Monday, April 2, 2007

మేడిపండు

అమ్మా నాన్నా జానకి అందరూ రండి త్వరగా త్వరగా అంటూ పరిగెత్తుకుంటూ లొపలకి వచ్చి నట్టింట్లో నిలబడి చేతిలో ఉన్న పుస్తకం వైపే చూస్తూ ఆనంద తాండవం చేస్తున్నాడు విజయ్ శేఖర్,పూజాగ్రుహమునందు భగవంతుడి ముందు కైమోడ్చి నిల్చొని మంత్రపుష్పం చదువుతూ ఉన్న విజయ్ తల్లి సుమతి,కొడుకు గొంతు విని పరుగులాంటి నడకతో బైటకి వచ్చారు,లొపల ముల్లపూడి వెంకట రమణ గారు రాసిన భాగవత కధలు చదువుతూ కూర్చున్న రామక్రిష్ణ గారు కొడుకు పొలికేక విన్నా,ఆ భాగవత కధామృతాన్ని ఆస్వాదిస్తూ మధ్యలో లేవటానికి మనస్కరించక లొపలే కుర్చుండిపొయారు.తన పిలుపు విని వచ్చిన తల్లిని చెల్లిని చూస్తూ నాన్న ఏరి,త్వరగా రమ్మను అమ్మా అంటూ తల్లిని తొందరపెట్టసాగాడు .తన అనందాన్ని తన వాళ్ళతో పంచుకొవాలన్న తపన అంతటిని దాచుకోలేకున్నాడు విజయ్. అదే పనిగా నాన్నా నాన్నా అంటూ పిలుస్తున్న కొడుకు పిలుపులకి ఇక తప్పేలా లేదు,ఒక సారి పొయి వస్తేగాని వీడి గొల ఆగదు అనుకుంటూ మెల్లగా పడకుర్చీలో నుంచి లేచి బైటకు వచ్చారు రామక్రిష్ణ గారు. విజయ్ వంక చూస్తూ.. "ఆ ఏరా బడుద్ధాయి,ఎంటి ఆ హడావిడి అంటూ ప్రశ్నించారు" తండ్రి మాటలకి ఒకింత గర్వం,ఒకింత అనందం ఒకింత అశ్చెర్యం కలగలిపిన చూపుతో తండ్రి వంక చూస్తూ,అతని చేతిలో ఆ నాడే మర్కెట్లోకి వచ్చిన మాసపత్రికను పెట్టాడు,కొడుకు వాలకం అర్ధం కాక,కాస్త సందేహం గా ఆ పత్రికను తిరగేసారు రామక్రిష్ణ గారు,లోపల తాటికాయంతటి అక్షరాలతో ప్రచురితమైన వార్తను చూపిస్థూ,బిగ్గరగా చడవండి నాన్న గారు అన్నాడు విజయ్,కళ్ళజొడు సరిచేసుకుంటూ చదివారు రమక్రిష్ణ గారు,"ఉగాది కధల పోటీలలోమొదటి బహుమతి సంపాదించుకున్న కధ "గంగా ప్రవాహం" రచయిత శ్రీ విజయ్ శేఖర్ గారికి మా స్పూర్తి మాసపత్రిక వారి హార్ధిక శుభాకంక్షలు.కొడుకు వ్రుద్ధిలోకివస్థున్నాడనటానికి ఇది సంకేతం అని తెలిసినా పొగిడి పాడుచేయబుద్ధేయక మిన్నుకుండిపొయారు రామక్రిష్ణ గారు,కాని సుమతిది తల్లి మనసుగా వెంటనే లొపలకి పరుగెత్తుకెళ్ళి పంచదార తెచ్చి కొడుకు నోటిలొ పొస్తూ,నా తండ్రే నా నాయనే,నేను చెప్పలేదుటండి వీడెప్పుడో పెద్ద రచయత అయిపొతాడని అంటూ కొడుకుని చుస్తూ మురిసిపొయింది.ఏదో అలోచిస్తూ నిల్చున్న విజయ్ చెల్లెలు జానకి,అన్నయ్య వంక చూస్తూ,అన్నయ్యా ఐతే వాళ్ళు ముందుగా ప్రచురించిన దాని ప్రకారం ఈ కధల పొటిలో గెలుపొందిన వారికి ప్రముఖ రచయత వేదాంతం పద్మనాభ శాస్త్రి గారితో రెండు రొజులు గడిపే అవకాడం ఇస్తారు కదా అంటూ అడిగింది."ఔను అందుకేగా మరి నా ఈ సంబరం,లేకపొతే ఇంతకముందేన్నడూ నా కధలకు బహుమతి రాలేదా,లేక పత్రికల్లో ప్రచురితమవ్వలేదా" అంటూ జానకి తల మీద మొట్టికాయ వేస్తూ,లోపలకి వెళ్ళిపోతున్న తన తండ్రిని అనుసరించాడు విజయ్.మళ్ళీ యధాతధం గా పడకుర్చీలో పడుకొని భాగవత కధలు చదవటంలో నిమగ్నమయ్యె ప్రయత్నం చెయ్యసాగారు రామక్రిష్ణ గారు,తన పక్కనే కూర్చున్న కొడుకు వాలకం ఒక కంట కనిపెడుతునే ఉన్న ఆయినకు విజయ్ ఆంతర్యం అర్ధమౌతూనే ఉంది,ఇప్పుడు వాడు ఆ రచయిత తో పాటురెండు రొజులు గడపాలి అది కూడా అతని ఇంటికి వెళ్ళి,దానికి తన అనుమతి కావాలి,అడాగాలని ఉన్నా తను వద్దని అంటానేమో అనే సందేహం అడుగనీయకుండా అడ్డుపడుతోంది,ఇరవయ్ మూడేళ్ళనుంచి చూస్థునాడు తన కొడుకుని ఆ మాత్రం అర్ధంచేసుకోలేరా..... వేలుపట్టి నడిపించిన రొజుల్లో ఊతమయి,ఆటలడే వయసులో బొమ్మ అయ్యి,స్నేహితులే లోకం అయ్యే సమయంలో తాను కుడా ఒక స్నేహితుడయ్యి కొడుకు ఎదుగుదలలో ప్రతి క్షణం ప్రతి నిముషం వెన్నంటి ఉన్నారు రామక్రిష్ణ గారు. అభ్యుధయ భావలు గల మనిషి,కొడుకు చెప్పే ప్రతి మాటను పూర్తిగా వినటం,వాడు చేస్తా అన్న ఏ పనిని ఆపకపొవటం అలవర్చుకున్నరు, ఎందుకంటే మంచేదో చెడెదో గుర్తించకలిగిన శక్తిని ఉగ్గుపాలతో అలవర్చారు ఆయిన.