Tuesday, April 10, 2007

మాకొద్దీ పెద్దతనము

నువ్వు ఔట్ నువ్వు ఔట్,ఇదిగో చూడు నీకంటే ముందు నేనే గీత దాటి వచ్చేసాను అంటూ చప్పట్లు కొడుతూ ఎగురుతున్నాడు విష్ణు....
ఏం కాదు నేనే ముందొచ్చాను..నువ్వే ఔట్ నువ్వే ఔట్...అంటూ విష్ణుని తొసేసాడు రఘు...
ఆ తొపుడుకి కింద పడిపొయాడు విష్ణు...మొకాలు దోక్కు పొయింది...సన్నటి ధారగా బైటకు వచ్చిన రక్తం....
అమ్మా!!!ఆ ఆ!!! అంటూ ఎడుస్తూ ఇంట్లొకి పరిగెత్తాడు విష్ణు...
**************************************************************
ఎవమ్మొ భారతమ్మా బైటకురా...నీ కొడుకు నా కొడుకుని కొట్టాడు ఇదిగో రక్తం కారిపొతోంది నాబిడ్డ కి చూడు...ఎం పెంపకం అమ్మా..... పిల్లల్ను కనగానే సరిపొదు పెంచటం కూడా తెలియాలి...

ఒహొ పెద్ద చెప్పొచ్చావులే..నీ కొడుకు ఎదో అల్లరి పని చేసి ఉంటాడు,దెబ్బ తగిలి ఉంటుంది,నీ నొటికి దడిచి మా రఘు గాడి మీద చెప్పి ఉంటాడు నీకు....అయినా ఎందుకు ఓ గొంతేసుకొని పడిపొతావ్ అందరి మీద...ఇదిగొ నీ ఈ గొంతు తట్టుకోలేకే నీ మొగుడు సన్యాసుల్లొ కలిసిపొయాడు


ఓసి నీ మొహం మండ....నా మొగుడు నిక్షేపంగా ఉంటే ...సన్యాసుల్లొ కలిసిపొయాడంటావెంటే..వెర్రి కుంక...నొరు మూస్కొని ఉండవే...నీ భాగోతం ఎవరికి తెలియదు గనుక...ఏనాడన్నా అత్తకి కూడు పెట్టిన మొహమేనా అది...పాపం పుణ్యాత్మురాలు త్వరగానే వెళ్ళిపొయింది...


అయ్యో మా అత్త గురించి ఎందుకు లేమ్మా..సహజం గానే పొయింది పెద్దావిడ...మీ అత్తే పాపం మందు పెట్టి మరీ చంపావట గా....లోకం అంతా కొడైకూస్తొంది...అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు ఎవరికి తెలియదు నీ సంగతి...



నా సంగతి తెలియని వాళ్ళు ఉంటారేమో కాని..నీ గురించి ఈ వీధిలొ ఏ చెట్టు ని అడిగినా ఏ పుట్టను అడిగినా చెప్తాయి..అయినా నీ నొట్లో నోరు పెట్టటం అంటే ..రాయి వేయటమే...
యెహే పోవే...నీతో నాకెంటి..నీతి జాతి లేని దానివి...ఈ జన్మలొ మా విష్ణుతో మీ వాడిని కలవనీయను...

అబ్బో పేద్ద వచ్చింది అండి...ఈవిడో మహరాణి...వాడొక యువరాజు....పొ పొవమ్మా..... నీతో మట్లాడితేనే పంచమహా పాతకాలు చుట్టుకుంటాయి

చి పొ...

చ పొ.....

ఒరేయ్ విష్ణు..విష్ణు..ఎక్కడ ఎడ్చావు రా..

రఘు ..ఊ అనవే...పలకవే రా..ఎక్కడ ఉన్నావు రా...
***************************************************************
విష్ణు రఘు ఇద్దరూ ఇసుకలో...

"విష్ణు దెబ్బ తగిలిందా?????..సారీరా...నువ్వే గెలిచావు..నేనే తొండి ఆడాను..సరేనా...."

"కాదు లేరా రఘు...నువ్వే గెలిచావు..."

"ఒరేయ్ విష్ణు నువ్వే గెలిచావు..దెబ్బ చూపించు..అయ్యో రక్తం కూడా వచ్చిందా..సారీరా!!!!!"

"అయ్యొ రఘు ఎందుకురా ఎడుస్తావు....ఉండు,ఇలా రా....కళ్ళు తుడుస్తా ఉండు....హా ఇప్పుడు లేవు లె నీళ్ళు...ఇంక ఎడవకు...ఈ దెబ్బ రేపటికల్లా మాడిపొతుందిరా...దా మనం ఇళ్ళు కట్టుకుందాం"

"సరే పద విష్ణు..ఇంకెప్పుడూ నిన్ను కొట్టను,పడెయ్యను మథర్ ప్రామిసె..., ఈ ఇసుక ఇల్లు కూడా నీకే ఇస్తాను...ఉండు కడతాను..చేయి పెట్టు ఇలా...."

పది నిమిషాల్లో తయారయ్యింది..ఇసుక ఇల్లు...

విష్ణు రఘుల పసితనపు స్వచ్చత్తకు గుర్తుగా...........
కుటిలత్వమెరగని వారి మనసుకు ప్రతీకగా...............
గొడవలు గండరగోళాలు దరిచేరని ఆనందతీరంగా.......
పెద్దతనపు చాయలే లేని అమాయకపు హృదయముగా...........
ఈర్ష్యా ద్వేషాలు ఎరుగని దేవుడి కోవెలలా................

తమ ఇసుక ఇంటిని చూస్తూ ఎగురుతున్న రఘు విష్ణుల నవ్వులలో.....
"పెద్దతనంలో ఇన్ని ఆలోచనలు..ఇన్ని గొడవలు..ఇంత కాటిన్యము ఉన్నయి గావున..మాకొద్దు ఈ పెద్దతనము" అన్న భావమేదో స్పురించిది వారిరువురి తల్లులకు
******************************************************************************

7 comments:

Anonymous said...

naku ma oorilo unnatlu anipinchindi okkasariga chaduvutunte.navvukuntoo chadivanu.bavundi.chala natural ga undi.theme kooda bavundi.

vivek said...

hey,..tooo shortttt n too sweeettttttttt...chaala bagundhi...asalu aa potlata aythe...superb...surya kantham,.chaaya devi lanu inspiration ga theesukunnara raasetappudu????
n theme kuda bagundhi....too cute

Anonymous said...

bagundi...inka rayandi....manchi rachayitri kavalani asisthunnanu..
--Rahul

Unknown said...

simple and marvellous ...story ki thagga title ......Ravi

Anonymous said...

చాలా బాగుందండి.

leo said...

evaro famous writer mark twain/tolstoy anukunta sarigga gurthu ledu. Ilaanti kathe chivarlo kaagitham padavalatho aadukuntaaru. manaki daggaraga chaala chakkaga cheppaaru.

S said...

బాగుందండి.