Thursday, April 19, 2007

అవ్యాజమైన ప్రేమ






అది అయొధ్యాపురము...

శ్రీరామ పట్టాభిషేకం పుర్తి అయిన పదవ రొజు....

మామిడి చెట్టు చిటారు కొమ్మన కూర్చొని దీర్గాలొచనలో పడ్డాడు మర్కటమకుటం...
దిగులు గా..దిగాలు గా ఉన్నాడు..

కుర్చున్నవాడు కుర్చోక..ఒక్క ఉదుటున కిందకు దూకి...ఉద్యానవనం దాటి..రాజప్రాసాదానికి వెడలాడు....
కళ్ళు విప్పార్చి...ప్రాసాదమంతా కలయచుసాడు..

ఎడీ?? కనపడడే????.....
నా రాముడు..
శ్రీరామచంద్రుడు...
ఎక్కడున్నాడు????
నీలిమేఘశ్యాముడు..
అందాల రాముడు...
అనుకుంటూ..... అటు ఇటు పరిగెత్తాడు..

ఉహు..లాభం లేదు..ఇక్కడెక్కడా లేడు నా రాముడు..ఎక్కడికి వెల్లుంటాడు....ఇంకెక్కడికిలే...సీతమ్మ వారి కడకే వెళ్ళి ఉంటాడు...అనుకుంటూ....జనకీ జనని ధరనీ మాత ను తెరిపార చుసుకుంటూ...అడుగులో అడుగువేస్తూ ఉద్యానవనంలోకి వెళ్ళిపొయాడు...

హనుమంతుడి జన్మ కారనమే భక్తి,జ్ణానము..ఆ జ్ణానము ఎప్పుడో సముపార్జించేసాడు..ఇక భక్తి...రామనామ రూపేణ...ఆర్జిస్తూనే ఉన్నాడు...
రాముడి కోసం బాల్యం నుంచి వేచి చూసి చూసి...కడకు ఒక నాడు ఒక మూషికపర్వతమునందు రాముడ్ని కలుసుకున్నాడు....


ఇక ఆ నాటి నుండి ఈ నాటి వరకు..రాముడి చెంత చేరి,బొలుడన్ని మాటలు,పాటలు,ఆటలు,వేడుకలు చేసేసి..బ్రహ్మస్రుష్థిలో ఉన్న అనందాన్నతటిని తన వడిలో వేసేసుకొవాలని ఆరాట పడి పొయాడు...
కాని సీతమ్మ విరహములో కొన్నాళ్ళు...
రావణుడి వధలో మరిక్కొన్నాళ్ళు...
రాముడు హనుమంతుడ్ని కాసింత నిర్లక్ష్యం చేసాడని హనుమంతుడి ఆవేదన....
సీతమ్మ వారు లేని భాధ ముందు తన ఆవేదన ఏమంత నిలువలేదు..
ముందు ఏలా అయినా సీతమ్మని తీసుకొచ్చేసుకొవాలి అనుకున్నాడు
నా రాముడికి సీతమ్మను తెచ్చిపెట్టడంలో సాయం చేస్తే..ఇక నా రాముడు కష్టాలు తీరుతాయి...నన్ను పట్టించుకునే తీరికా వస్తుంది నా స్వామికి..అనుకొని...
కొతి మూకనంతటిని తొడ్కొని బొయి..రామచంద్రునితో బాటు గా...ఆయిన పక్కనే ఉండి....
వారధి కట్టె..
రావణుడిని కొట్టె..
సీతమ్మను తెచ్చే...