తెలుగు పండితుడు అయిన రామక్రిష్ణ గారు వ్రుత్తిరిత్యా బ్యాంక్ ఉద్యోగి అయినా,ప్రవ్రుత్తి రిత్యా రచయత మంచి సాహితీవేత్త,పండిత పుత్ర పరమ సుంట అనే ఆర్యొక్తినీ తిరగరాసే ప్రయ్త్నమేమన్నా చేయాలి అని ఆయిన ఎప్పుడూ అనుకునేవారు ,తన కొడుకు చందమామ పుస్తకాలు వీడికి మంచి సాహిత్యాభిరుచిని పెంచాలి అనుకునే వారు,కాని ఒకళ్ళు పెంచితే పెరిగేదా అభిరుచి,అది అంతర్గతం గా జనించి నవనాడుల్లోను నిలిచిపొవల్సినదే.కాగల కార్యం గంధర్వులే చేస్తారు అన్నట్టు,తన అలోచనలను ఊహలను నిజం చెస్తూ,సహజ సాహిత్యాభిలషతో పెరిగాడు విజయ్,పుస్తకం చుసినప్పుడు అతని కళ్ళళో కదలాడే ఆనందం,దానిని త్వరగా చదివెయ్యలనే అతని తపన చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నారు రమక్రిష్ణ గారు,నెలారంభమలో జీతం వచ్చిన వెంటనే బజారుకు తన ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకెళ్ళెవాళ్ళు ఆయిన,మీకేం కావలో కొనుకొండర్రా,కాని చెరి పది రూపాయలు మాత్రమే అనేవారు,జానకి వెంటనె జడపిన్నీసులు,రంగు రిబ్బన్లు,ఇంకా బొల్దన్ని చాక్లెట్లు,బొమ్మల చిట్టా చెప్పేసెది ఆపకుండా,కాని విజయ్... నాన్న గారు నాకు చందమామ పుస్తకం కావాలి అని అడిగేవాడు,మూడు రూపాయలే రా అది,మిగిలిన యేడు రూపాయలకి ఇంకేమన్న కొనుక్కొ రా అని కొడుకుతో అంటూనే లొలొపల,వీడు మరొక పుస్తకమేమన్నా అడిగితే బాగుండును అని అనుకునేవారు,తన తండ్రి ఆంతర్యం అవగతమయ్యో,లేక తండ్రి రక్తంలో నుంచి ప్రవహించి తనలోకి ప్రవేశించిన ఆ సాహిత్యభిరుచో ,ఈ రెంటిలో దేని ప్రొద్భలమో తెలియదు కాని,వెంటనే ఆ యేడు రూపాయలకి ఇంకేదన్న పుస్తకం కొనండి నాన్నగారు,సిందుబాద్ యాత్రలో లేక ట్వింకిలో అంటూ తండ్రి వైపు ఆత్రం గా చూసేవాడు. విజయ్ చిన్నతనంలో అతను ఏమి పుస్తకం చదవాలో రామక్రిష్ణ గారె నిర్ణయించి ఇచ్చేవారు ,కాని వయసు పెరుగుతున్న కొద్దీ,మెల్లగా గ్రంధాలయలకి అలవాటు పడ్డడు విజయ్, గుంటూర్లో ఉన్న దాదాపు అన్ని గ్రంధలయాల ద్వారముఖాలు తనని గుర్థుపట్టెస్తాయి,అడపదడప కధలు రాసి పత్రికలకి పంపేవాడు,కవితలు కూడా రాసేవాడు,వక్తత్వ,వ్యాసరచన పోటిలలో పాల్గొనేవాడు,ఎక్కడికి వెళ్ళినా విజయం అతనిదే,సార్ధక నామదెయుడు కదా మరి,ఒక మారు షీల్ద్లు బహుకరిస్తే మరొకమారు పైకమే ఇచ్చేవారు బహుమానం గా,ఇక ఆ పైకం పట్టుకొని "విశాలంద్ర బుక్ హౌసె" కి పరుగుతీసెవాడు,మంచి తెలుగు పుస్తకానికి మేలైన భండాగారం ఈ విశాలంద్ర అంటూ ఉంటాడు ఎప్పుడూ
అలా అలా మొత్తానికి ఎన్నో పుస్తకాలను సంపాదించాడు.వయసుతో పాటు అతని గ్రంధాలయం కూడా దినదినాభివ్రుద్ధి చెందుతూ వచ్చింది,తన ప్రతి పుట్టినరొజుకి వయసు లెక్కించింకపొయిన,బారులు తీరిన తన పుస్తకసంపదను మాత్రం తప్పక లెక్కవేసుకునేవాడు,ఒకొక్క నాడు అయితే ఆ పుస్తకాల అర ముందు అలానే నిల్చొన్ని గంటలతరబడి అలానే వాటి వైపే చుస్తూ ,తను ఎంతటి కోటీస్వరుడినో అనుకొని మురిసిపొయేవాడు,పుస్తకాన్ని తాకి చూసి ఆనందించేవాడు,ఇంకా పట్టలేని పారవస్యం పెల్లుబికినపుడు,తన చెల్లెలు జానకిని కూడా లాకొచ్చి తన పుస్తకాలను చూపిస్తూ,చూడు జానకి ఎంత బాగుందో నా పుస్తకల అర ,అలా ఒకదానిపక్కన ఒకటి బారులు తీరి,ఆకరలు వారి గా,ఎత్తుల వారి గా నిల్చొని ఉంటె ఎంత ముచ్చట గా ఉందో,ఇంతకుమించిన ఆనందం ఎముంటుంది గనుక అంటూ పుస్తకమంటేనే పారిపొయే జానకిని బలవనతంగా కూర్చోబెట్టి తనకు నచ్చిన పుస్తకాలనుంచి తను బాగా మెచ్చిన కొన్ని పదాలను,చిన్నపాటి కధలను చదివి వినిపించెవాడు,చివరకి జానకికి సొష వచ్చి పడిపొవలసిండే కాని తను
