ్రి సుధాకరరావు గారి గొంతు అది.ఏబ్బే ఎంలేదు నాన్నగారు,ఇదిగో వెళ్తున్నా అంటూ మేడ మీద తన గదిలొకి వెళ్ళిపొయింది సుధీర, ఛా ఎంటి నాన్నగారు పెళ్ళి పెళ్ళి అంటూ నా ప్రాణాలు తోడేస్తున్నారు,అబ్బాయిలా అన్నా పుట్టాను కాదు ఆజన్మాంతం అస్కలిత బ్రహ్మచారిగా మిగిలిపొదును అని వాపొతూ,మనసు మార్చుకొటానికి సంగీతానికి
పని చెప్పింది,మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డొలలూగెనే అంటూ సన్నగా వస్తున్న భానుమతి గారి గొంతు వింటుంటే ఎక్కడలేని ప్రశాంతత,కళ్ళు మూసుకొని అలా వెనుకగా వాలి కుర్చిలో కుర్చున్న సుధీరకు క్రిష్ణశాస్త్రి గారి సాహిత్యం వింటుంటె చాలా హాయిగా అనిపించింది,శాస్త్రిగారి కవితలు ఒక్కొక్కటిగా జ్ఞప్తికివచ్చాయి
"సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంభు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు?గాడ్పేల విసురు?
ఏల న హృదయం ప్రేమించు నిన్ను?"
ఆహా ఎంత చక్కటి ఊహ,ఎలా అయనా గుండెలొతుల్లో నుంచి పొంగి వచ్చే ప్రేమాద్రత భావనాబలం ఆయన కలానికి గొప్ప కళ అనుకుంటూ సంగీతం వింటూ మయమరిచిపొతున్న సుధీర అలొచనలకు అద్దుకట్ట వేస్తూ వినిపించింది పద్మావతమ్మ గారి గొంతు.ఎమేవ్ సుధీర కిందకిరా వళ్ళు వచ్చెసారు అంటూ,కిందకి వెళ్ళిన సుధీరచేతికి కాఫీ ట్రే ఇచ్చి ముందుగదిలొకి పంపింది పద్మావతమ్మ,వచ్చిన అతిధులకు కాఫీ అందిస్తూ ముందుకు నదిచింది సుధీర,"వద్దండి నాకు కాఫీ తాగే అలవాటు లేదు"అంటూ సున్నితంగా తిరస్కరించాడు కార్తీక్,కళ్ళు పయ్ కి ఎత్తి చూడబోయి చూడకుండానే ఆగిపొయింది,చట్టుక్కున కళ్ళు కిందకు దించేసింది,తన స్నెహితురాలు కల్పన మాటలు గుర్తుకువచ్చాయి,కల్పన ఆ అర్ధచంద్రుడిని చుస్తే నీకు ఎమీనిపిస్తొందే?ఏమోనమ్మా నాకు మాత్రం సగం కొరికేసిన అప్పడము ముక్కలాగ ఉంది,అయనా చక్కగా లొపల ఫ్యాను వేసుకొని పడుకుందామే అంటె

Paper meeda aythe poorthi chesanu kaani, net loki update cheyyaledhu.. Twaralone chesthanu.. antharayaniki chinthisthunnam ( ;) ma dd1 paribbashaloo)