పట్తాభిషేక శుభసంధర్భాన..సీతమ్మ ఇచ్చిన ముత్యాల దండ కుడా హనుమంతుడికి అనందాన్ని ఇవ్వలేదు సరికదా.... ఆ దండ అంతటిని పీకి పీకి నేల పాలు చేసేసాడు... ఎంటయ్య అంటే...ఎడి ఇందులో నా రాముడేడి....రాముడి లేనిదేది నాకు లాస్యము కానేరదు.....అంటూ బుంగమూతి పెట్టెసాడు....
కూర్చున్న చొట నుండి...కనపడే వేప చెట్టు మీదకు దూకాడు...తోక అంతా ఒక చొటకి తెచ్చి తలగడ చేస్కొని నడుము వాల్చి..అలొచించనారంభించాడు...
"ఎమైంది నా రామయ్య కు...
నా ఆంతర్యం అవగతమవ్వలేదా...
లొకాభిరాముడు...సర్వాంతర్యామి..సర్వం ఎరిగినవాడు...ఆయనకి అర్ధం కాకపొవటమెమిటి నా పిచ్చి కాకపొతేను...మర్కటాన్ని కదా..మందబుద్ధి ని..చ చ..నా రాముడికి తెలియకపొవటమా
ప్రశ్నే లేదు ..తెలుసు తెలుసు..ఆయినకి అంతా తెలుసు..మరి ఆయిన నన్ను ఎందులకు పట్టించుకొవట్లెదు..గత పది దినముల నుండి ఆ సీతమ్మ వారి కొంగు విడువకుండా తిరుగుచున్నాడు...ఆ సీతమ్మ వారి దగ్గర ఉన్నది ఎమి...నా దగ్గర లేనిది ఏమి...ఈ మర్మమేమిటో కాసింత తెలుసుకోవలసిందే..."
ఆలొచన వచ్చిందే తడవుగా...కిందకు దూకి..సీతమ్మ వారి అంతహపురానికి పరుగు తీసాడు...
"సీతమ్మ...
అందాల సీతమ్మ...
స్త్రీ జాతికే ఆదర్స ప్రాయం ఆమె ఓర్పు...
రావణుడి చెరలో చూపించిన ఓర్పు.....
రాముడి రాకకై ఎదురుచుసిన ఓర్పు....
ఇప్పుడు కుడా అదే ఓర్పుతో...దారనికి ఉన్న వీడి రాని చిక్కు ముడి ని తీసె ప్రయత్నం చేస్తోంది...."
హనుమంతుదిని చుడగానే...
రావయ్యా హనుమా...
ఎమి ఈ నడుమ బొత్తిగా నల్లపుస వైనావు..అంటూ మాత్రు వాత్సల్యంతో పలుకరించింది
సూటిగా విషయనికొచ్చేస్తూ హనుమ...
సీతమ్మ వారి పాదాల కడ కూర్చొని..
"అమ్మా సీతమ్మ తల్లి...నా రాముడు ఎప్పుడూ నీ కొంగు వీడకుండా తిరుగుచున్నాడు..
నీ కడ ఉన్నదేమి..
నా కడ లేనిదేమి...
చెప్పరాదు తల్లీ.."
అంతూ ప్రశ్నించాడు....

వెంటనే సీతమ్మ తల్లి నవ్వుతూ "తన కుడి చేతి చూపుడు వేలును..తన నుదుటిన ఉన్న సింధురాని వైపు చూపిస్తూ...ఇదిగో దీని మహిమ ఇదంతా" అన్నది..
కట్టుకున్నవాడు కదా.....ఆ వివహ భంధం..ఆ భార్యాబర్తల అనుభంధం అట్టిది...ఇది అంతయు...మా వివహ బంధ బలము నాయినా..అని ఆవిడ భావం
సీతమ్మ వారి ఆంతర్యం తెలుసుకొక...హనుమ....
"ఒహొ సీతమ్మ వారి నుదుట సింధురమా నా రామునిని అకర్షించుచున్నది...
నుదుటిన ఉన్న ఆ చిన్న సింధురపు రేఖ కే అంత మయ్మరచిపొయి..నన్ను మరచి ..సీతమ్మ వెంట తిరుగుచున్నాడు గా నా శ్రిరామచంద్రుడు...
మరి నేను వంటి నిండా సింధూరము పూసుకొనినిన యెడల...ఇక నన్ను వీడి పొజాలడు..."అనుకుంటూ
వెళ్ళి వంటి నిండా సింధురము పులుముకొని..ఒక్క గెంతులో రాముడిని సమీపించి..
ఇదిగో శ్రిరామ చూడు నన్ను... అంటూ ఎగరనారంభించాడు...ఆ ఎగురుడు ఎంతయనను జాతి లక్షణము కదా
రాముడు..
నీలిమెఘశ్యాముడు...
కొదండరాముడు..
కమనీయధాముడు..
.హనుమంతుని ఆంతర్యం....
ఆ భక్తశిఖామణి ప్రేమను అర్ధం చేస్కొని...
హనుమా...చాల అందంగా ఉన్నావు..ఇటులనే నిత్య సింధూరసొభితుడవయి..నీ భక్తుల చేత పూజలందుకో...అంటూ దీవించాదు"

అంతటి అవ్యాజ్యమైన ప్రేమ ఆ రామ హనుమలది....ప్రేమకు...అది తెచ్చే అక్కసు కు...భగవంతులు కూడా అతీతులు కారు కాబోలు....