మాత్రం ఆపేవాడు కాదు.తను ఎంతగానో అభిమానించే వేదాంతం పద్మనాభసాస్తృయ్ గారి రచనలకు మాత్రం తన గ్రందాలయంలో ప్రతెయేకించి ఒక అరను ఎర్పరిచాడు,అన్నయ్యా ఎండుకు అల ఆ పుస్తకాలు మాత్రం విడిగా పైన పెడతావు,వాటిని కూడా వీటితో కలపవచ్చు కదా అని అడిగే జానకికి,లేదమ్మా ఈ పుస్తకాలు నా అభిమాన రచయిత పద్మనాభం గారు రాసినవి,ఆయిన నా ద్రుష్తిలో దేవుడు,దేవుడి స్థానం ఎప్పుడూ ప్రథ్యేకమే మరి,కొందరు భక్థిరసం బాగా పలికించగలరు,కొందరు శ్రుంగారరసాన్ని అద్భుతంగా చూపించగలరు,మరికొండరు హాస్యాన్ని బహు చక్కగ పండిచగలరు,ఇంకొందరు కవితలను వేరొకరు రాజకీయాలను,ఇలా ఒక్కొక్కరు ఒకొక్క దాని గురించి రాయటంలో ఆరితేరిన వారు,కాని నేను ఇప్పుడు చెప్పిన ఈ రసాలన్నిటిని అవలీలగా అలవోకగా రచించగలిగిన ఒకేఒక్క మనిషి మా పద్మనాభం గారు,ఆయిన నిజం గా సాహితీదైవం నాకు,ఆయిన సాహితీ మేదోసంపత్థి కి ఎంతటి వారలయినా పాదక్రాంతులవ్వవలసిందే అంటూ చెప్పుకోచ్చేవాడు. పద్మనాభం గారికి సంబందించిన సమాచారాన్ని అంథటిని సేకరించి భద్రపరచుకునేవాడు,తన మదిలోను,గదిలోను.ఆయిన ఎక్కడన్నా ఉపన్యిస్థున్నారు అని వింటే చాలు ఇక పరుగుతీసేవాడు,అంతటి వీరాభిమాని,ఆయిన సాహితీప్రస్థానాన్ని అలగే ఎప్పటికీ సాగించాలని అనుకునే సాహిత్య పిపాసి విజయ్. ఇప్పుడు ఇన్నాళ్ళకి తన దేవుడితో ప్రత్యక్షంగా రేండు రోజులు గడిపే అవకాసం వచ్చింది,ఇక ఇంతకు మించి ఏది కావలనుకోలేదు విజయ్,అతని జీవితంలో అదే తనకున్న ఒక్కగానొక్క కోరిక,దేవుడే దిగి వచ్చి వరమిచ్చినట్టుగా ఉండి విజయ్ కు,కాని తండ్రి ఒప్పుకొవాలిగా,వయసు తనలో ఎంతో మార్పును తెచ్చినా,తండ్రి అనుమతి లేకుండా ఏది చెయ్యని అలవాటు మాత్రం అలానే ఉండి పొయింది విజయ్ కు.తన మాట తంద్రి ఏ నాడు కాదు అనరని తనకు తెలిసినా..ఎక్కడో ఏ మూలో చిన్న సందేహం,చట్టుకున వద్దులే రా అన్నరంటే...అమ్మో ఆ ఊహే బరించలేకున్నాడు,ఏం చెయ్యలో ఎలా అడగాలో బొదపడక,అలాగే తంద్రి పక్కన కూర్చొని ఏదో పుస్తకం తిరగేస్థుందిపొయాడు,కొడుకు వాలకం చూస్తే మనసులో ఉన్నది అడిగేలా లేడు అనుకొని రామక్రిష్ణ గారె ముందడుగు వేసి,"అ రా ఎప్పుడు వేళ్తున్నావ్ మరి పద్మనాభం గారి దగ్గరకి అంటూ ప్రశ్నించారు"ఆ ప్రశ్నలో దాగున్న అనుమతిని గ్రహించిన విజయ్ కు ఆనందంతో కళ్ళు విప్పారాయి.వెంటనే లేచి నిల్చున్నవాడయ్ తంద్రితో,రేపే రమ్మన్నారు నాన్న గారు,రేపు పొద్దున నుంచి యెల్లుండి రాత్రి దాకా అంటే పూర్తి గా రెండు రోజులు ఆయిన దగ్గర ఉండే అవకాశం నాన్నగారు అంటూ ఆపకుండా చెప్పుక్కొచ్చడు.విజయ్ లోని పారవశ్యం గమినించి లొలొపలే నవ్వుకున్నారు రామక్రిష్ణ గారు,విజయ్ లో ఆయినకు తన యవ్వనం అగుపించింది,యవ్వనంలో ఉండాగా తను ప్రవర్తించిన తీరే ఇప్పుడు విజయ్ లొనూ.... *********************************************************************************************************
బంజారా హిల్ల్స్,హైదరాబాద్ లోని ప్రముఖులందరూ ఉండే ప్రదేశం అది,అక్కడి ఇళ్ళన్ని చూసుకుంటూ నడుస్తున్నాడు విజయ్,పద్మనాభం గారి ఇంటి ముందు ఆగాడు,లొపలకి అడుగుపెట్టడానికి ఎక్కడో చిన్న సందేహం,అలొచిస్తూ ఉండగా,ఎవరూ కావలి సాబ్ అంటూ పిలిచాడు గుర్ఖా,అతనికి వివరాలు చెప్పాడు విజయ్,లోపలకి పంపారు విజయ్ ని,లొపలకి అడుగిడి,ఇంటి లోపలకి నడిచాడు,బైట పెద్ద లాన్,మంచి ఆహ్లదకరమైన వాతావరణం,ఆ ఆహ్లాదం చుట్టురా ఉన్న ప్రకృతిదో లేక తనను చుట్టిన భావోద్వేగానిదో అర్దం కాలేదు విజయ్ కు.ముండు గది లొనే కుర్చిలో కూర్చోని కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నారు పద్మనాభం గారు.విజయ్ నమస్కారం అండి అన్నాడు,వేంటనే పేపర్లో నుంచి తల బైటకు పెట్టారు పద్మనాభం గారు,విజయ్ ని చూస్తూనే "ఆ రావయ్య రా,విజయ్ శేఖర్,"సాహితీ మేరుపర్వతం పద్మనాభం" అంటూ నన్ను పత్రికల్లో ఎడ పెడ పొగిడేసే పిల్లడివేనా నువ్వు" అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీని చూపించారు కుర్చొమనట్టు గా,పద్మనాభం గారి ముండు కూర్చునే అర్హత తనకి ఉందో లెదో అని సందేహిస్తు,"పర్లేదు లేండి అంటూ ఆయిన అహ్వనాన్ని సున్నితం గా తిరస్కరించాడు","ఎంటయ్యా రెండు రోజులు ఇలా నా ముందు నిల్చోనే ఉంటావా కూర్చో కుర్చొ అంటూ కుర్చి విజయ్ వైపు కు లాగారు" ఇక తప్పక బిడియపడుతూనే కుర్చున్నాడు విజయ్."ఆ విజయ్ శేఖర్,నా దినచర్య ను దగ్గరగా చూడాలని ఉండి అని విన్నవించుకున్నవట గా స్పూర్తి పత్రికి ఎడిటర్ గారి ముందు,కావున నీ కొరిక ప్రకారమే,ఇప్పుడు మన కార్యక్రమం ఎంటయ్యా అంటే,నాకు కొంతమంది తో మీటింగ్స్ ఉన్నాయి ఇవాళ,వాటన్నిటికి నిన్ను తీసుకువేళ్తాను,నువ్వు ఈ రెండు రోజులు నాతొనే ఉంటావు,సరే నా మరి" అని అడిగారు.అలాగే అండి తప్పకుండా వెళ్డాం అన్నడు విజయ్.సరే మరి నువ్వు కూర్చో నేను పదినిమిషళ్ళో వస్తాను బయలుదేరుదం అని లోపలికి వేళ్ళరు,చుట్టురా కలియచూసాడు విజయ్, ఎదురుగా షెల్ఫ్లో చొటు సరిపొకపొఇనా ఒకడానిపక్కన ఒకటి ఇరుక్కొని మరీ,పద్మనభం గారి సాహితీ మేదోసంపత్తి కి మేము నిదర్శనం అని చెప్తునట్టు గా ఉన్నాయి,ఆఇనకు వివిధ సందర్బాలలో వచ్చిన షైల్ద్లు,అవార్డ్లు." లేచి షెల్ఫ్ వైపు నడిచాడు విజయ్,వాటినే చూస్తూ ప్రతి షైల్ద్ మీద రాసి ఉన్న బిరుదులని చదువుతున్నాడు,ఇంతలోనే లొపలనుంచి పెద్ద సబ్దం,ఎవరో ఎవర్నో కొడుతున్న దాఖల,వెంటనే పద్మనాభం గారి గొంతు వినపడింది,"ఎన్ని సార్లు చెప్పాలే నీకు,నీకు మాటలతో చేప్తే సరిపోదే,దేబ్బ పడాల్సిందే,ఎన్ని సార్లు చెప్పను బట్టలు తీయగానే బీర్వా తలుపు వేయ్యమని,నీకు ఇలా చేప్తే కాదే ఉండు అంటూ దేనితోనో ఎవరినొ బాగ కొడుతున్న సబ్దం,హతాసుదైపొయాడు విజయ్,ఈ సారి నుంచి వేస్తాను అండి ఈ ఒక్కసారికి వదిలేయండి అంటూ వినిపించింది ఒక ఆడ గొంతుక,ఆ ఆర్తనదాలు పదినిమిషాల పాతు అలానే సాగాయి. నిల్చున్నవాడు నిల్చునట్టే ఉండిపొయాడు విజయ్,ఏం జరిగిందో,అసలిప్పుడు జరిగింధి నిజమో లేక కలయో అర్ధంకకున్నధి,నేల వైపు చూస్తూ ముడిపడిన బ్రుకుటితో ఆలొచిస్తూ ఉండిపొయాడు విజయ్,"ఎమయ్యా బైల్దేరుదామ" అంటున్న పద్మనాభం గారి మాటలు విని ఈ లొకం లోకి వచ్చినవాడయ్,సరె నండి అంటూ ఆయినను అనుసరించాడు. కార్లో పద్మనాభం గారి పక్కన కుర్చున్నాడు,కార్ బయలుదేరింది,కార్తో పాటు విజయ్ అలొచనాప్రయానం కూడా.పద్మనాభం గారు భార్యను కొట్టారు అన్న విషయం విజయ్ జీర్నించుకోలేకున్నాడు,స్త్రీ స్వాతంత్రం పేర ఆయిన రాసిన "ఓ స్త్రీ మేలుకో","సంపుర్న స్త్రీత్వం" లాంటి పుస్తకల్లోని మాటలు గ్ణప్తికి వచ్చాయి, "ఓ స్త్రీ దేని కోసం నీ వెతుకులాట, స్వేచ్చ కొసమా ప్రేమ కొసమా, మాట కొసమా,మనిషి కోసమా, ఇచ్చే దానవు నీవు, చేప్పే దానవు నీవు, నేర్పే దానవు నీవు,చేసే దానవు నీవు, ఆ నీవు, అల్పురాలివా????? ఆ అల్పత్వం నీదా??? లేక నిన్ను అబల అనే మాదా???" ఇది రాసింది ఈ మనిషేనా అని ఆస్చర్యచకితుడైపొయాడు విజయ్.కార్ ఆగింది,ఒక పేద్ద భవంతి ముండు,అది ప్రముఖ నిర్మాత దర్శకుడు అయిన జంపర్ల నరసిమ్హం గారి స్టుడిఓ,దిగి మెల్లగా పద్మనాభం గార్ని అనుసరించాడు విజయ్.లోపలకి వెళ్ళగానే నరసిమ్హం గారు పద్మనాభం గార్ని ఎదురు వచ్చి వాటేసుకొని మరీ లొపలకి తోడ్కొని పొయారు,ఎదో సినిమా కి పద్మనాభం గారు కధ రాస్తునట్టు ఉన్నారు,దాని గురించి ఎవో చర్చలు సాగయి కాసేపు,అన్నిటిని వింటూ పక్కనే కూర్చున్నాడు విజయ్,కధ చాలా బాగుంది ఎప్పటిలాగే నచ్చింది,కాని ఎక్కడో ఎదో వెలితి,ఈ కధ బాగుంది అని మనస్పూర్తి గా అంగీకరించలేకపొతున్నాడు తను. వాళ్ళ చర్చలు ముగిసాయి అప్పటికే సమయం రెండు కావస్తొంది,భొజనానికి లేచారు అందరు,షద్రసోపెతమయిన భొజనం ముగించి,మళ్ళీ చర్చలో పడ్డారు,ఈ సారి చర్చ కధ గురించి కాదు,ఆ సినిమాలో పని చేయబొతున్న కొత్త హీరోఇనె గురించి,ఆ అమ్మైకి ఈ డయ్రచ్టొర్ గారే మొదటి సారిగా అవకాసం ఇస్తున్నారు,"నరసిమ్హం గారు,మరి మీరే చూడాలి,మమ్మల్ని కూడా ఒక కంట కనిపెట్టాలి,ఎంత సేపు చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అనుకుంటే ఎలా అండి,మేము కూడ యవ్వనం లొనే ఉన్నామండొయ్"అంటున్న పద్మనాభం గారి మాటలు విని ఆస్చేర్యపడిపొయాడు ,పద్మనాభం గారి మాటల్లొని ఆంతర్యం అవగతమయ్యింది విజయ్ కు,అలోచనలో పడ్డాడు,పద్మనాభం గారి వయసు సుమారు అరవయ్,ఆ హీరోఇన్ వయసు,వీళ్ళ మాటలప్రకారం చూస్తే ఇరవయ్యి, హు!!!!