NOTE:

This story is not an imagination or my creation but its there in epics is what i was told by my Mother. She used to tell this story to me...And i added a bit of Spice to make this look a bit intresting.So please dont be in a illusion that its a creation...If any wanna proofs for this story..OOPS!!! sorry i cant..I believe in my MOTHER...so i believed...If u wanna believe believe...

11 comments:

Surya Naga Bhushan said...

jagadabhi raamudu sree raamude.... inakula somudu aa raamude...
ahaa chaalaa rojulaku chakkati puraana katha chadivaanu...
chinnappati numchi hanuman temple ki velli nappudallaaa swami vaariki ee simdhooram emduku shareeram nimdugaa umtumdi ani doubt vochhedi...
kaanee evvarini adagaledu...
aa doubt clear kaanuledu...
alaage manasu porallo nikshiptam ayyi umdipoyimdi...
eenni rojula tarwaata ee katha chadivinappudu vishayam telisi...
okkasaarigaaa ollu pulakarimchimdi.
enni rojula naaa samdehaaaniki ee roju samaadhaanam labimchimdi ani aanamdam tho tabbubbi ayyipoyyaaanu..
Entha chakkati kathanu... marimtha ramyam gaa cheppinaaa srujana madam gaariki hats-off..
elaamti aasakti karam gaaa umde kathalu meeru marinni raayaalani.... meeku sadaaaa aa hanuma aaseerwaadalu umdaalani manasaaraa korukumtunnaa...
- meee chiru abhimaani...

Unknown said...

Srujana ee concept nijanga puranalallo vunnadane chala bagundhi eppudu vinaledhu Ramamyanam lo ilanti oka sangatana vunnadhi ani oka vela idi mee creativity ayithe it's a good piece ilanti kadhalu rayandi inka chala baguntundhi

Srujana said...

@surya naga bhushan

Mee ee prodbalaniki na dhanyavaadaalu....

@Neelima
idi naa creativity entha mathramu kaadhu...evaro peddalu cheppaagaa vinnadhi..kasintha srujanathmakatha jodinchi...naku chethanaynathalo andarike cheppe praythnam chesanu anthe....

Anonymous said...

chala bavunde.nijam chebutunna. naku nijam ga teliyadu ee story. enduku sindhooram rastaru ani doubt kooda eppudu raledu.enduko mari.chala sarlu gudiki velli untanu kada.anyway nee valla oka kotta vishyam telisindi.thanks. thanks a lot.

Unknown said...

nenu eppudu ee story vinaledhu..chaala bagundhi...naaku chinnappudu doubt vachedhi...hanumanthudi gudlo ayana motham orange colour bottutho enduku vuntadoo ani...daaniki answer edhigoo ippudu dorikindhi...nice story..

Anonymous said...

Good one. Chinna story ni chakkaga chepparu. Keep it up!!!

Waiting for Medipandu telugu version....

KK

Anonymous said...

Good One.
I never knew this. Good narration.

కొత్త పాళీ said...

తియ్యగానూ, చమత్ 'కారం'గానూ బాగుంది.
ఒక మాట - "వ్యాజ్యం" అంటే కోర్టుకేసు. మీకు కావలసిన మాట "అవ్యాజం"
వ్యాజం అంటే కారణం. అవ్యాజం అంటే కారణం లేకపోవడం. అవ్యాజమైన ప్రేమ అంటే ఏమీ కారణం లేకుండానే పుట్టే ప్రేమ అని. దయచేసి టైటిలు మార్చగలరు.

Gowri Shankar Sambatur said...

మీ బ్లాగును తేనెగూడు లో చేర్చాను. తేనెగూడు ఏమిటి అనుకుంటున్నరా - ఇక్కడ చూడంది.
www.thenegoodu.com

ఇట్లు
గౌరి శంకర్

Anonymous said...

మొదటిసారి మీ బ్లాగు చూస్తున్నాను. చాలా బాగా రాశారు. దయచేసి మరోలా భావించొద్దు. చాలా అక్షరదోషాలు ఉన్నాయి. మీరు చెప్పే మంచి విషయానికి తోడుగా ఆ తప్పులు లేకపోతే ఇంకా బాగుంటుంది.

Author said...

Hai, ur work is nice, but there are many errors in telugu text.

Thank you