ఇది నిజమా లేక కలా,ఎమీ అర్దం కావట్లెదు విజయ్ కు,"ఏమయ్య బయలుదేరుదామా మరి అంటున్న పద్మనాభం గారి మాటలు వినపడి ఈ లొకం లొకి వచ్చాడు విజయ్."ఇప్పుడు మన ఆఫీచె కి వెల్దాం పద,అక్కడ ఒక కొత్త సినిమా కి కధ తయారు చేసే ప్రయత్నం లో ఉన్నామయ్య అంటూ చెప్పుకొచ్చారు పద్మనాభం గారు. కార్ బయలుదేరింది,పద్మనభం గారి ఆఫిచె ముందు ఆగింది,ఇద్దరు లోపలికి నడిచారు,పద్మనాభం గారికి ఎదురు వస్తూ "సార్ మీరు చెప్పినట్టు గా స్చ్రిప్ట్ రేడీ చేసాము సార్,ఇక మీరొచ్చి చుడటమే తరువాయి" అంటూ చెప్పసాగాడు ఒక వయిక్తి. సెకరేట్ర్య్ నువ్వు ఘటికుడివయ్యా,నిన్న చెప్పాను ఇవాళ్టికల్లా పని పూర్తి చేసేసావు అంటూ అతని బుజం మీద చెయ్యి వేస్తూ అభినందించారు పద్మనాభం గారు.రండి సార్ రండి కూర్చొండి,ఇదిగో నండి అంటూ పద్మనాభం గారి చేతిలో సుమారు పది కాగితాలను పేట్టాడు పద్మనాభం గారి సెకరేత్ర్య్.ఆ కాగితాలను కాసేపు తిరిగేసారు పద్మనాభం గారు,కాగితాలను పక్కన పెడుతూ,బావుండయ్యా, మొత్తానికి ఈ ఇంగ్లీష్ వాళ్ళు అసాద్యుల్లయ్యో,స్రుజనాత్మకత కాస్త ఎక్కువే వేధవలకి అంటూ సిగరేట్టు వేలిగించారు,అసలేం జరుగుతోందో భొదపడట్లెదు విజయ్ కు.సరేనయ్యా మరి రెండు రొజుల్లో స్చ్రిప్ట్ రేడ్య్ ఐపొతుందని ఆ డయ్రెచ్టొర్ కి కబురు పంపు,ఇదిగో ఆ చేత్తోనే తయ్లం కుడా పంపమన్నని చెప్పు,ఎంటి అర్దం అయ్యిండా అంటూ తన సెచ్రతర్య్ వైపు చుస్తూ బైటకు నడిచాడు,ఆఇననే అనుసరిస్తూ వెనకాల విజయ్ కుడా. ఇంటి దారి పట్టారు ఇక,ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అగింది కార్,ఒక మూల కూర్చొని అడ్డుకుంటూ కనపడ్డాడు ఒక నిర్బాగ్యుడు.అతనిని చూపిస్తూ పద్మనాభం గారు విజయ్ తో "ఆ అడుక్కునే అబ్బాఇ ని పిలవవయ్యా,వాడికి ఈ రెండు రూపాయలు ఇస్తే పుణ్యం పురుషార్దం రేండునూ" అన్నారు.విజయ్ పిలిచాడు,పద్మనాభం గారి రెండు రూపాయలు ఇచ్చి పంపారు.ఇంతలోనే అయిన సెల్ ఫోనె ఆపకుండా మోగటం మొదలుపెట్టింది,దానిని చేతిలోకి తీసుకొని మాట్లాడటం మొదలుపెట్టరు,"ఆ వాడి స్రర్దం,వాడికి అంత సఋఅలం గా రాయటమే వస్థే ఇంక కావలసింది ఎమి ఉండిలే,అయ్నా వాడు ఆ రొటరీ క్లబ్ వాళ్ళతో కుమ్ముక్కయాడు అండుకే ఈ ప్రైజ్ లేకపోతే "సాహితీ సారంగధర" బిరుదు అందుకొవాటానికి మన తెలుగు సాహితీ లోకంలో ఉద్దండ పిండాలు లేరుటండీ, అయినా వాడి కర్మాన వాడు పొతాడు,మనకు అభిమాన సంపద జాస్తిగా ఉంది,వాడి దగ్గర ఎమి ఉంది ఈ బొడి బిరుదులు తప్ప,ఆ ఆ చదివాను లేండి,"శరత్ ౠతువు" నవలే గా,విన్నాను లెండి ఆ నవలకే వచ్చింది ఈ బిరుదు అని,మనలో మన మాట నేను చదివాను అండి ఆ పుస్తకం,అది జేంస్ బయ్యేర్ రాసిన "సీ మీ యాస్ ఇ యాం" నవల్ లో నుంచి పూర్తిగా కాపీ లెండి,మీరు ఇవాళ ఇంటికి రండి మనం తీరికగా మాట్లాడుకొవచ్చు,సరే సరే,అలాగే,ఎదురు చూస్తు ఉంటా,ఉంటా మరి" అంటూ ఫోన్ పెట్టేసారు, ఎండుకో విజయ్ కు చాలా కష్తం గా,ఇబ్బంది గా ఉంది,ఇక ఉండబట్టలేక పద్మనాభం గారి వంక చూస్తూ "కొంచం అర్గేంట్ పని గుర్తుకువచ్చింది,నన్ను ఇక్కడ దింపెయండి,రేపు వచ్చి కలుస్తాను" అన్నాడు.విజయ్ మాటలకు ఆశ్చెర్య పడుతూ,"సరే నీ ఇష్టం, డ్రవర్ కార్ ఆపు,అంటూ ఒక పక్క గా కార్ ఆపించారు" విజయ్ దిగి,పద్మనాభం గారి దగ్గర శెలవు తీసుకున్నాడు. "మేడిపండు చూడ మేలిమయ్యి ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు...." అనే వేమనశతకం లోని పద్యం మదిలో మెదిలింది.....**********************************************************************************************************"ఎమండీ వాడికి ఎమయిండో కొంచం చుడరాదు,ఆ రచయిత ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇదే వాలకం.ఉలకడు పలకడు,భొజనం చెయ్యరా అని బలవంతం చేస్తే,పళ్ళెం ముందు కూర్చొని ఎదో కెలికి వెళ్ళిపొతున్నాడు,ఎప్పుడూ మొహం వేలాడేసుకొని తిరుగుతున్నాడు,వెళ్ళి అడగండి ఎమైందో" అంటూ రామక్రిష్ణ గారి చెవులో ఇల్లు కట్టుకొని పొరుతోంది విజయ్ తల్లి సుమతి. రెండు రొజులనుంచి కొడుకు అంతర్మదనం ఒక కంట గమనిస్తూనే ఉన్నరు రామక్రిష్ణ గారు,ఎం జరిగిందో ఉహించకలిగిన అనుభవం ఆయినది.ఇక లాభం లేదు అనుకొని లేచి కొడుకు దగ్గరకు వెళ్ళారు,తన గదిలో పడుకొని ఉన్నాడు,అలా దీనం గా పడుకొని సున్యం లొకి చూస్తున్న కొడుకుని చూస్తే మనసు చివుక్కు మన్నది రామక్రిష్ణ గారికి."అసుర సంద్య వేళ ఆ నిద్ర ఎమిటి రా" అంటున్న తండ్రి గొంతు విని ఉలిక్కి పడి లేచాడు విజయ్."ఎం లేదు నాన్నగారు కాస్త వంత్లో బాలేదు,అంతె" అంటూ లేచి నిల్చున్నాడు. అతగాడి గొంతు లోని మార్పు,మనసు లోని మధనము,రెండు గమనించారు,కొత్తగా ఎమీ లేదు,ఆయిన ముందుగా ఊహించినదే. "రా అలా బైటకు వెళ్ళి వద్దాం"అంటూ బైటకు నడిచారు. అయిష్టంగానే తండ్రి ని అనుసరించాడు విజయ్.మెల్లగా వీధుల వెంబడి నదుస్తున్నారు ఇరువురు."అన్ని సందేహాలను కడుపు లో పెట్టుకుంటే కడుపుకి అన్నం ఎక్కే ఖాళీ ఉండదు,అన్నం ఎక్కకపోతే,మీ అమ్మ ఎడుపు కు అంతం ఉండదు,అంతం లేని ఆ ఎడుపు వల్ల,నాకు తలనొప్పి రాకుండా ఉండే ఆస్కారమే లేదు,అంచేత త్వరగా నీ సండేహ నివ్రుత్తి ఘట్టం మొదలుపెడదామా" అంటున్న తండ్రి వంక చూస్తూ మనసులోనే ఆస్చేర్యపోయాడు విజయ్.తన కంటే బాగా తన గురించి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి తన తండ్రి కాబోలు అనుకుంటూ... "ఎం చెప్పమంటారు నాన్న గారు,తన రచనల్లో స్త్రీ స్వాతంత్రం స్త్రీ స్వేచ్చ,సాంఘిక భందాల్లో స్త్రీ,అంటూ స్త్రీల మీద ఎంతో సానుబూతిని కనబరిచిన రచయిత,ఇంట్లో భార్య మీద దాష్టికం చేలాయిస్తాడు,రావణాసురుడి లో ఉండే రాక్షసత్వన్ని తన చేతల్లో చుపించాడు,రావనుడు సీత ను చేరపడితే,ఇతను సినీతార ను.మానవ సేవే మాధవ సేవ అని రాస్తూ,తన పాపాలను కడిగే సాదనం గా నిర్భాగ్యులను చూస్తాడు,రేండు రూపయల్లో పున్యం పురుషర్దం రెండూ వచ్చేయాలనే తపన,తయ్లం పేర కొట్లకి కొట్లు కొంపలో మూలగాలనే దురాశ.ఒకరు ఎదిగితే ఒర్వలేడు,సొంతగా ఎదగలేడు,ఎవరో రాసిన వాటిని కాపీ కొట్టి,అద్బుతమైన పదజాలం వాడి ఆద్యంతం ఆనందడోలికల్లో తేలియాడించి,తన రచనల రుచి మరిగిన నాలాంటి పాఠక అర్భకులని,వారి మనొభావలని కించపరుస్థున్నాడు,ఇది క్లుప్తం గా నా అభిమాన రచయిత,ఆయిన మీద నా కొత్త రివిఎవ్" అంటూ ఆవేసం గా చెప్పాడు విజయ్.వింటున్న మీకే ఇలాంటి రచయతలు కుడా ఉంటారా అని ఆశ్చెర్యం కలిగి ఉండచ్చు,ఇక అనుభవం లొకి వచ్చిన నాకు అంతర్మధనం కాక ఇంకేమిటి నాన్నగారు అంటున్న కొడుకు ని చుస్తూ రామక్రిష్ణ గారు..."విజయ్,ఒక రచన అనేది ఎన్ని రకాలుగా జనిస్తుందో చెప్పగలవా??" అంటూ సూటిగా ప్రశ్నించారు"లేదు నాన్న గారు,చెప్పండి" అన్నాడు విజయ్."ఒక రచయత తన మనసులో ఉన్నది ఉనట్టు గా ఒక కధ గారస్తాడు....తన చుట్టూ ఉన్న ప్రపంచన్ని,అందులో ఉన్న విభిన్న మనస్తత్వలని గమనిస్తూ,అలొచిస్తూ,ఆ అలొచనల్లో నుంచి వచ్చిన ఒక ఊహతో ఒక కధ రాస్తాడు....ఒక వ్యక్తి,లేక ఒక వ్యవస్త తన మనసకు ఇలా ఉండాలి అని అనిపించినప్పుడు,అది నిజ జీవితంలో తనకు తారస పడక, క్షోబ చెంది తన కలానికి పనిచెప్పినప్పుడు పుడుతుంది మరొక కధ....సంఘజీవి అయిన తను పరపతికి తలవొగ్గి,తనలొనే అనిచివేసుకున్న ఎన్నో కొరికలకి రూపం ఇస్తూ రాసే కధలు ఇంకో రకం,వీటినే పర్వర్టేడ్ రచనలు అంటాం మనం....తనలోని మలినాన్ని కడిగెస్తూ,మంచితనాన్ని చుపిస్తూ పుట్టిస్తాడు మరికొన్ని కధలను...."ఇన్ని రకాలు గా ఒక కధ జనిస్తుంది...రచనను బట్టి రచయతను అంచనా వేయటం చాలా తప్పు. కాపీ కొట్టాడు,నా మనొభావలతో అడుకుంటున్నాడు అన్నావు,నిన్ను తన రచనలు చదవమన్నడే కాని తనను అభిమానించమనలేదు గా,అంటే నీ ఇష్ట ప్రకరాం నువ్వు ఎంచుకున్నావు అతగాడిని...అతను రాసిన ఎదో ఒక పుస్తకం నీకు బాగా నచ్చి ఉంటుంది,ఇక మెల్లగా ఇష్టపడావు,ఆ ఇష్టం ఆరధన గా,ఆపై పిచ్చి గారూపంతరం చెంది,అతగాడిని కలవటమే నీ జీవితం లో ఉన్న ఒకేఒక్క లక్ష్యం గా మారింది. ఈ ప్రక్రియ అంతటి లోను ఎక్కడన్న ఎప్పుడన్నా ఒక్కసారి ఆగి అలొచించావా?????ఇతను రాస్తున్నది ఎంత వరకు సమంజసం అని.....నువ్వే కాదు చాలా మంది తమకు నచ్చిన రచయితో లేక కవిఓ..ఎవరైనా సరే....పిల్లి పరిగెత్తింది అని రాసినా...ఆహ ఒహొ అద్బుతం అమొఘం...ఒక జంతువు తన అడుగుల వేగం హెచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో...దాని హవభావాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు రాసారు ఫలానా రచయిత..రచనలంటే వారివి..రచయిత అంటె వారు... సాహితీ మేదొసంపత్తి అంటే ఆయినదే...ఆయిన మనిషి కాదు దేవుడు..అంటూ... లేని గొప్పదనాన్ని ఆపదించి..మేరుపర్వతం అంతటి వ్యక్తిత్వన్ని అంటించి చుస్తారు.... ఆ తప్పు రచయతలది కాదు..చుసే పాఠకులది...అద్భుతమయిన రచన జాలువారిన కలము లొ సిరా ని కూడా అమ్రుతం లా చుడటంలో తప్పు పాఠకుడిది కాని రచయతది ఎంత మాత్రము కాదు.....కాపీ చేసాడు నిజమే...కాపీ చేసాడు చేసాడు అంటూ అదే పనిగా దాని గురించే మాట్లాడకపొతే...కాపీ చేసిన బానే రాసాడు అనుకొని వదిలేయ్..లేకపొతే వేధవ కాపీ కొట్టాడు అనుకొని తీసి పడేయ్....దాని గురించి అంత వాదులాట..అంత కాలయాపన ఎండుకు రా....."ఒక రచయిత లోని, లేక ఒక కవి లోని,..సరిగ్గా చెప్పాలంటే ఒక కలాకారుడి లోని "విద్వత్తు" ని అభిమానించు,అభిమానానికి ప్రేమ కి నడుమ ఒక సన్నటి పొర ఉంది..ఆ పొరను గుర్తించకలిగే నేర్పుని అలవరుచుకో...ఒక మనిషి లొని కొన్ని గుణగణాలు నచ్చటం అభిమానానికి కారణం...ఎది నచ్చినా ఎది నచ్చకున్నా కొన్ని సార్లు ఎదో ఒక కారణం వల్ల ..చాలా సార్లు అ కారణం లేకపొయినా జనించేది ప్రేమ....ఒక మనిషిలోని విద్వత్తుని ప్రేమిస్తు ఆ మనిషినే ప్రెమిస్థున్నా అని మనకు మనమే ముసుగు వేసుకోవటం ఎంత వరకు సమంజసం అలొచించు ....నువ్వు ఇష్టపడ్డావు కదా అని నీ డ్రీం హీరో లా ఉంటాడు అని ప్రతి కలాకారుడి గురించి అంచనా వేయకు..." తంద్రి మాటలు విన్న విజయ్ కు ఒక్కసారిగా ఆలొచనా ప్రవాహం కొత్త మలుపు తిరిగినట్టు గా అనిపించింది.ఇలా కుడా అలొచించచ్చు కదా అనుకున్నాడు లొలొపల.....తంద్రి వంక చూస్తూ "రెండు రొజుల నుంచి ఇదే అలొచిస్తూ మదనపడుతున్నా అని మీకు తైల్సీ ఎందుకు ఊరుకున్నారు నాన్నగారు,ఇవే మాటలు రెండు రోజుల ముండే చెప్పి ఉండచ్చు కదా అని ప్రశ్నించాడు" అమాయకంగా ప్రశ్నిస్తున్న తన కొడుకుని మురిపెంగా చుస్తూ "తెలివగలవాడిలో ఉన్నది తెలివితక్కువవాడికి లేనిది ఎమిటో చెప్పు??" అన్నారు...వెంటనే తెలివి అనేసాడు విజయ్... కళ్ళల్లో చెప్పెసాగా నేను అనే ఆనందం తొనికిసిలాదుతుండగా.... ఎంత యెదిగినా...ఇంకా చిన్నగానే కనపదుతున్న తన కొడుకుని ఆప్యాయం గా దగ్గరకు తీసుకుని,భుజం చుట్టు చేతులు వేసి..."తెలివిగలవాడికి తెలివితక్కువవడికి తెడా "అలొచనా", ఒక విషయం జరిగినప్పుడు,ఒక అనుభవం ఎదురయినప్పుడు,తెలివిగలవాడు అలొచిస్తాడు,ఎందుకిలా జరిగింది,దీనికి కారణం ఎంటి,దీనికి పరిష్కారం ఎంటి,అసలు ఉన్న పరిష్కార మార్గలెన్ని,అంటూ విభిన్న కొణల్లో ఆలొచించి,ఆ అనుభవం లొనుంచి పాఠం నేర్చుకుంటాడు,తద్వారా తన జ్ణానసంపదనను పెంచుకుంటు పొతాడు. మరి తెలివిలేనివాడు,ఆ అలొచన లొపించటం వల్లే..అనుభ్వాలను గత జీవితపు చేదు గుర్తులుగా మిగులుచుకొని,అసమర్ధుడి గా,చెతకాని వాఇ గా మిగిలిపొతాడు, అంతే కాని పుట్టుకతోనే తెలివి రాదు,వచ్చేది గ్రహించుకునే శక్తి మాత్రమే,అది కుడా కొందరికి కాస్త ఎక్కువ గా,కొందరికి కాస్త తక్కువ గా,అలొచిస్తూ ఉంటే ఆ గ్రహనించుకునే శక్తి దాంతట అదే పెరుగుతుంది,నువ్వు తెలివిగలవాడివి అవ్వలనే నా కొరిక మరి" అన్నారు. నాన్న గారు అన్నం తినలి పదండి ఇంటికి వెల్దాం,కడుపు ఖాలీ అయిపొయింది అంటూ తండ్రి చేయి పట్టుకొని ఇంటిదారి పట్టడు విజయ్. తండ్రి చేతి స్పర్సలో,ఆ తెయ్యదనాన్ని,ఆ కమ్మదనాన్ని కడుపారా ఆరగిస్తూ.........

16 comments:

Gouthami said...

hi akka,..nice story...meeru elagaina bane raastharu..,..meeru choose chesukunna theme bagundhi...it really happens,..manam chaala abhimaninche vallu...like writers kavachu,..film actors kavachu...valla gurinchi manaki thelsindhi vini manam vaalla meeda abhimanam penchukuntam.....kaani when we see them in reality..kondaru manchiga manam anukunnattu untaru,..kondaru ala undaru...asalu excellent theme...really....
n meeru raasina daantlo...father n son gurinchina relation bagundhi...
malli chepthunnanu,..theme aythe baaga nachindhi,..mari inka mundhu kada ela untundhoo kaani,...its really good,...

Anonymous said...

chala bavundi sru.chala interest ga undi.mottam fast ga complete cheyyi.neeku ilanti thoughts ela vastayo gani.excellent subject.chaduvu too unte nijam kalla mundu choostoo unnatlu undi. inka ilanti kotta kotta topics lo rastavani asistoo unta...........

Anonymous said...

It's a good story. waiting for seeing remaining portion. Expressed Father and Son relationship naturally as it happens. looks some what lady biased story.However it's good.

Srujana said...

@Anonymous
Thanks for your comment. Gud to know that you are waiting for the coming part of the story...
Its not a biased story..
Being a writer i am not baised to any Gender, theme is what is more important for me..
Hope you will get to know this once u read the complete story..
Because, this story is no way related to a specific gender but more related to the perception and way of thinking a person ought to have...

Surya Naga Bhushan said...

hello manaswini gaaaru,

mee katha chadivaanu, theam baagumdi. kanumarugu avutunna relations gurimchi chaalaa chakkagaa cheppaaru. kaani meeru vupayogimchina language thone chikku gaa umdi. adi meeru anukunnamtha free flow ledu. emdukano theliyadu gani meeru emchukunna bhaasha gramdhikam mix kaavadam vallane ee problem vastomdi. vyavahaara bhaasha use chesi umte katha superb gaa umdedi. for example oka chinna instance chudamdi...... "poojaagruhamunandu bhagavanthudi mundu kaymodchi nilchoni...." ... chusaaraa ee kaalamlo ee language vaadatam assalu kanabadadu.

alaage maroka vishayam kudaa chebudamanukumtunnaanu... meeru raasina katha lo sentences chaalaa peddavigaa unnaayi. aadhunika kathaa saahityam lo ee tarahaa shaili vaadatam ledu. elaa pedda sentences umte paathakulu bore feel ayye pramadam umdi. first line of ur story contains almost 22 words and the second one 19!!!

elaa chinna vishayaalu meeru manage chesukogaligithe u will be a good writer very soon. I hope this will not hurt you very much. take it as a encouragement suggestion. dont get angry with me please.

Bye

Surya Nag.

Srujana said...

@Surya Nag
Thanks andi mee salahalaku..
veeti gurinchi nenu thappaka alochisthanu...

Mahi said...

chala bagundhi.meeru excellent gaa rasthunnaru.nakasalu technical books

thappa nontechincal chadive alavate ledhu.veerabhimanini aipothunna

meeku.nenu kuda vijay lage alochisthanu,ela alochinchalo cheppinanduku

thanks.future lo naaku ilanti situation rakunda munde

alochimpachesinanduku thanks.peru chala baaga suit ayyindi.

Anonymous said...

relation ship baga choopistunnavu kadha lo.adi baga nachindi.waiting for remaining storyyyyyyyyyy

Sriram said...

Now that you have completed it, my comment is due :)

second half of the story was really good and just kept me glued to the monitor till i completed it. keep it up!

Anonymous said...

hey ippudu complete ga chadivanu.chala baga rasavu.nijam ga excellent theme.awesome.

Rajitha Pachava said...

Hi madam,chala bavundhi. manchi message.keep on writing like this.

vivek said...

hi akka....kadha chadivanu,..chaala bagundhi...kaani naakaithe lastlo,..father n son conversation koncham thakkuvaga unte bagundhi anipinchindhi,..ante,.inka up to the point..inka koncham sootiga undalsindhi,...kaani ala chesthe anukunna meaning raadhemo kaani...koncham thaggisthe bagundedhi..
n I DIDNT OBSERVE THE TITLE BE4,..chaala baga pettaru,..its very apt 4 the story...

spandana said...

ముత్యాల్లాంటి తెలుగు అక్షరాల్లో రాస్తూ రాస్తూ అలా ఒక్కసారిగా ఆంగ్ల అక్షరాల్లోకి మారిపోయారేంటి?

--ఫ్రసాద్
http://blog.charasala.com

రాధిక said...

అంతా చదవలేదండి.ఇంగ్లీషులో వున్నదాన్ని సగం వరకు చదవగలిగాను.తరువాత కష్టమయింది.చదివినంత వరకు మాత్రం చాలా బాగుంది.నాకు మీ about me చాలా నచ్చింది.

Unknown said...

ఇంత మంచి కథను ఇలా మద్యలో ఆపడమేమి బాలేదండి. త్వరగా మిగతా భాగంకూడా బ్లాగుకెక్కించండి.

Unknown said...

Hi Srujana Nice story chala bagundhi.prasthutham chala mandhi alane vunnaru rathallo vundedhi chethallo chupincharu,evari meeda abhimanam ekkuvaga penchkokudadhu ani ee youthki telesela baga chepparu .
Waiting for your next story.